వేవ్ లేదట.. ఇక బావురుమనక తప్పదుగా?

త్వరలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల్లో మోదీ ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. మోదీ రెండోసారి [more]

Update: 2021-09-07 16:30 GMT

త్వరలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల్లో మోదీ ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. మోదీ రెండోసారి ప్రధాని అయిన తర్వాత పూర్తిగా అన్ని రంగాల్లో విఫలమయ్యారన్నది వాస్తవం. ఆయనకు రాను రాను ఇమేజ్ తగ్గుతుంది. ఆయన సమర్థత పట్ల కూడా ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోంది. అవినీతి లేదన్న ఒక్క కారణం తప్ప మోదీని ఏ విషయంలోనూ పొగడటానికి అవకాశం లేని పరిస్థితి.

కరోనా విషయంలో…

కరోనా ఏ ముహూర్తాన భారత్ లో ప్రవేశించిందో తెలియదు కాని దాని ఎఫెక్ట్ ఎక్కువగా మోదీ పాలనపై పడింది. కరోనా కట్టడిలోనూ, వైద్య సాయం అందించడంలోనూ, లాక్ డౌన్ లో పేదలకు సాయం చేయడం లోనూ అన్ని రకాలుగా మోదీ పాలనలో వైఫల్యం కొట్టొచ్చినట్లు కనపడింది. ప్రభుత్వం కన్నా ప్రయివేటు సంస్థలు, వ్యక్తులే పేదలను లాక్ డౌన్ సమయంలో ఆదుకున్నాయన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

రికార్డు బ్రేక్ చేసి….

ఇక ధరల పెరుగుదల విషయంలో మోదీ సర్కార్ రికార్డులను బ్రేక్ చేసింది. మోదీ హయాంలోనే లీటరు పెట్రోలు ధర సెంచరీ దాటడం విశేషం. పెట్రోలు ఉత్పత్తుల ధరల పెరుగుదలతో నిత్యావసరాల ధరలు కూడా నింగినంటాయి. పేద, మధ్యతరగతి ప్రయోజనాలను మోదీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందనే విమర్శలున్నాయి. గ్యాస్ ధర దాదాపు వెయ్యికి చేరుకుంది. దీంతో మోదీ ప్రభుత్వంపై వ్యతిరేకత దేశ వ్యాప్తంగా పెరిగింది.

అసమర్థుడయినా బెటర్ అట…

అసమర్థుడు పాలన కంటే మోదీ పాలన మరింత అద్వాన్నంగా ఉందని, కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడం కోసమే మోదీ పాలన సాగిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కరోనా సమయంలో లక్షల కోట్ల సాయం అంటూ చేసిన ప్రకటన ప్రకటనకే పరిమితమయింది. ఇక తాజాగా ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలోనూ మోదీ ఇమేజ్ దారుణంగా పడిపోయింది. త్వరలో జగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఖచ్చితంగా మోదీ ప్రభావం పడుతుందన్నది వాస్తవం. అక్కడ గెలుపోటములకు మోదీయే బాధ్యత వహించాల్సి ఉంటుంది.

Tags:    

Similar News