ఊహించని పదవి.. రెడీగా ఉందటగా?

ఏపీ శాస‌న మండ‌లి చైర్మన్‌గా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన ద‌ళిత నాయ‌కుడు, వైఎస్ కుటుంబానికి అత్యంత ఆప్తుడిగాపేరున్న మోషేన్ రాజు పేరును సీఎం జ‌గ‌న్ ఖ‌రారు [more]

Update: 2021-08-28 02:00 GMT

ఏపీ శాస‌న మండ‌లి చైర్మన్‌గా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన ద‌ళిత నాయ‌కుడు, వైఎస్ కుటుంబానికి అత్యంత ఆప్తుడిగాపేరున్న మోషేన్ రాజు పేరును సీఎం జ‌గ‌న్ ఖ‌రారు చేశార‌ని అంటున్నారు వైసీపీ నాయ‌కులు. తాజాగా సిమ్లా ప‌ర్యట‌న‌కు వెళ్లిన జ‌గ‌న్‌.. గ‌త రాత్రి తీసుకున్న నిర్ణయం మేర‌కు మోషేన్ రాజు పేరును ఖ‌రారు చేశార‌ని అంటున్నారు. సెప్టెంబ‌రు తొలి వారంలో ప్రారంభం కానున్న అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాల్లో దీనిపై ఒక తీర్మానం చేసి.. గ‌వ‌ర్నర్ ఆమోదం తీసుకోవ‌డ‌మే.. ఇక‌, మిగిలింద‌ని వైసీపీ నేత‌లు చెబుతున్నారు.

రెండు కారణాలట….

ఇక‌, మోషేన్ రాజుకే ఎందుకు ఇంత అద్భుత అవ‌కాశం ఇస్తున్నారంటే.. దీనికి ప్రధానంగా రెండు కార‌ణాలు క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఒక‌టి.. వైఎస్ కుటుంబానికి అత్యంత ఆప్తుడిగా మోషేన్ రాజు నిలిచారు. వైసీపీ క‌ష్టాల్లో ఉన్నప్పటి నుంచి కూడా ఆయ‌న ఈ కుటుంబానికి అండ‌గా ఉన్నారు. అదే స‌మ‌యంలో గ‌తంల‌లో చంద్రబాబు హ‌యాంలో త‌మ పార్టీలోకి రావాలంటూ.. మోషేన్ రాజుపై ఒత్తిడి తీసుకువ‌చ్చినప్పటికీ.. ఆయ‌న మాత్రం వైసీపీని విడిచి పెట్టలేదు.

కౌన్సిలర్ నుంచి….

భీమ‌వ‌రంలో కౌన్సెల‌ర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన మోషేన్ రాజు వైఎస్ ద‌య‌తో 2009 ఎన్నిక‌ల్లో కొవ్వూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. త‌ర్వాత జ‌గ‌న్ పార్టీ పెట్టిన వెంట‌నే పార్టీలో చేరారు. మ‌ధ్యలో జిల్లా పార్టీ బాధ్య‌త‌లు కూడా చూశారు. 2014, 19 రెండు ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న‌కు ఎమ్మెల్యే టిక్కెట్ వ‌స్తుంద‌నుకున్నా చివ‌ర్లో స‌మీక‌ర‌ణ‌లు మార‌డంతో ఆయ‌న‌కు సీటు రాలేదు. ఈ క్రమంలోనే గ‌త ఏడాది గ‌వ‌ర్నర్ కోటాలో మోషేన్‌ను మండ‌లికి నామినేట్ చేశారు. అయితే.. ఇప్పుడు..రాష్ట్రంలో ద‌ళితుల కేంద్రంగా ప్రతిప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శలు.. ప్రభుత్వం వారికి అన్యాయం చేస్తోంద‌నే వాద‌న నేప‌థ్యంలో మోషేన్ రాజును మండ‌లి చైర్మన్ చేయాల‌ని జ‌గ‌న్ నిర్ణయం తీసుకున్నారంటున్నారు.

విమర్శలకు చెక్ పెట్టడంతో పాటు…

ఈ నిర్ణయంతో ఈ విమ‌ర్శల‌కు చెక్ పెట్టడంతోపాటు.. ఇప్పటి వ‌ర‌కు ఏ ప్రభుత్వమూ తీసుకోని నిర్ణయాన్ని తీసుకున్నట్టు ఉంటుంద‌ని .. జ‌గ‌న్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అదే స‌మ‌యంలో ప‌శ్చిమ‌లో టీడీపీకి దెబ్బకొట్టేందుకు కూడా ఈ వ్యూహం క‌లిసి వ‌స్తుంద‌ని.. ఆయ‌న భావిస్తున్నారు. దీంతో మోషేన్ రాజుకు ఊహించ‌ని ప‌ద‌విని ఇచ్చి.. రెండు ర‌కాలుగా లబ్ధిపొందేందుకు జ‌గ‌న్ ప్రయ‌త్నిస్తున్నార‌ని పార్టీ నేత‌ల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

Tags:    

Similar News