కన్నబాబు దున్నేస్తారా…?
విశాఖ జిల్లాకు ఇంఛార్జి మంత్రిగా కన్నబాబు నియామకం అదే టైంలో విశాఖ నుంచే జనసేనాని లాంగ్ మార్చ్ నిర్వహించడం చూస్తూంటే పోటా పోటీ ఫైటింగ్ కి స్టీల్ [more]
విశాఖ జిల్లాకు ఇంఛార్జి మంత్రిగా కన్నబాబు నియామకం అదే టైంలో విశాఖ నుంచే జనసేనాని లాంగ్ మార్చ్ నిర్వహించడం చూస్తూంటే పోటా పోటీ ఫైటింగ్ కి స్టీల్ [more]
విశాఖ జిల్లాకు ఇంఛార్జి మంత్రిగా కన్నబాబు నియామకం అదే టైంలో విశాఖ నుంచే జనసేనాని లాంగ్ మార్చ్ నిర్వహించడం చూస్తూంటే పోటా పోటీ ఫైటింగ్ కి స్టీల్ సిటీ వేదిక రెడీ అయినట్లుగానే కనిపిస్తోంది. కన్నబాబు మెగా గూటి పక్షే. ఆయన సామాజిక వర్గమూ అదే. ఇక ఆయన రాజకీయ జీవితం కూడా చిరంజీవి కుటుంబం చుట్టూనే తిరిగింది. 2009 ఎన్నికల్లో కన్నబాబు ప్రజారాజ్యం నుంచి పోటీ చేయడం వెంటనే ఎమ్మెల్యే కావడం జరిగిపోయాయి. ప్రజారాజ్యంలో అప్పట్లో నోరున్న ఎమ్మెల్యేలలో కన్నబాబు ఒకరుగా పేరు తెచ్చుకున్నారు. మొదటిసారి ఎమ్మెల్యే అయినా సరే అటు అధికార కాంగ్రెస్, ఇటు విపక్ష టీడీపీని ఆదిలోనే కౌంటర్ చేస్తూ ఆయన చేసిన ప్రసంగాలు కూడా గుర్తే. పైగా కన్నబాబుకు పాత్రికేయుడు కావడం కూడా ఆయన రాజకీయానికి కలసివచ్చింది. ఇవన్నీ పక్కన పెడితే విశాఖ సభలో పవన్ కన్నబాబునే డైరెక్ట్ గా టార్గెట్ చేశారు. ఆయన జాతకం ఏంటో తమకు తెలుసు అంటూ పవన్ విసుర్లు విసిరారు. మరి కన్నబాబు ఊరుకుంటారా..?
వైసీపీకి బలమే….
కన్నబాబుకు విశాఖలో జర్నలిస్టుగా పనిచేసిన అనుభవం ఉంది. ఆయనకు కాకినాడ తరువాత విశాఖ సొంత ప్రాంతం లాంటిదే అంటారు. మరో వైపు కన్నబాబుకు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతోనూ పరిచయాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో విశాఖలో పవన్ కి గట్టి రిటార్ట్ ఇవ్వడానికే కన్నబాబు చూస్తారని అంటున్నారు. జగన్ ఎంపిక చేసుకున్న పాతిక మంది మంత్రులలో బాగా పనిచేసేవాళ్ళుగా కొందరు ఉన్నారు. వారిలో కన్నబాబు కూడా ఒకరు. పైగా ఆయన జగన్ కి ఇష్టుడుగా పేరు సంపాదించుకున్నారు. యువ మంత్రిగా దూకుడు రాజకీయం చేసే కన్నబాబు విశాఖకు ఇంచార్జి మంత్రి కావడం వైసీపీకి పెద్ద బలం అంటున్నారు. విశాఖలో తనకు గట్టి పట్టు ఉందని చెబుతూ బస్తీ మే సవాల్ అంటున్న పవన్ ని ఎలా అదుపు చేయాలో కన్నబాబుకే తెలుసు అని కూడా చెబుతున్నారు.
ఇక్కడ నుందే రాజకీయమా..?
విశాఖ మామూలుగా ప్రశాంత నగరంగా పేరు తెచ్చుకుంది. ఇక్కడ రాజకీయాలు కూడా సాఫీగా సాగిపోతాయి. అయితే పవన్ లాంగ్ మార్చ్ పేరిట సభ సక్సెస్ చేసుకున్నారు. దాంతో తన కార్యక్షేత్రాన్ని విశాఖను మార్చుకుంటానని కూడా ఆయన కార్యకర్తలకు చెబుతున్నారు. మంచి పార్టీ ఆఫీస్ చూసి మరీ విశాఖ నుంచే తాను ఏపీ రాజకీయాలపైన గురి పెడతానని పవన్ అంటున్నారు. ఇపుడు ఇంచార్జి మంత్రిగా కన్నబాబు ఉండడంతో జనసేనతో పాటు టీడీపీ ఆయువు పట్టు మీదనే ఆయన దృష్టి పెడతారని అంటున్నారు. విశాఖ అర్బన్ జిల్లలో టీడీపీకి బలం ఉండడం వల్లనే పవన్ సభను నిర్వహించగలిగారన్నది తెలిసిందే. అందుకే రానున్న రోజుల్లో జీవీఎంసీ ఎన్నికలలో వైసీపీ జెండా ఎగరేయడం ద్వారా అటు జనసేనానికి, ఇటు సైకిల్ పార్టీకి కూడా కన్నబాబు తనదైన స్టయిల్లో జవాబు చెబుతారు అంటున్నారు. ఇక కన్నబాబు మీద వ్యకిగత విమర్శలకు దిగిన పవన్ రాజకీయం విశాఖలో ఎంతవరకూ సాగుతుందో చూడాలి.