ఓటింగ్ కి కాటు పడింది … రీజన్స్ ఏంటి ?

భాగ్యనగర భాగ్యరేఖ ను నిర్ధారించే గ్రేటర్ ఎన్నికల్లో ఓటర్ల నిర్లిప్తత పెద్ద చర్చకే దారితీసింది. గత ఎన్నికల కన్నా 8 శాతం దాదాపు తక్కువ కావడం అందరిని [more]

Update: 2020-12-02 09:30 GMT

భాగ్యనగర భాగ్యరేఖ ను నిర్ధారించే గ్రేటర్ ఎన్నికల్లో ఓటర్ల నిర్లిప్తత పెద్ద చర్చకే దారితీసింది. గత ఎన్నికల కన్నా 8 శాతం దాదాపు తక్కువ కావడం అందరిని ఆశ్చర్యం లో ముంచింది. ఎందుకిలా జరిగింది అనే అంశంపై ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓటింగ్ తగ్గడానికి కరోనా ప్రభావం కొంత కారణం అని దీనివల్ల వృద్ధులు ఓటింగ్ కి ఎక్కువమంది దూరంగా ఉన్నట్లు భావిస్తున్నారు. అదేవిధంగా వర్క్ ఫ్రెమ్ హోమ్ కారణంగా లక్షలమంది సొంత ఊళ్లకు వెళ్లిపోవడం కూడా రీజన్ అనుకుంటున్నారు. ఐటి నిపుణులు ఉండే ప్రాంతాల్లో ఓటింగ్ మరీ ఘోరంగా ఉండటాన్ని గమనిస్తే ఇది వాస్తవమే అని లెక్కేస్తున్నారు.

స్థానిక అజెండా లేని ఎన్నికలు …

జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో స్థానిక అజెండా అనేది సోది లో లేకుండా పోయింది. కాశ్మీర్ నుంచి రోహింగ్యా లపై సర్జికల్ స్ట్రైక్స్, పివి ఎన్టీఆర్ సమాధుల కూల్చివేత వరకు అనేక సంబంధం లేని అంశాలు వివాదాలకు తెరలేపాయి. దాంతో సగటు ఇది తమ కోసం జరిగే ఎన్నికలు కావన్న నిర్లిప్తత తో ఉన్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే విధంగా ఒకరిని ఓడించాలని కానీ మరొకరిని గెలిపించాలని కానీ ఓటర్లలో బలంగా అభిప్రాయం లేకపోవడం కూడా పోలింగ్ బూత్ వైపు వారిని నడిపించలేదని భావిస్తున్నారు. అదీ గాక హైదరాబాద్ ఓటర్లలో చాలాకాలంగా ఉన్న దురలవాటు పోలింగ్ రోజు సెలవు దినంగా ఇంటివద్దే ఉంటారని ఇలాంటివన్నీ తాజా ఎన్నికల ఓటింగ్ పై పడ్డాయని విశ్లేషిస్తున్నారు.

హక్కులే కాదు బాధ్యతలు ఉండేలా …?

ఎన్నికైన ప్రభుత్వాలు తమకు ఇచ్చే సౌకర్యాలను హక్కుగా భావించే పౌరులకు ఓటు వేయడం బాధ్యతగా చేసేలా చట్టం తేవాలన్న డిమాండ్ ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో ఓటు వేయడం నిర్బంధంగా ఎలా అమలు చేస్తున్నారో అదే విధమైన కొత్త చట్టాలు దేశానికి అవసరమని నొక్కిచెబుతున్నారు. ఓటు వేయని వారి రేషన్ కట్ చేయడం, ఇంటిపన్ను లు పెంచడం వంటి చర్యలు తీసుకోవడం ద్వారా ఓటర్ల భాధ్యతారాహిత్య సమస్యను అధిగమించవచ్చని పలువురు సూచిస్తున్నారు. అయితే దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరగడంతో పాటు కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాలు సీరియస్ గా కార్యాచరణ చేయాలిసిన తక్షణ అవసరాన్ని హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు చెప్పక చెబుతున్నాయి.

Tags:    

Similar News