ఎంత జగన్ అండ ఉంటే మాత్రం…?

ఆంధ్రప్రదేశ్ అంతటా పార్లమెంటు సభ్యులు ఎమ్మెల్యేలు చెప్పినట్లే నడుచుకుంటున్నారు. పార్లమెంటు సభ్యులు నియజకవర్గాల్లో పర్యటించాలంటే ఎమ్మెల్యేల అనుమతి కావాల్సిందే. దీంతో అనేక మంది ఎంపీలు ఢిల్లీ, హైదరాబాద్ [more]

Update: 2021-03-13 12:30 GMT

ఆంధ్రప్రదేశ్ అంతటా పార్లమెంటు సభ్యులు ఎమ్మెల్యేలు చెప్పినట్లే నడుచుకుంటున్నారు. పార్లమెంటు సభ్యులు నియజకవర్గాల్లో పర్యటించాలంటే ఎమ్మెల్యేల అనుమతి కావాల్సిందే. దీంతో అనేక మంది ఎంపీలు ఢిల్లీ, హైదరాబాద్ కే పరిమిత మయ్యారు. జిల్లా కేంద్రాలకు అప్పుడప్పుడు వచ్చి హాజరు వేసుకుని వెళుతున్నారు. కానీ అందరూ ఎంపీల పరిస్థిితి అలాగుంటే మరో యువ ఎంపీ మాత్రం తాను చెప్పినట్లే నడుచుకోవాలనుకుంటున్నారు.

గీత దాటకూడదంటూ…..

రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి తన నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు తాను గీచిన గీతను దాటకూడదంటున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు కావడం, ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితుడు కావడంతో మిధున్ రెడ్డి చెప్పినట్లే ఎమ్మెల్యేలు చేయాల్సి వస్తుంది. ఇక పంచాయతీ ఎన్నికల సందర్భంగా మిధున్ రెడ్డి తన వర్గానికే ఎక్కువగా టిక్కెట్లు ఇవ్వాలని ఎమ్మెల్యేలపై వత్తిడి తెచ్చారని తెలుస్తోంది. అలా ఎమ్మెల్యేలు మాట వినకపోతే తన వర్గం వారిని రెబల్ అభ్యర్థులుగా పోటీ చేయించారు.

చిత్తూరు జిల్లా పరిధిలోని….

రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో రాజంపేట, కోడూరు, రాయచోటి, తంబళ్లపల్లి, పీలేరు, మదనపల్లి, పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. రాజంపేట, కోడూరు కడప జిల్లాలోనివి కాగా, మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాలన్నీ చిత్తూరు జిల్లాలోనివే. దీంతో ఎంపీ మిధున్ రెడ్డి చిత్తూరు జిల్లాలోని శానససభ స్థానాల్లో తన అనుచరులను పంచాయతీ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థులుగా బరిలోకి దింపారు. దీంతో ఆ ప్రాంత ఎమ్మెల్యేలు లబోదిబో మంటున్నారు.

మదనపల్లి నియోజకవర్గంలో…..

మదనపల్లి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే నవాజ్ భాషాకు, ఎంపీ మిధున్ రెడ్డికి మధ్య ఈ ఎన్నికలు మరింత దూరం పెంచాయంటున్నారు. ఈ నియోజకవర్గంలో ఎక్కువ పంచాయతీల్లో మిధున్ రెడ్డి పోటీకి దింపిన రెబల్స్ ఎక్కువ సంఖ్యలో గెలవడంతో ఇక్కడ ఎమ్మెల్యే నవాజ్ భాషా వీకయ్యారు. ఎమ్మెల్యేను కూడా లెక్క చేయని పరిస్థితి ఉంది. ఇలా రాష్ట్రమంతా ఎంపీలు తమ నియోజకవర్గాల్లో పర్యటించాలంటేనే భయపడుతుంటే, మిధున్ రెడ్డి మాత్రం ఎమ్మెల్యేలను పక్కన పెట్టి తన సత్తా చూపుతున్నారు. ఇది పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News