మమత వార్నింగ్ వారికే ఎందుకు?

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ మరోసారి అధికారాన్ని అందుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. కానీ మమతకు బీజేపీ తలనొప్పిగా మారింది. లోక్ సభ ఎన్నికల్లో సాధించిన విజయాలతో పశ్చిమ [more]

Update: 2020-01-11 17:30 GMT

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ మరోసారి అధికారాన్ని అందుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. కానీ మమతకు బీజేపీ తలనొప్పిగా మారింది. లోక్ సభ ఎన్నికల్లో సాధించిన విజయాలతో పశ్చిమ బెంగాల్ ను తమ అధీనంలోకి తెచ్చుకోవాలని బీజేపీ అన్ని ఎత్తులన వేస్తుంది. దీంతో మమత బెనర్జీ పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్రంలో నిరసనలు తెలియజేస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా దీనిపై ఆందోళనలను నిర్వహించాలని పిలుపునిచ్చారు.

బీజేపీ బలం తెలిసిందే….

అయితే బీజేపీ బలం తెలుసు కాబట్టి ఆ ప్రాంతాలపై మమత బెనర్జీ ప్రత్యేక దృష్టి పెట్టారు. అయితే కాంగ్రెస్, వామపక్షాల విషయంలో మమత బెనర్జీ భయపడుతున్నారు. కాంగ్రెస్ మహారాష్ట్ర, హర్యానా, జార్కండ్ ఎన్నికల్లో బలం పుంజుకోవడంతో ఆ ప్రభావం వెస్ట్ బెంగాల్ లోనూ ఉంటుందన్న ఆందోళనలో దీదీ ఉన్నారు. తనకు ప్రధాన శత్రువైన బీజేపీ తో ఎంత అప్రమత్తంగా ఉండాలో కాంగ్రెస్, వామపక్షాల విషయంలో కూడా అదే వైఖరిని అవలంబించాలని నిర్ణయించుకున్నారు.

ఒంటరిగానే…..

రానున్న ఎన్నికల్లో మమత బెనర్జీ ఒంటరిగానే బరిలోకి దిగనున్నారు. భారతీయ జనతా పార్టీది కూడా అదే పరిస్థితి. ఇక కమ్యునిస్టులు, కాంగ్రెస్ పార్టీలు కలసి పోట ీ చేసే అవకాశముంది. గత లోక్ సభ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడంతో రాజకీయంగా నష్టాన్ని చవి చూడాల్స వచ్చింది. స్థానిక కాంగ్రెస్ నేతలకు కమ్యునిస్టులతో పొత్తు ఇష్టం లేకున్నా హైకమాండ్ సూచనల మేరకు కమ్యునిస్టులు, కాంగ్రెస్ లు పోటీ చేసే అవకాశాలున్నాయి. ఇది మమత బెనర్జీ ఆందోళనకు కారణమంటున్నారు.

వారు బలోపేతం కాకూడదని…..

అందుకోసమే ఇటీవల కాలంలో మమత బెనర్జీ కాంగ్రెస్, వామపక్ష పార్టీలపై మమత బెనర్జీ విరుచుకుపడుతున్నారు. అనవసర విషయాలపై రచ్చకు మమత దిగుతున్నారు. తరచూ ధర్నాలు, ఆందోళనలు దిగుతున్న వామపక్షాలపై మమత బెదిరింపులకు దిగారు. బెంగాల్ లో ఆర్థిక అనిశ్చితిని సృష్టించేందుకే వామపక్షాలు, కాంగ్రెస్ లు తరచూ ఆందోళనలకు పిలుపు నిస్తున్నాయని మమత చిందులు తొక్కారు. తాను మళ్లీ అధికారంలోకి రావాలంటే వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలు పుంజుకోకూడదన్న ఆలోచనతోనే మమత బెనర్జీ ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అందుకే సీఏఏకు వ్యతిరరేకంగా విపక్షాలు ఏర్పాటు చేసిన సమావేశానికి మమత దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. మమత బెంగంతా ఈ రెండు పార్టీలపైనే ఉన్నట్లుంది.

Tags:    

Similar News