రూట్ మ్యాప్ రెడీ అయిందట

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ రూట్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. ఆమె జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టనున్నట్లు వార్తలు వచ్చాయి. పశ్చిమ బెంగాల్ లో సాధించిన [more]

Update: 2021-05-22 17:30 GMT

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ రూట్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. ఆమె జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టనున్నట్లు వార్తలు వచ్చాయి. పశ్చిమ బెంగాల్ లో సాధించిన విజయంతో ఉత్సాహంతో ఉన్న మమత బెనర్జీ త్వరలోనే రాష్ట్రాల పర్యటన చేపట్టనున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ కొంత తగ్గుముఖం పట్టిన వెంటనే వివిధ ప్రాంతీయ పార్టీల నేతలను మమత బెనర్జీ కలవనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మూడోసారి సీఎంగా….

పశ్చిమ బెంగాల్ లో మూడోసారి ముఖ్యమంత్రి అయిన మమత బెనర్జీకి ఇప్పుడు దేశ వ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. మోడీ, అమిత్ షాలను ఎదిరించి నిలబడిన నేతగా మమత బెనర్జీ పాపులర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ వైఖరితో విసిగిపోయి ఉన్న అనేక రాష్ట్రాలు ఇప్పుడు మమత బెనర్జీ వైపు చూస్తున్నాయంటున్నారు. మోదీని ఎదిరించాలంటే ఒక్క మమత తోనే సాధ్యమని, గాంధీ కుటుంబం వల్ల కాదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

జాతీయ రాజకీయాలపై…..

మమత బెనర్జీ కూడా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తాను ఈ ఎన్నికలు పూర్తయిన వెంటనే జాతీయ రాజకీయాలపై దృష్టి పెడతానని, ఢిల్లీ గద్దె నుంచి గుజరాతీలను పంపిస్తానని మమత బెనర్జీ శపథం చేశారు. ఈ నేపథ్యంలో మమత బెనర్జీకి అన్ని రాష్ట్రాల నుంచి మద్దతు లభిస్తుంది. ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్, బీహార్, ఢిల్లీ, ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల నేతలు మోదీ పాలన పై విముఖంగా ఉన్నారు.

రాష్ట్రాల పర్యటనకు…..

ఈ నేపథ్యంలో మోదీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటుకు మమత బెనర్జీ సిద్ధమవుతున్నారని తెలిసింది. కాంగ్రెస్ లోనూ సీనియర్ నేతలు మమత బెనర్జీ నాయకత్వాన్ని నమ్ముతున్నారు. దీంతో మమత బెనర్జీ రాష్ట్రాల పర్యటనకు సమాయత్తమవుతున్నారని తెలిసింది. వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ యేతర ముఖ్యమంత్రులను, ఇతర రాష్ట్రాల్లో విపక్ష నేతలను కలిసేందుకు మమత బెనర్జీ సిద్దమయ్యారంటున్నారు. మరి మమత బెనర్జీ జాతీయ రాజకీయ ప్రయాణం ఎలా సాగుతుందో చూడాలి.

Tags:    

Similar News