పత్తా లేకుండా పోయారే? పార్టీ వీరకి పట్టదా?

ఏపీలో మంత్రులు ఏమ‌య్యారు. అత్యంత క్లిష్టత‌ర ప‌రిస్థితిలో ప్రజ‌లు అల్లాడుతుంటే.. అమాత్యులు ఏం చేస్తున్నారు ? ఇప్పుడు ఇదే ప్రశ్న తెర‌మీదికి వ‌చ్చింది. రాష్ట్రంలో సీఎం జ‌గ‌న్‌తో [more]

Update: 2020-04-16 08:00 GMT

ఏపీలో మంత్రులు ఏమ‌య్యారు. అత్యంత క్లిష్టత‌ర ప‌రిస్థితిలో ప్రజ‌లు అల్లాడుతుంటే.. అమాత్యులు ఏం చేస్తున్నారు ? ఇప్పుడు ఇదే ప్రశ్న తెర‌మీదికి వ‌చ్చింది. రాష్ట్రంలో సీఎం జ‌గ‌న్‌తో క‌లిపి మొత్తం పాతిక‌మంది మంత్రులు ఉన్నారు. వీరిలో ముగ్గురు మ‌హిళా మంత్రులు కూడా ఉన్నారు. ఇక ఏకంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. అయితే, ఒక్క సీఎం జ‌గ‌న్‌, మంత్రులు బొత్స స‌త్యనారాయ‌ణ‌, ఆదిమూల‌పు సురేష్‌, మంత్రి ఆళ్ల నాని, కుర‌సాల క‌న్నబాబు, అవంతి శ్రీనివాస్ వంటి వారు మాత్రమే మీడియాలో మాట్లాడుతున్నారు. అంతే త‌ప్ప ఎవ‌రూ కూడా బ‌య‌ట‌కు రావ‌డం లేదు. నిజానికి ఎంత క‌రోనా ఎఫెక్ట్ ఉన్నప్పటికీ.. ప్రజ‌ల‌కు రిలాక్సేష‌న్ ఇచ్చారు. ఉద‌యం ఆరు నుంచి 9 లేదా 11 గంట‌ల వ‌ర‌కు ప్రజ‌ల‌కు విరామ స‌మ‌యం ప్రక‌టించారు.

నిత్యావసరాల వస్తువుల…..

దీంతో ప్రజ‌లంతా వ‌చ్చి నిత్యావ‌స‌రాల‌ను, కూర‌గాయ‌ల‌ను కొనుగోలు చేస్తున్నారు. మ‌రి ఈ స‌మ‌యంలో ప్రజ‌ల‌కు నిత్యావ‌స‌రాల‌ను ధ‌ర‌లు పెంచి మ‌రీ అమ్ముతున్నారు. దీంతో ప్రజ‌లు కొన్ని జిల్లాల్లో తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ క్రమంలో వాటిని క‌ట్టడి చేయ‌డంతోపాటు ప్రజ‌ల‌కు స‌రైన విధంగా వాటిని అందించాల్సిన బాధ్యత మంత్రులుగా ప్రతి ఒక్కరిపైనా ఉంది. కానీ, ఇప్పుడు జ‌గ‌న్ కేబినెట్‌లోని మంత్రులు కేవ‌లం ఇంటికే ప‌రిమిత‌మ‌య్యార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఏ ఒక్కరూ కూడా బ‌య‌ట‌కు రావ‌డం లేదు. క్షేత్రస్థాయిలో ప్రజ‌ల‌కు-ప్రభుత్వానికి మ‌ధ్య జ‌రుగుతున్న కార్యక్రమాల‌ను ప‌ర్యవేక్షించ‌డం లేదు. దీంతో అసలు ఏం జ‌రుగుతోంది? ప‌్రజ‌లు ఏం తింటున్నారు? అనే వాద‌నకు స‌మాధానం చెప్పేనాధుడు కూడా క‌రువ‌య్యారు.

బయటకు రాకుండా…?

ఇటీవ‌ల ప్రభుత్వం నిత్యావ‌స‌రాల‌తో పాటు పేద‌ల‌కు రూ.1000 పంచింది. దీనిని స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు పంచారు. దీంతో వారు తీవ్ర విమ‌ర్శలు ఎదుర్కొనాల్సి వ‌చ్చింది. అలా కాకుండా మంత్రులు రోడ్ల మీద‌కి వ‌చ్చి.. వీటిని పంపిణీ చేసి ఉంటే ప్రభుత్వానికి మంచి పేరు వ‌చ్చేది.. విమ‌ర్శలు కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా వినిపించేది కాదు. కానీ, ఈ విష‌యాన్ని పూర్తిగా ప‌క్కన పెట్టి దొరికింది క‌దా.. స‌మ‌యం అనుకుంటున్న మంత్రులు ఫ్యామిలీల‌తో హోం క్వారంటైన్ల‌లోనే ఎంజాయ్ చేస్తున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. చాలా మంది బ‌య‌ట‌కు వ‌స్తే తాము ఎక్కడ ఇబ్బంది ప‌డాల్సి వ‌స్తుందో అన్నట్టుగా వ్యవ‌హ‌రిస్తున్నార‌న్న విమ‌ర్శలు ఉన్నాయి.

ఆంక్షలు ఉన్నాయా అంటే?

సీనియ‌ర్లు, జూనియ‌ర్లు ఎవ‌రూ కూడా ప్రజ‌ల మ‌ధ్య లేక పోవ‌డం పై తీవ్ర విమ‌ర్శలు వ‌స్తున్నాయి. పోనీ.. సీఎం జ‌గ‌న్ ఏమైనా మంత్రుల‌పై ఆంక్షలు పెట్టారా? అంటే అది కూడా లేద‌ని సీఎంవో అధికార వ‌ర్గాలు తెలుపుతున్నాయి. మంత్రుల‌ను ప్రజ‌ల మ‌ధ్యే ఉండాల‌ని జ‌గ‌న్ కూడా కోరుతున్నార‌ని, అయినా కూడా ఎవ‌రూ ముందుకు రావ‌డం లేద‌ని ప్రజ‌ల క‌న్నా కూడా మంత్రులే క‌రోనాతో భ‌యప‌డుతున్నార‌ని అంటున్నారు. మ‌రి ఇప్పటికైనా మంత్రులు త‌మ పంథా మార్చుకుంటే బెట‌రేమో ఒక్కసారి ఆలోచించుకోవాలి.

Tags:    

Similar News