ఈసారి వీరికి టిక్కెట్ ఇస్తే అంతేనట

వైసీపీ వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. జగన్ ప్రత్యేకంగా తనకంటూ ఒక ఓటు బ్యాంకు ను పటిష్టం చేసుకుంటున్నారు. అనేక [more]

Update: 2021-06-26 06:30 GMT

వైసీపీ వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. జగన్ ప్రత్యేకంగా తనకంటూ ఒక ఓటు బ్యాంకు ను పటిష్టం చేసుకుంటున్నారు. అనేక మందిని అనేక రకాలుగా సాయం అందించి తనకు అనుకూలంగా మార్చుకోవడంలో జగన్ సక్సెస్ అయ్యారు. సంక్షేమ పథకాల ద్వారా, పేదలకు పక్కా ఇళ్లు, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చడంతో లక్షల కుటుంబాలు జగన్ కు చేరువయ్యాయని చెప్పవచ్చు.

ఎమ్మెల్యేలు దూరంగా…?

అయితే జగన్ పరంగా చూస్తే ఇదంతా బాగానే ఉన్నా ఆంధ్రప్రదేశ్ లో ఎంపీల పరిస్థితి అంత సానుకూలంగా లేదన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. వారు ప్రజలకు చేరువ కాలేకపోవడంతోనే వారిపై ప్రజల్లో అసంతృప్తి ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి 22 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం మాత్రమే టీడీపీ గెలిచింది. అయితే గెలిచిన చోట ఎంపీలు ఒకరిద్దరు మినహాయించి ఎవరూ రాజకీయంగా యాక్టివ్ గా లేకపోవడం పార్టీలో చర్చనీయాంశమైంది.

అందరూ యువకులు.. కొత్త వారే…

గెలిచిన 22 మంది వైసీపీ ఎంపీలలో చాలామంది యువకులే. కొత్తగా పార్లమెంటుకు ఎన్నికయిన వారే. అయితే ఏ ఎంపీకి ఎమ్మెల్యేల నుంచి సహకారం లభించడం లేదు. ఎంపీలను దూరం పెడుతున్నారు. ముఖ్యమైన కార్యక్రమాలకు కూడా ఆహ్వానం అందడం లేదు. కొన్ని నియోజకవర్గాల్లో ఎంపీలకు, మంత్రులకు పొసగడం లేదు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల్లో రెండు, మూడు చోట్ల మినహా అంతా ఇదే పరిస్థితి.

ప్రజల వద్దకు వెళ్లలేక…?

దీంతో వైసీపీ ఎంపీలు ప్రజల వద్దకు వెళ్లలేకపోతున్నారు. ఒంగోలు, నరసరావుపేట, రాజంపేట, అనంతపురం, హిందూపురం, బాపట్ల, మచిలీపట్నం, ఏలూరు, అమలాపురం, విశాఖ పార్లమెంటుస్థానాల్లో ఎంపీలకు, ఎమ్మెల్యేలకు మధ్య విభేదాలు తలెత్తాయి. దాదాపు పది నుంచి పదిహేను స్థానాల్లో ఇదే పరిస్థిితి ఉంది. వచ్చే ఎన్నికల్లో వీరే బరిలోకి దిగితే ఎమ్మెల్యేలుగా ఉన్న వారు సహకరించరన్న టాక్ కూడా ఉంది. మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులను మార్చాల్సిన పరిస్థితి జగన్ కు ఏర్పడిందంటున్నారు. లేకుంటే వారి గెలుపు కష్టమేనన్న నివేదికలు అందాయని తెలుస్తోంది.

Tags:    

Similar News