ఇదే ఆఖరి బాటిల్
గమ్యం సినిమాలో కథా నాయికను వెదుక్కుంటూ శర్వానంద్ ఊళ్ళు పట్టుకుని తిరిగే క్రమంలో అతని బైక్ కొట్టేయడానికి అల్లరి నరేష్ జత కలుస్తాడు…” వీళ్ళిద్దరూ కలిసి ఓ [more]
గమ్యం సినిమాలో కథా నాయికను వెదుక్కుంటూ శర్వానంద్ ఊళ్ళు పట్టుకుని తిరిగే క్రమంలో అతని బైక్ కొట్టేయడానికి అల్లరి నరేష్ జత కలుస్తాడు…” వీళ్ళిద్దరూ కలిసి ఓ [more]
గమ్యం సినిమాలో కథా నాయికను వెదుక్కుంటూ శర్వానంద్ ఊళ్ళు పట్టుకుని తిరిగే క్రమంలో అతని బైక్ కొట్టేయడానికి అల్లరి నరేష్ జత కలుస్తాడు…” వీళ్ళిద్దరూ కలిసి ఓ ఊరెళ్లినపుడు ముసలమ్మ తో నరేష్ కు కొన్ని సీన్లు ఉంటాయి. “టీ తాగుతావా అని అడిగి., ఆ… “మా టీ మీరెందుకు తాగుతారులే అని అంటుంది”. అంతకు ముందు కూడా ఆమె అలాగే అనడంతో నరేష్ కి చిర్రెత్తి టీ తాగేస్తాడు.. ఇది చూసినప్పుడల్లా ఓ ఎంపీ గుర్తొస్తాడు.
తనకు తాను రాజగురువుగా…
అప్పట్లో ఆయన తనను తాను రాజ గురువుగా భావించే వారు. మొత్తం తన కనుసన్నల్లోనే #రాజకీయం నడుస్తోంది అన్నట్టు ఆయన మాటలు ఉండేవి. ఫలానా నాయకుడి ప్రతి స్టెప్ తానే డిసైడ్ చేస్తున్నాను అనేవాడు. ఎమ్మెస్ ఫ్లాట్ లలో నాలుగో అంతస్తులోనో, ఐదో అంతస్తులోనో ఆయన క్వార్టర్ ఉండేది. సీపీడబ్ల్యూ వాళ్ళు ఇచ్చిన ఫర్నిచర్ తప్ప వేరే ఏమి ఆ ఫ్లాట్ లో ఉండేవి కాదు. ఢిల్లీ వచ్చినపుడు ఆయన లగేజీ మాత్రం అందులో ఉండేది. ఆయన ఉన్నా దుమ్ము కొట్టుకుపోయి ఉండేది ఫ్లాట్. మీడియాలో ఉండాలి కాబట్టి బాగా హడావుడి చేసేవాడు. ఎప్పుడైనా ఆయనకు మీడియా గుర్తొస్తే వాళ్ళు చచ్చినట్టే అన్నమాట. ఇంట్లో సోఫాలో కూర్చుని కాళ్ళ మధ్యలో నీళ్ల బాటిల్ పెట్టుకుని కబుర్లు చెప్పేవాడు. మిట్ట మధ్యాహ్నం ఎవరికి గొంతెండి పోయినా ఆ బాటిల్ స్థానం మాత్రం కదలదు. ఎవరైనా నీళ్లు అడిగితే “నాన్న ఒక్కటే బాటిల్ ఉంది… మీకు తెలుసు కదా నా ఫ్లాట్ లో ఎవరు ఉండరు, ఫ్రిడ్జ్ లో బాటిల్స్ లేవు”…. ఇదే ఆఖరి బాటిల్…. బయటకు వెళ్ళినపుడు తెచ్చుకోవాలి అని జాలిగా చెప్పేవాడు.
ప్రతి సారీ ఇదే సీన్….
ప్రతి సారి ఇదే సీన్…..అక్కడ ప్రెస్ మీట్ అంటే అందరికి చొక్కాలు తడిచిపోయేవి. ముందే హెచ్చరించుకుని కార్లలో నీళ్లు పెట్టుకుని వెళ్లే వారు.కొన్నాళ్ళకి అక్కడ పద్ధతి మారింది. పక్కనున్న పురంధేశ్వరి ఇంటి నుంచో, ఆ పక్కన ఉన్న అనంత వెంకట రామి రెడ్డి ఇంటి నుంచో నీళ్లు, కాఫీలు వచ్చేవి. వాళ్ళ సిబ్బంది ఆ మీటింగ్ ఎదో మా ఇంట్లోనే పెట్టుకోవచ్చుగా, అటూఇటూ తిరగలేక చేస్తున్నాం అని గొణుక్కునే వాళ్ళు. మొదట్లో నీళ్లు, తర్వాత కాఫీలు, ఆ తర్వాత డ్రింక్స్…. ఇలా మీటింగ్ ఇక్కడ, డ్రింక్స్ పక్కింటి నుంచి వచ్చేవి… ఉండబట్టుకోలేక సర్ మీకు ఓ పీఏ, అటెండర్, వంట మనిషి వీళ్ళందరి కోసం జీతాలు పార్లమెంట్ ఇస్తుందిగా అని ఓ సారి అడిగితే….. అబ్బబ్బే ఎందుకు నాన్న దండగ, ఆ జీతాలు అవి వాళ్ళకివ్వడం.., “నేను కాంటీన్లో తినేస్తా, ఎవరొకరి కార్లో లిఫ్ట్ అడుగుతా, లేదా వాళ్ళు వెళ్ళాక కార్ పంపమని అడుగుతా., దానికి వాళ్ళకి జీతాలు, గీతాలు అని ముగించాడు”. పార్లమెంట్ వాళ్ళ కోసం ఇచ్చిన జీతాలు ఆయన తీసుకున్నాడో లేదో నాకు తెలీదు, ఆయన్ని అడగలేదు. కాకపోతే ఆయన నోటి దూల బాగా చేటు చేసింది…. లేకపోతే ఎక్కడో ఉండేవాడు. ఆయన గుర్తొచ్చినపుడల్లా ఇదే అనిపిస్తుంది. ఎంపీలు కూడా వర్ణ, కుల, మత వివక్షతకు దూరం కారని ఆయనను చూసినప్పుడు గుర్తొస్తుంది.