ఊహించినట్లుగానే….?
ఉత్తర్ ప్రదేశ్ లో మహాగడ్బంధన్ కు తెరపడింది. ఇరు పార్టీలదీ ఆత్మీయ కౌగిలి కాదని తేలిపోయింది. ఎన్నికల ఫలితాలను చూసిన వారెవరైనా ఇట్టే ఇలా చెప్పేయగలరు. గుప్పిట [more]
ఉత్తర్ ప్రదేశ్ లో మహాగడ్బంధన్ కు తెరపడింది. ఇరు పార్టీలదీ ఆత్మీయ కౌగిలి కాదని తేలిపోయింది. ఎన్నికల ఫలితాలను చూసిన వారెవరైనా ఇట్టే ఇలా చెప్పేయగలరు. గుప్పిట [more]
ఉత్తర్ ప్రదేశ్ లో మహాగడ్బంధన్ కు తెరపడింది. ఇరు పార్టీలదీ ఆత్మీయ కౌగిలి కాదని తేలిపోయింది. ఎన్నికల ఫలితాలను చూసిన వారెవరైనా ఇట్టే ఇలా చెప్పేయగలరు. గుప్పిట మూసేంత వరకే…. నన్న సామెతి అక్షరాలా ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో రుజువయింది. బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ కలసి పోటీ చేస్తే తిరుగుండదని భావించారు. ఇద్దరం కలిస్తే ఓట్ల శాతం ఎంత పెరుగుతుందో కూడా లెక్కలు మీద లెక్కలు వేసుకున్నారు.
లెక్కలన్నీ తప్పే…..
అయితే ఆ లెక్కలన్నీ తప్పులని రుజువయ్యాయి. ఇప్పుడు రెండు పార్టీలు కలిసినా బీజేపీని ఏం చేయలేక చతికల పడ్డారన్న అపప్రధను మూటగట్టుకున్నాయి. అఖిలేష్ యాదవ్, మాయావతి కలిశారు. ఇంకేముంది…? యూపీలో క్లీన్ స్వీప్…ఎన్నికలకు ముందు… పోలింగ్ తర్వాత కూడా వచ్చిన విశ్లేషణలు. అయితే దీనికి విరుద్దంగా ఫలితాలు వచ్చాయి. బీఎస్పీ, ఎస్సీల కూటమిని మీడియా ఆహ్వానించినా ప్రజలు మాత్రం ఆదరించలేదని తేలిపోయింది.
ఇక ఒంటరిగానే…..
ఫలితాలు వచ్చిన తర్వాత మౌనంగా ఉన్న మాయావతి ఎట్టకేలకు తేల్చి చెప్పారు. ఎస్పీతో తెగదెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. మాయావతి చెప్పిన దానిలోనూ నిజముందని ఒప్పుకోక తప్పదు. వచ్చే ఉప ఎన్నికల్లో తాను ఒంటరిగా పోటీ చేస్తామని మాయా తెలిపారు. అంతేకాదు యాదవులు తమ పార్టీకి ఓట్లు వేయలేదని తేల్చిచెప్పారు. కనీసం అఖిలేష్ యాదవ్ తన భార్య డింపును కూడా ఈ ఎన్నికల్లో గెలిపించుకోలేక పోయారని తీవ్ర స్థాయిలోనే విమర్శలు చేశారు.
రానున్న ఉప ఎన్నికల్లో…..
నిజమే కనోజ్ నియోజకవర్గంలో దాదాపు 3.5 లక్షల మంది యాదవ ఓటర్లు ఉంటే డింపుల్ యాదవ్ ఎందుకు ఓడిపోయారన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇక్కడ దళితులు కూడా డింపుల్ కు ఓట్లు వేయలేదని సమాజ్ వాదీ పార్టీ చెబుతోంది. మాయావతి కూడా ఎస్పీ ఓట్లు తమకు పడలేదని చెప్పేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించింది. దీంతో అఖిలేష్ యాదవ్ కూడా ఉప ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేేసేందుకు సిద్దమయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 11 మంది శాసనసభ్యులు ఎంపీలుగా పోటీ చేసి గెలవడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. మొత్తం మీద ఊరించి.. ఊహించిన ఈ కూటమి ఫలితాల తర్వాత మాత్రం కుదేలయిందనే చెప్పాలి. అయితే ఫలితాల తర్వాత ఇది ఊహించిన పరిణామమేనంటున్నారు ఎస్పీ నేతలు.