మెగా బ్రదర్ తెగ ఫీలవుతున్నాడట

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి సిట్యుయేష‌న్స్ జ‌రుగుతాయో చెప్పడం క‌ష్టం అంటారు. ఇప్పుడు కూడా ఏపీలో ఇలాంటి ప‌రిస్థితి తెర‌మీద‌కి వ‌చ్చింది. నిన్న మొన్నటి వ‌ర‌కు తిట్టుకున్న బీజేపీ-జ‌నసేన‌లు [more]

Update: 2020-01-20 12:30 GMT

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి సిట్యుయేష‌న్స్ జ‌రుగుతాయో చెప్పడం క‌ష్టం అంటారు. ఇప్పుడు కూడా ఏపీలో ఇలాంటి ప‌రిస్థితి తెర‌మీద‌కి వ‌చ్చింది. నిన్న మొన్నటి వ‌ర‌కు తిట్టుకున్న బీజేపీ-జ‌నసేన‌లు క‌లిసిపోయాయి. క‌లిసి ప్రయాణం చేయాల‌ని నిర్ణయించుకున్నాయి. దీంతో ఈ రెండు పార్టీల జెండాలు ఇక నుంచి క‌లిసి ఎగ‌రనున్నాయి. రెండు పార్టీల నాయ‌కులు క‌లిసి వేదిక‌ను పంచుకోనున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. మ‌రి రెండు పార్టీలు క‌లిశాయ‌నే సంబ‌రం ఒక ప‌క్క ఉంటే.. జ‌న‌సేన‌లో కీల‌క నాయ‌కుడు పార్టీ అధినేత ప‌వ‌న్ సోద‌ర‌ుడు నాగ‌బాబు మాత్రం త‌న ఫ్యూచ‌ర్‌కు ఎస‌రు వ‌చ్చింద‌ని జ‌న‌సేన వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది.

రెండు పార్టీలూ కలవడంతో…

2014 ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌, బీజేపీ క‌లిసే ప్రయాణం చేశాయి. ఆ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ పార్టీ పెట్టినా పోటీ చేయ‌కుండా బీజేపీ-టీడీపీ కూట‌మికి స‌పోర్ట్ చేశారు. ఇక గ‌తేడాది ఎన్నిక‌ల‌కు ప‌వ‌న్ కల్యాణ్ ఈ రెండు పార్టీల‌కు దూరంగా ఒంట‌రిగా పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. ఇక ఇప్పుడు మ‌ళ్లీ బీజేపీతో క‌లిసి న‌డ‌వాల‌ని నిర్ణయించుకున్నారు. ఇదే ఇప్పుడు మెగా బ్రద‌ర్ అయిన ప‌వ‌న్ అన్నకు క‌ష్టం తెచ్చిపెట్టింది. దీంతో జ‌న‌సేన నాయ‌కులు కూడా త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. బీజేపీతో పొత్తు నేప‌థ్యంలో జ‌న‌సేన‌-బీజేపీల మ‌ధ్య ఓ అవ‌గాహ‌న కుదిరింద‌ని అంటున్నారు. అంటే ఇంకా ఎన్నిక‌ల‌కు నాలుగు సంవ‌త్సరాల స‌మ‌యం ఉన్నప్పటికీ ఇప్పుడే ఈ రెండు పార్టీలు ఒక మాట అనుకున్నాయ‌ట‌.

నర్సాపురం నుంచి పోటీ చేసి….

ఈ మాట ప్రకారం.. రాష్ట్రంలోని ఎంపీ సీట్లలో బీజేపీకి ఎక్కువగాను జ‌న‌సేన‌కు త‌క్కువ‌గాను ఉంటాయి. ఇక‌, అసెంబ్లీ సీట్లలో జ‌న‌సేన ఎక్కువ చోట్ల పోటీ చేస్తే.. బీజేపీ త‌క్కువ చోట్ల నుంచి బ‌రిలోకి దిగ‌నుంది. ఇదీ ప్రాథ‌మికంగా ఈ రెండు పార్టీల‌మధ్య కుదిరిన అవ‌గాహ‌న‌గా తెలుస్తోంది. ఇదే జ‌రిగితే త‌న కొంప‌కు ఎస‌రు వ‌చ్చిన‌ట్టేన‌ని మెగా బ్రద‌ర్ నాగ‌బాబు తెగ ఫీల‌వుతున్నాడ‌ని అంటున్నారు పొలిటిక‌ల్ పండితులు. దీనికి రీజ‌న్ ఉంది., గ‌త ఏడాది జ‌రిగిన సార్వత్రిక ఎన్నిక‌ల్లో ప‌శ్చిమ గోదావ‌రిలోని త‌న పుట్టిల్లు ఉన్న ఎంపీ స్థానం న‌ర‌సాపురం నుంచి నాగ‌బాబు జ‌న‌సేన టికెట్‌పై పోటీ చేశారు.

సెంటమెంటు సీటు కావడంతో….

ఇది చాలా సెంటిమెంటు కూడా. ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓడిపోయినా.. గౌర‌వ ప్రద‌మైన ఓట్లే సంపాయించుకున్నారు. దాదాపు 2.5 ల‌క్షల ఓట్లను నాగ‌బాబు ఒడిసి ప‌ట్టారు. నాగ‌బాబుకు ఆ స్థాయిలో ఓట్లు రావ‌డంతోనే ఇక్కడ టీడీపీ ఎంపీ సీటును కేవ‌లం 26 వేల ఓట్ల స్వల్ప తేడాతో కోల్పోయింది. ఈ ప్రాంతం మెగా బ్రదర్స్‌కు మంచి సెంటిమెంట్. చిరు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన‌ప్పుడు పాల‌కొల్లు నుంచి పోటీ చేయ‌గా.. గ‌త ఎన్నికల్లో జ‌న‌సేన నుంచి ప‌వ‌న్ భీమ‌వ‌రం అసెంబ్లీకి, నాగ‌బాబు న‌ర‌సాపురం నుంచి లోక్‌స‌భ‌కు పోటీ చేశారు.

బీజేపీకి ఇవ్వాల్సి వస్తే….

అయితే, ఇప్పుడు జ‌న‌సేన‌-బీజేపీ అవ‌గాహ‌న ప్రకారం ఎంపీ స్థానాల‌ను ఎక్కువ‌గా క‌మ‌ల పార్టీకి కేటాయించాల్సి వ‌స్తే.. ఖ‌చ్చితంగా ఆ జాబితాలో న‌ర‌సాపురం ఉంటుంది. ఎందుకంటే గ‌తంలోనూ బీజేపీ ఇక్కడ నుంచి గెలుపు గుర్రం ఎక్కింది. బీజేపీ నుంచి ఇక్కడ ప‌లువురు కీల‌క నేత‌లు విజ‌యాలు సాధించారు. సో ఇప్పుడు క‌నుక న‌ర‌సాపురం కనుక బీజేపీకి ద‌ఖ‌లు ప‌డితే త‌న ప‌రిస్తితి ఏంటి? అని నాగ‌బాబు ఫీల‌వుతున్నట్టు జ‌న‌సేన వ‌ర్గాల్లోనే భారీగా ప్రచారం జ‌రుగుతోంది. మ‌రి దీనికి జ‌న‌సేనాని ప‌వ‌న్ ఎలాంటి విరుగుడు కనిపెడ‌తారో చూడాలి.

Tags:    

Similar News