దేశమంతా ఒవైైసీ వైపు చూస్తుందే?
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ దేశ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించాలని ఉవ్విళ్లూరుతున్నారు. అందుకోసం అన్ని రాష్ట్రాల ఎన్నికలపై ఆయన కసరత్తు చేస్తున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో [more]
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ దేశ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించాలని ఉవ్విళ్లూరుతున్నారు. అందుకోసం అన్ని రాష్ట్రాల ఎన్నికలపై ఆయన కసరత్తు చేస్తున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో [more]
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ దేశ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించాలని ఉవ్విళ్లూరుతున్నారు. అందుకోసం అన్ని రాష్ట్రాల ఎన్నికలపై ఆయన కసరత్తు చేస్తున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం ఐదు స్థానాలు గెలుచుకోవడంతో ఇతర రాష్ట్రాలకు చెందిన పార్టీలు కూడా అసదుద్దీన్ ఒవైసీతో చేతులు కలిపేందుకు ఉత్సాహపడుతున్నాయి. ప్రధానంగా ముస్లిం ఓటు బ్యాంకును ఓన్ చేసుకోవడంలో అసదుద్దీన్ సక్సెస్ కావడంతోనే దేశం మొత్తం ఒవైసీ వైపు చూస్తుందని చెప్పక తప్పదు.
ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో…..
బీహార్ లో ఇప్పటికే పోటీ చేస్తానని ప్రకటించిన అసదుద్దీన్ ఒవైసీ తమిళనాడు ఎన్నికల్లోనూ పోటీ చేయనున్నారు. ఇక్కడ కమల్ హాసన్ నేతృత్వం వహిస్తున్న మక్కల్ నీది మయ్యమ్ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు అసదుద్దీన్ ఒవైసీ సిద్దమవుతున్నారు. దీంతో పాటు పశ్చిమ బెంగాల్ లో సయితం ఎంఐఎం పోటీ చేస్తుందని అసదుద్దీన్ ఒవైసీ ఇప్పటికే ప్రకటించారు. ఇక్కడ మమత బెనర్జీ నేతృత్వం వహిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ తో చేతులు కలిపేందుకు అసద్ ప్లాన్ చేసుకుంటున్నారు. మమత కూడా ఎంఐఎంతో పొత్తుకు సుముఖంగానే ఉన్నారు.
ఉత్తర్ ప్రదేశ్ లోనూ…..
ఇక ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలలో పోటీ చేసేందుకు ఎంఐఎం సిద్ధమవుతుంది. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు 2022లో జరగనున్నాయి. ఎంఐఎం గతంలో కూడా ఉత్తర్ ప్రదేశ్ లో పోట ీ చేసింది. 2017లో జరిగిన ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీ తన పార్టీ అభ్యర్థులను 34 అసెంబ్లీ స్థానాల్లో బరిలోకి దింపారు. కానీ ఏ ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదు. అప్పుడు ఒంటరిగా పోటీ చేయడంతోనే తమకు కలసి రాలేదని అసుదుద్దీన్ ఒవైసీ అభిప్రాయపడుతున్నారు.
ఏ పార్టీతో అనేది?
ఇక ఉత్తర్ ప్రదేశ్ లో అనేక పార్టీలు ఎంఐఎంను కలుపుకుని వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. బీహార్ ఎన్నికల ఫలితాలే వీరికి ప్రేరణ కల్గించాయి. భారతీయ సమాజ్ పార్టీ ఇప్పటికే ఎంఐఎంతో కలసి పోటీ చేస్తామని ప్రకటించింది. ఇక ములాయం సింగ్ యాదవ్ సోదరుడు శివపాల్ యాదవ్ కు చెందిన ప్రగతి శీల సమాజ్ వాదీ పార్టీ కూడా తాము ఎంఐఎంతో పొత్తుకు సిద్ధమని ప్రకటించింది. కానీ అసదుద్దీన్ ఒవైసీ మాత్రం మాయావతి పార్టీతో కలసి పోటీ చేయాలని భావిస్తున్నారు. మొత్తం మీద అన్ని పార్టీలు అసదుద్దీన్ వైపు చూస్తుండం విశేషం.