ఎముకలు మెళ్ళోనే ఉన్నాయిగా
ఎముకలు మెళ్ళో వేసుకుని తిరుగుతూ తాను పూర్తి శాఖాహారిని అన్నాడంట వెనకటికి ఎవరో. అలా ఉంది ఈ ధోరణి. నిత్యం చేసే అక్షర యుద్ధం కులం కోసం, [more]
ఎముకలు మెళ్ళో వేసుకుని తిరుగుతూ తాను పూర్తి శాఖాహారిని అన్నాడంట వెనకటికి ఎవరో. అలా ఉంది ఈ ధోరణి. నిత్యం చేసే అక్షర యుద్ధం కులం కోసం, [more]
ఎముకలు మెళ్ళో వేసుకుని తిరుగుతూ తాను పూర్తి శాఖాహారిని అన్నాడంట వెనకటికి ఎవరో. అలా ఉంది ఈ ధోరణి.
నిత్యం చేసే అక్షర యుద్ధం కులం కోసం, రాజకీయం కోసం. పైగా ఓ రాజకీయ పార్టీకి, ఆ పార్టీ నేతకు తాను అభిమానిని అని బహిరంగంగా చెప్పుకుని ఇప్పుడు “మీడియా విమర్శకు కులం, రాజకీయం అంటగడితే ఎలా” అని ఎదురు దాడి చేయడం ఏంటో! తెలుగు రాష్ట్రాల్లో, ప్రత్యేకించి ఆంధ్ర ప్రదేశ్ లో మీడియా పూర్తిగా కులం కోసమే పనిచేస్తోంది. రాజకీయ ఎజెండాతో పనిచేస్తోంది.
ఎవరికీ చెప్పాల్సిన పనిలేదు….
ఈ మాటలు చెప్పడానికి పెద్ద విశ్లేషణలు అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఏమాత్రం అక్షర జ్ఞానం ఉన్న వారైనా పత్రికలు చూసి చెప్పగలరు. అక్షర జ్ఞానం లేనివాళ్ళు కూడా తెలుగు టీవీ చానళ్ళు చూసి ఏ ఛానల్ ఎవరికోసం పనిచేస్తోందో చెప్పగలరు.ఇంత భారీ విభజన చాలా స్పష్టంగా జరిగిపోయింది కాబట్టే ప్రజల్లో మీడియా విశ్వసనీయత కోల్పోయింది. పేజీలకు పేజీలు పత్రికల్లో రాసినా, గంటలకొద్దీ టీవీల్లో కథనాలు వినిపించినా ప్రజలు మీడియా మాటలు 2019 ఎన్నికల్లో విశ్వసించలేదు. తాము ఇవ్వాల్సిన తీర్పు ఇచ్చేశారు.
దిమ్మ తిరిగే తీర్పు….
కులాన్ని నమ్ముకున్న రాజకీయ నాయకులకు, పార్టీలకు దిమ్మతిరిగే తీర్పు ఇచ్చారు ప్రజలు. కలాన్ని అమ్ముకున్న మీడియాకు కూడా చెంప ఛెళ్ళుమనిపించారు. గూబ గుయ్యుమన్నాక ఇప్పుడు నీతివాక్యాలు వల్లించి లాభం లేదు. ద్రౌపది కారణజన్మురాలు. ఐదుగురు భర్తలు ఉన్నా ఆ మహాసాధ్వి పతివ్రతే. సాధారణ స్త్రీలు, అందునా వ్యభిచారం చేసే వాళ్ళు తమను తాము ద్రౌపదితో పోల్చుకుంటే ఎలా? సూర్యుడిని ప్రార్ధించిన కుంతీ దేవి పెళ్ళికి ముందే కర్ణుడికి జన్మనిచ్చింది. అంత మాత్రాన పెళ్ళికి ముందే గర్భవతులైన వారంతా కుంతీదేవి అంశకు చెందినవారమే అంటే ఎలా?
బతుకుదెరువు కోసమయితే….?
నీ అస్తిత్వం కోసమో, రాజకీయం కోసమో, ఇంకా దేనికోసమో నీ యుద్ధం నీది. నీ కుల యుద్ధం నువ్వు చేసుకో… ఎవరూ తప్పు అనలేరు. అది నీ అవసరం కావొచ్చు. నీ బతుకుదెరువు కావచ్చు. అది అర్ధం చేసుకోగలం. అంతే కానీ మధ్యలో ఇలా నీతులు వల్లిస్తే ఎలా?
-గోపి దారా సీనియర్ జర్నలిస్ట్