మోదుగుల నిరీక్షణ‌.. అందుకేనా?

రాజ‌కీయాల్లో త‌న‌దైన శైలితో వ్యవ‌హ‌రించి వివాదాస్పద‌మైన నాయ‌కుడిగా పేరు తెచ్చుకున్న మోదుగుల వేణుగోపాల రెడ్డి.. ప్రస్తుతం త‌న‌కంటూ గుర్తింపు కోసం త‌పించి పోతున్నారు. ఈ ఏడాది జ‌రిగిన [more]

Update: 2019-12-24 14:30 GMT

రాజ‌కీయాల్లో త‌న‌దైన శైలితో వ్యవ‌హ‌రించి వివాదాస్పద‌మైన నాయ‌కుడిగా పేరు తెచ్చుకున్న మోదుగుల వేణుగోపాల రెడ్డి.. ప్రస్తుతం త‌న‌కంటూ గుర్తింపు కోసం త‌పించి పోతున్నారు. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో కేవ‌లం నెల రోజుల ముందు ఆయ‌న వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి వ‌ర‌కు అంటే 2014లో ఆయ‌న టీడీపీ త‌ర‌ఫున గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి గెలిచిన‌ప్పటికీ.. చంద్రబాబు త‌న‌కు ప్రాధాన్యం ఇవ్వలేద‌నే ఆక్రోశం పెంచుకున్నారు. ఎమ్మెల్యేగా ఉంటూనే ఆయ‌న అప్పట్లోనే మంత్రి ప‌ద‌విని ఆశించారు. అయితే, చంద్రబాబు ఆయ‌న‌ను దూరం పెట్టారు. దీంతో బ‌హిరంగంగా సొంత పార్టీ, ప్రభుత్వంపైనే అప్పట్లో విమ‌ర్శలు చేసి మీడియాకెక్కారు.

వైసీపీలోకి వెళ్లి విజయం సాధించలేక….

ఇక‌, అదే స‌మ‌యంలో ఎన్నిక‌ల‌కు ముందు ఖ‌చ్చితంగా ఏడాది కింద‌ట జ‌రిగిన వ‌న‌భోజ‌నాల స‌మ‌యంలో రెడ్డి వ‌ర్గానికి చంద్రబాబు ప్రభుత్వం అన్యాయం చేస్తున్నార‌ని, రెడ్లు బ‌లోపేతం అయ్యేందుకు అంద‌రూ సంఘ‌టితంగా ఒక మాట‌పై నిల‌వాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, మ‌న‌ది అనుకునే ప్రభుత్వం ఏర్పాటు అయ్యేందుకు కృషి చేయాల‌ని ఆయ‌న టీడీపీలో ఉన్న స‌మ‌యంలోనే ప‌రోక్షంగా వైసీపీకి మ‌ద్దతు ప‌లికారు. ఇక‌, ఎన్నిక‌లకు ముందు ఆయ‌న జెండా మార్చి వైసీపీ తీర్థం పుచ్చుకుని గుంటూరు ఎంపీ గా టికెట్ తెచ్చుకుని పోటీకి దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా జ‌గ‌న్ సునామీ క‌నిపించినా.. కూడా మోదుగుల మాత్రం విజ‌యం సాధించ‌లేక పోయారు.

తనకు పదవి ఇవ్వాలంటూ…

గుంటూరు ఎంపీగా రెండోసారి గ‌ల్లా జ‌య‌దేవ్ విజ‌యం సాధించారు. దీంతో అప్పటి నుంచి రెండు మూడు నెల‌ల పాటు తెర‌చాటుకు వెళ్లిపోయిన మోదుగుల‌ వేణుగోపాల్ రెడ్డి మ‌ళ్లీ ఇప్పుడు జ‌గ‌న్ కు ద‌గ్గర‌య్యేందుకు ప్రయ‌త్నిస్తున్నారు. త‌ర‌చుగా తాడేప‌ల్లిలోని జ‌గ‌న్ నివాసంలో ఆయ‌న క‌నిపిస్తున్నారు. ఎలాగూ గెల‌వ‌లేక పోయాను.. క‌నీసం నామినేటెడ్ ప‌ద‌వైనా ఇస్తే.. ఏదో ఒక‌ర‌కంగా నియోజ‌క‌వ‌ర్గంలో తిరిగేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని ఆయ‌న జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితులైన స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి వంటి వారి వ‌ద్ద చెప్పుకొంటున్నారు.

నామినేటెడ్ పోస్టు…

రాష్ట్రంలో మ‌రో 160 నామినేటెడ్ పోస్టులు పెండింగ్‌లో ఉన్న నేప‌థ్యంలో ఏదో ఒక దానిని త‌న‌కు ఇవ్వాల‌ని ఆయ‌న ప‌ట్టుబ‌డుతున్నారు. జ‌గ‌న్ వ్యాపార సంస్థల‌తో సంబంధాలు కూడా మోదుగుల‌ వేణుగోపాల్ రెడ్డికి మంచి ప్రయార్టీనే ద‌క్కుతుంద‌ని అంద‌రూ అనుకుంటున్నారు. అయితే, దీనికి కొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని, జిల్లాలో ఆయ‌న‌పై ప్రత్యేకంగా సానుకూల ప‌వ‌నాలు లేక పోవ‌డం కూడా దీనికి కార‌ణ‌మ‌ని అంటున్నారు. మ‌రి జ‌గ‌న్ ఎలాంటి ప‌ద‌వి ఇస్తారో.. మోదుగుల‌ వేణుగోపాల్ రెడ్డిని ఎలా సంతృప్తి ప‌రుస్తారో ? చూడాలి.

Tags:    

Similar News