ఏపీలో అంతా ఇంప్రెస్డ్ పాలిటిక్సేనా? మినిస్టర్స్ అంతవరకేనా?
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటిపోయింది. ఈ ఏడాది కాలంలో జగన్ మంత్రివర్గంలోని మంత్రులు ఏం చేశారు? వారి పరిస్థితి ఎలా ఉంది? గతంలో అవే [more]
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటిపోయింది. ఈ ఏడాది కాలంలో జగన్ మంత్రివర్గంలోని మంత్రులు ఏం చేశారు? వారి పరిస్థితి ఎలా ఉంది? గతంలో అవే [more]
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటిపోయింది. ఈ ఏడాది కాలంలో జగన్ మంత్రివర్గంలోని మంత్రులు ఏం చేశారు? వారి పరిస్థితి ఎలా ఉంది? గతంలో అవే శాఖలను చేసిన వారితో కంపేర్ చేసిన ప్పుడు.. వీరి రేటింగ్ ఎంత? అనే చర్చ సాగుతోంది. పైగా గత ప్రభుత్వానికి భిన్నంగా.. వైసీపీ అధినేత.. జగన్ ఎవరూ ఊహించని విధంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమించారు. అంతేకాదు, వీరిలో ప్రతి ఒక్కరినీ.. ఒక్కొక్క సామాజిక వర్గానికి చెందిన వారిని ఎంపిక చేశారు. దీంతో జగన్ ప్రభుత్వంపై ఆయన కేబినెట్‌పై ఓ రేంజ్‌లో ఆశలు, అంచనాలు పెరిగిపోయాయి.
అన్ని వర్గాలకూ….
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు, కమ్మ వర్గాలకు చెందిన నాయకులకు మంత్రి పదవులు ఇచ్చారు. తనకు అందరూ సమానులేనని చెప్పారు. ముందు నుంచి ప్రభుత్వంలో రెడ్లకు పెద్ద పీట ఉంటుందని అందరూ అనుకున్నా… జగన్ మాత్రం నలుగురు కాపులతో పాటు నలుగురు రెడ్లకు మంత్రి పదవులు ఇచ్చారు. ఇక బీసీలకు పెద్ద పీట వేశారు. ఇలా మొదలైన జగన్ కేబినెట్ వ్యవహారం.. ఇప్పుడు ఏడాది పూర్తయింది. మరి ఈ ఏడాది కాలంలో జగన్ కేబినెట్‌లోని మంత్రులు ఎలా వ్యవహరించారు? గతంలో ఇవే శాఖల ను చూసిన టీడీపీ నేతలకు.. వీరికి ఏమైనా తేడా ఉందా? శాఖల పనితీరు ఎలా ఉంది? మంత్రులకు శాఖలపై కమాండ్ వచ్చిందా? ప‌్రజలకు ఏమేరకు ఉపయోగపడుతున్నారు? అనే చర్చ తెరమీదికి వచ్చింది. వీటిని పరిశీలిస్తే.. ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
కొందరు దూకుడుగా ఉన్నా…..
కొందరు మంత్రులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. వీరిలో దాదాపు అందరూ అగ్రవర్ణాలకు చెందిన వారే ఉండడం గమనార్హం. లేదా.. గతంలోనూ గట్టి వాయిస్ వినిపించిన వారు.. ఇతర పార్టీల్లోనూ తమకు చెక్కు చెదరని ప్రజాభిమానం సంపాయించుకున్నవారు కనిపిస్తున్నారు. ఇక, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన మంత్రులు చాలా మేరకు వెనుకబడ్డారు (ఈమాట ఆయా వర్గాలకు చెందిన ప్రజలే అంటున్నారు). దీనికి కారణం ఏంటి? అనేది ఆలోచిస్తే.. వారిలో ఆత్మనూన్యతా భావం ఎక్కువగా ఉందని, ఏం చేస్తే.. ఏం జరుగుతుందో అనే.. భయం కూడా వెంటాడుతోందని అంటున్నారు పరిశీలకులు.
బలమైన వాయిస్ లేక….
జగన్ ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారికి కీలక మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు. అయినా వారి నుంచి బలమైన వాయిస్ లేదు. ఇక కొన్ని జిల్లాల్లో కొందరు మంత్రులుగా ఉన్నా కూడా అక్కడ కొన్ని సామాజిక వర్గాల వర్గాల ఆధిపత్యంతో వారి నోటి మాట రావడం లేదు. పైగా జగన్‌పై అత్యంత అభిమానం పెంచుకోవడంతో.. వారు ఆయనను అనుసరించేందుకు లేదా ఆయన చేస్తున్న పనులను కొనసాగించేందుకే ఇష్టపడుతున్నారు తప్ప.. తమకంటూ ప్రత్యేక ముద్రను వేసుకోలేక పోతున్నారు. 'ఇంప్రెస్డ్' పాలిటిక్స్ చేయడంలోనే మంత్రుల సమయం పూర్తిగా హరించుకు పోతోందని తెలుస్తోంది. ఇక, మైనార్టీ వర్గానికి కేవలం ఒక్క సీటు మాత్రమే లభించినా.. ఆయన కూడా ఫాలోయింగ్ మంత్రిగానే ఉండిపోతున్నారు. మొత్తంగా చూస్తే.. మంత్రుల గ్రాఫ్.. ఈ ఏడాది కాలంలో ప్రజా కోణంలో చూసినప్పుడు ఆశించినట్టుగా లేదని అంటున్నారు పరిశీలకులు.