మమతకు ఏదీ కలసి రావడం లేదే? ముందు ముందు?
పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీకి ఇబ్బందులు ఎదురవుతున్నట్లే కన్పిస్తుంది. దీనిని బీజేపీ తమకు అనుకూలంగా మలచుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. అసలే కరోనా వైరస్ వ్యాప్తితో పశ్చిమ [more]
పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీకి ఇబ్బందులు ఎదురవుతున్నట్లే కన్పిస్తుంది. దీనిని బీజేపీ తమకు అనుకూలంగా మలచుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. అసలే కరోనా వైరస్ వ్యాప్తితో పశ్చిమ [more]
పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీకి ఇబ్బందులు ఎదురవుతున్నట్లే కన్పిస్తుంది. దీనిని బీజేపీ తమకు అనుకూలంగా మలచుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. అసలే కరోనా వైరస్ వ్యాప్తితో పశ్చిమ బెంగాల్ లో అనేకమంది ఉపాధి కోల్పోయారు. లాక్ డౌన్ నిబంధలను అమలు చేయడంతో పూట గడవని పరిస్థితి నెలకొంది. దీంతో పాటు ప్రభుత్వం నుంచి పెద్దగా పేద, మధ్య తరగతి ప్రజలకు సాయం కూడా అందడం లేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి.
కరోనా వైరస్ సమయంలోనూ…..
కరెోనా వైరస్ సమయంలోనూ పశ్చిమ బెంగాల్ లో రాజకీయ వేడి అలుముకుంది. శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో మమత బెనర్జీ హ్యాట్రిక్ విజయం సాధించేందుకు అన్ని రాజకీయ పార్టీలూ రెడీ అయ్యాయి. మమత బెనర్జీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సాయం తీసుకున్నారు. ప్రశాంత్ కిషోర్ టీం సర్వేలు చేస్తున్న దశలోనే కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో వారు తమ ప్రాంతాలు వెళ్లిపోయారు.
బీజేపీ సోషల్ మీడియా…..
దీంతో సోషల్ మీడియాలో ముందున్న బీజేపీ దీనిని తమకు అనుకూలంగా మలుచుకుంది. మర్కజ్ మసీదు ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిని సకాలంలో గుర్తించకపోవడం, సామూహిక సమావేశాలకు ఒకవర్గానికి అనుమతి ఇస్తున్నారన్న విమర్శలను మమత బెనర్జీ పై సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోశారు. దీంతో సోషల్ మీడియా దాడిని తట్టుకోలేక కొన్నాళ్ల క్రితం ప్రశాంత్ కిషోర్ ను హడావిడిగా మమత బెనర్జీ పిలిపించారు కూడా.
తుఫాను సమయంలోనూ…..
ఇక ఇటీవల వచ్చిన ఆంఫన్ తుఫాను పశ్చిమ బెంగాల్ కు తీవ్రనష్టం కల్గించింది. కోల్ కత్తా ఎయిర్ పోర్టులోకి కూడా నీళ్లు చేరాయి. దాదాపు మూడు రోజుల పాటు విద్యుత్తు సరఫరాను ప్రభుత్వం పునరుద్ధరించలేకపోయింది. దీంతో మమత బెనర్జీపై ప్రజలు తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. తుఫాను సరిగా హ్యాండిల్ చేయలేదంటూ బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్ లో పర్యటించి వెయ్యికోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. దీనిని కూడా బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. విపత్తును కూడా బీజేపీ నేతలు రాజకీయం చేస్తున్నారని, అది సరికాదని, నచ్చక పోతే తనను కాల్చి వేయండి అని మమత బెనర్జీ అనడం ఆమె దీనస్థితికి అద్దం పడుతోందంటున్నారు విశ్లేషకులు. మొత్తం మీద మమత కు భవిష్యత్ లో కష్టాలు తప్పేట్లు లేవు.