పాలిటిక్స్ లో క్లిక్ కావడం లేదే? ఇలా అయిందేందబ్బా?

కృష్ణా జిల్లా అన‌గానే రాజ‌కీయాల‌కు కీల‌క కేంద్రంగా చ‌ర్చకు నిలుస్తుంది. ఇక్కడ నుంచి అనేక మంది రాజ‌కీయ యోధాను యోధులు రాష్ట్ర, దేశ‌స్థాయిలో చ‌క్రం తిప్పారు. త‌ర్వాత [more]

Update: 2020-07-25 00:30 GMT

కృష్ణా జిల్లా అన‌గానే రాజ‌కీయాల‌కు కీల‌క కేంద్రంగా చ‌ర్చకు నిలుస్తుంది. ఇక్కడ నుంచి అనేక మంది రాజ‌కీయ యోధాను యోధులు రాష్ట్ర, దేశ‌స్థాయిలో చ‌క్రం తిప్పారు. త‌ర్వాత వీరికి వార‌సులుగా వ‌చ్చిన వారు కూడా కొంద‌రు పుంజుకున్నారు. అయితే, కొంద‌రికి రెండు, మ‌రికొంద‌రికి మూడో త‌రం వార‌స‌త్వానికి వ‌చ్చేస‌రికి రాజ‌కీయంగా ఎదురీత త‌ప్పడం లేద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. జిల్లాలో అవ‌నిగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాముఖ్యం ఉంది. ఇక్కడ నుంచి మండ‌లి వెంక‌ట‌కృష్ణారావు స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుంచి రాజ‌కీయాలు చేశారు. మంత్రిగా, కీల‌క రాజ‌కీయ నాయ‌కుడిగా చ‌క్రం తిప్పారు. కాంగ్రెస్‌లో ఆయ‌న దివి సీమ రాజ‌కీయాల‌ను ద‌శాబ్దాలుగా శాసించారు. ఈయ‌న వార‌సుడిగా రంగంలోకి వ‌చ్చిన మండ‌లి బుద్దప్రసాద్ కూడా తండ్రి వార‌స‌త్వాన్ని నిల‌బెట్టారు.

మండలి ఫ్యామిలీ….

కాంగ్రెస్ పార్టీలోనే మండ‌లి బుద్ధప్రసాద్ కూడా ఎదిగారు. మంత్రిగా కూడా చ‌క్రం తిప్పారు. కాంగ్రెస్‌కు అత్యంత విధేయ నేత‌గా ఆ య‌న ఎదిగి.. తండ్రి పేరును కూడా నిల‌బెట్టారు అయితే, రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఆయ‌న కాంగ్రెస్‌ను వీడి 2014 ఎన్నిక‌ల స‌మయంలో టీడీపీలో చేరారు. ఈ క్రమంలో ఆయ‌న విజ‌యం సాదించి అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ అయ్యారు. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో త‌న కుమారుడిని రంగంలోకి దింపాల‌ని భావించారు. అయితే, ఎన్నిక‌ల్లో ట‌ఫ్ ఫైట్ ఉండ‌డంతో చంద్రబాబు బుద్ధ ప్రసాద్‌కే అవ కాశం ఇచ్చారు. అయితే, ఆయ‌న ఓడిపోయారు. ఇక‌, అప్పటి నుంచి పార్టీకి, రాజ‌కీయాల‌కూ దూరంగా ఉంటున్నారు. ఈయ‌న త‌న కుమారుడి రాజ‌కీయాల‌పై ఆశ‌లు పెట్టుకున్నారు. టీడీపీలో ఉంటే లైఫ్ ఉంటుందా? లేక రాజ‌కీయంగా వైసీపీని ఆశ్రయించాలా? అనే సందేహంలో ఉన్నారు.

దాసరి కుటుంబం……

ఇక‌, కృష్ణా జిల్లాకే చెందిన మ‌రో కుటుంబం దాస‌రి కుటుంబం. ఈ కుటుంబంలో మాజీ ఎమ్మెల్యే దాస‌రి బాల‌వ‌ర్ధన‌రావు ఒక‌రు. టీడీపీలో సుదీర్ఘకాలం ఉన్న ఈయ‌న గ‌న్నవ‌రం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. ఈయ‌న వార‌సుడిగా రంగంలోకి దిగిన జై ర‌మేష్ కూడా రాజ‌కీయాల్లో బాగానే కుదురుకున్నారు. విజ‌య‌వాడ నుంచి ఎంపీగా పోటీ చేసి.. ప‌ర్వత‌నేని ఉపేంద్రపై ఓడిపోయారు. ఇక‌, ఆ త‌ర్వాత‌.. కొన్నాళ్లు మౌనంగా ఉన్నప్ప‌టికీ.. ఇటీవ‌ల కాలంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దాదాపు దాస‌రి ఫ్యామిలీ రాజ‌కీయాలకు గ‌న్నవ‌రంలో, జిల్లాలో చెక్ పడింద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నా యి. న‌గ‌రానికి చెందిన మ‌రో కీల‌క నాయ‌కుడు దేవినేని రాజ‌శేఖ‌ర్ ఉర‌ఫ్ నెహ్రూ. టీడీపీలో రాజ‌కీయాలు నేర్చుకున్న నెహ్రూ.. ఈ పార్టీలోనే మంత్రిగా ఎదిగారు. త‌ర్వాత.. అనూహ్య కార‌ణాల‌తో వైఎస్ పిలుపుమేర‌కు టీడీపీని వీడి కాంగ్రెస్ పంచ‌కు చేరిపోయారు.

దేవినేని వైసీపీలో చేరి…..

ఆయ‌న జీవించి ఉన్న స‌మ‌యంలోనే 2014లో త‌న కుమారుడు దేవినేని అవినాష్‌ను కూడా రాజ‌కీయాల్లోకి తీసుకువ‌చ్చారు. ఈ క్రమంలోనే విజ‌య‌వాడ ఎంపీగా 2014లో కాంగ్రెస్ టికెట్‌పై పోటి చేయించారు. అయితే, ఆయ‌న ఓడిపోయారు. అనంత‌రం, తండ్రీ త‌న‌యులు చంద్రబాబు పంచ‌కు చేరి.. సొంత‌గూటిలో రాజ‌కీయాలు ప్రారంభించారు. కొన్నాళ్ల కింద‌ట నెహ్రూ కాలం చేయగా.. అవినాష్‌కు పార్టీలో తెలుగు యువ‌త అధ్యక్ష ప‌ద‌వి కూడా ద‌క్కింది. అదే స‌మ‌యంలో గ‌త ఏడాది ఎన్నిక‌ల స‌మ‌యంలో గుడివాడ ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చారు. అయితే, కొడాలి నాని చేతిలో ఓట‌మి పాల‌య్యారు. ఇక‌, జ‌గ‌న్ స‌ర్కారు రావ‌డంతో ఆయ‌న వైసీపీలోకి చేరిపోయారు. ప్రస్తుతం విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ ఇంచార్జ్‌గా చ‌క్రం తిప్పుతున్నారు. ప్రస్తుతం విజ‌య‌వాడ న‌గ‌ర వైసీపీ రాజ‌కీయంలో ఓ యువ ఆశాకిర‌ణంగా అవినాష్ ఉన్నారు.

వంగవీటి వారసుడు….

ఇక‌, ఇదే కృష్ణాజిల్లాకు చెందిన మ‌రో కీల‌క నాయ‌కుడు వంగ‌వీటి రంగా. ఈయ‌న 80ల‌లో రాజ‌కీయాలు చేయ‌గా.. అనూహ్య కార‌ణాల‌తో హ‌త్యకు గుర‌య్యారు. త‌ర్వాత సుదీర్ఘ విరామం అనంతరం ఈయ‌న కుమారుడు రాధా రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. తొలుత కాంగ్రెస్‌లో 2004లో తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యంసాధించారు. త‌ర్వాత అనూహ్యంగా 2009లో చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యంలోకి వెళ్లారు. అక్కడ క్లిక్ కాలేక పోయారు. ఈలోగా పార్టీని ఎత్తేశారు. ఇక‌, త‌ర్వాత మ‌ళ్లీ వైసీపీ బాట‌ప‌ట్టారు. ఇక్కడ నుంచి 2014లో పోటీ చేసి ఓడిపోయారు. గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు టికెట్ విష‌యంలో పేచీ పెట్టుకుని టీడీపీ పంచ‌న చేరిపోయారు. త‌న తండ్రి ఏ పార్టీకి వ్య‌తిరేకంగా ఉద్యమాలు చేశారో.. అదే పార్టీలోకి రాధా చేర‌డంపై విమ‌ర్శలు వ‌చ్చాయి. అయినా ఆయ‌న ప‌ట్టించుకోలేదు. ప్రస్తుతం ఎలాంటి ప్రాధాన్యం లేక‌పోవ‌డం, టీడీపీ ప‌రిస్థితిదిన‌దిన‌గండంగా మార‌డంతో దిక్కుతోచ‌ని ప‌రిస్థితిలో ఉండిపోయారు. మొత్తంగా రంగా వార‌స‌త్వాన్ని నిల‌బెట్టలేక పోతున్నారు.

Tags:    

Similar News