నిలువరించేది ఎలా?
మమత బెనర్జీ పూర్తిగా ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయారు. మమత బెనర్జీ దృష్టంతా ఇప్పుడు శాసనసభ ఎన్నికలపైనే ఉంది. త్వరలోనే ఎన్నికలు జరగనుండటంతో మమత బెనర్జీ ప్రత్యేక [more]
మమత బెనర్జీ పూర్తిగా ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయారు. మమత బెనర్జీ దృష్టంతా ఇప్పుడు శాసనసభ ఎన్నికలపైనే ఉంది. త్వరలోనే ఎన్నికలు జరగనుండటంతో మమత బెనర్జీ ప్రత్యేక [more]
మమత బెనర్జీ పూర్తిగా ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయారు. మమత బెనర్జీ దృష్టంతా ఇప్పుడు శాసనసభ ఎన్నికలపైనే ఉంది. త్వరలోనే ఎన్నికలు జరగనుండటంతో మమత బెనర్జీ ప్రత్యేక దృష్టి పెట్టారు. మరోవైపు తన ప్రధాన శత్రువు భారతీయ జనతా పార్టీ రోజురోజుకూ బలపడుతుండటం కూడా ఆమె అప్రమత్తతకు కారణంగా చెప్పాలి. ఎప్పుడూ ఒంటరిగా పోటీ చేసే మమత బెనర్జీ ఈసారి పొత్తులపై ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
లోక్ సభ ఎన్నికల ఫలితాలతో…
పశ్చమబెంగాల్ లో కాంగ్రెస్, కమ్యునిస్టులది ఒకప్పుడు ఆధిపత్యం. వాటిని రెండింటినీ ఛేదించుకుని మమత బెనర్జీ సొంతంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి అందలం ఎక్కారు. రెండుసార్లు మమత బెనర్జీకి అధికారాన్ని అందించారు పశ్చిమ బెంగాల్ ప్రజలు. అయితే ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు మమత బెనర్జీ పట్ల ప్రజా వ్యతిరేకత ఉందని అర్థమయింది. తృణమూల్ కాంగ్రెస్ కు 22 పార్లమెంటు స్థానాలు లభిస్తే భారతీయ జనతా పార్టీ 18 స్థానాలను దక్కించుకుంది.
క్యాలెండర్ ను రూపొందించుకుని….
ఇది ఒకరకంగా మమతకు మేలుకొలుపు లాంటిదే. లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి మమత ఊపిరి సలపకుండా రాష్ట్ర పర్యటనలు చేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ ను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్నారు. ప్రతి ఎమ్మెల్యేలకు లక్ష్యాలను నిర్దేశించారు. ప్రతి కార్యకర్త గ్రామాలను సందర్శించి సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయాలని క్యాలెండర్ రూపొందించారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఒక సెల్ ను ఏర్పాటు చేశారు.
పొత్తుపై పరిశీలన….
దీంతో పాటుగా పొత్తులతో వెళితే ఎలా ఉంటుదన్న దానిపై కూడా మమత సీరియస్ గా ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే జరిగే పరిణామాలు, కాశ్మీర్ విభజన అంశం, హిందూ ఓటు బ్యాంకు చీలిక వంటి వాటిపై ప్రశాంత్ కిషోర్ టీం సర్వేలు నిర్వహిస్తుంది. ఈ సర్వే నివేదిక రాగానే కాంగ్రెస్ తో పొత్తు లాభదాయకమని భావిస్తే మమత బెనర్జీ మొగ్గుచూపుతారంటున్నారు. బీజేపీని నిలువరించే లక్ష్యంగా మమత బెనర్జీ అన్ని రకాల అవకాశాలనూ దీదీ పరిశీలిస్తున్నారు.