ముద్రగడ పవన్ కు పవర్ తెచ్చి ఇచ్చేందుకేనా?

ఏపీ రాజకీయాల్లో కులాన్ని భుజానికి ఎత్తుకుని బాగుపడ్డ నాయకుని చరిత్ర లేదు. ఇదే పోరాటం ఏ ఉత్తరప్రదేశ్, బీహార్ లలో చేసి ఉంటే ముద్రగడ పద్మనాభం లాంటి [more]

Update: 2020-07-08 14:30 GMT

ఏపీ రాజకీయాల్లో కులాన్ని భుజానికి ఎత్తుకుని బాగుపడ్డ నాయకుని చరిత్ర లేదు. ఇదే పోరాటం ఏ ఉత్తరప్రదేశ్, బీహార్ లలో చేసి ఉంటే ముద్రగడ పద్మనాభం లాంటి కాపు నాయకులు ఇప్పటికి ముఖ్యామంత్రి సీట్లో పలుమార్లు కూర్చుని ఉండేవారు. కానీ ఆయన ఏపీలో ఉన్నారు. ఆయన యాభై ఏళ్ళ లోపు వయసులోనే అంటే రాజకీయంగా చాలా లేత వయసులోనే కులానికి కట్టుబడిపోయారు. కాపుల కోసం 1993లో ఆయన ఉద్యమం గట్టిగా మొదలెట్టారు. నాటి నుంచి నేటివరకూ ఏం సాధించారో తెలియదు కానీ ఆయన మాత్రం రాజకీయంగా ఎదగలేకపోయారు. అదే కాపు నినాదం పక్కన పెడితే గోదావరి జిల్లాల్లో ముద్రగడ పద్మనాభం వంటి బలమైన నేతను మించిన వారు ఎవరూ ఉండరు. ఈ పాటికి ఆయన పలు దఫాలు మంత్రిగా చేసి సీఎం సీటుకు దగ్గరగా వచ్చేసేవారు.

కదలికతో….

జగన్ సర్కార్ ఏర్పడిన కొత్తల్లో ముద్రగడ కాపుల రిజర్వేషన్ గురించి ముఖ్యమంత్రికి గుర్తు చేస్తూ లేఖ రాశారు. అయితే జగన్ గత ఎన్నికల్లో కాపులకు ఆ హామీ ఇవ్వలేదు, దాని మీద గెలవలేదు కాబట్టి మొహమాటంగానే ఆ లేఖ ముద్రగడ రాస్తూ మీరు హామీ ఇవ్వకపోయినా మా జాతి ఓట్లు వేసి గెలిపించింది కాబట్టి రాజనీతితో ఆలోచన చేసి కాపులకు రిజవేషన్లు ఇప్పించండి అని మాత్రమే కోరారు. అయితే దీన్ని వైసీపీ సర్కార్ లైట్ గా తీసుకుంది. ఆ తరువాత స్తబ్దుగా ఉన్న ముద్రగడ మళ్ళీ తాజాగా కాపులకు రిజర్వేషన్లు అంటున్నారు. ఈసారి కూడా ఆయన లేఖలో హార్ష్ పదాలు లేవు కానీ జగన్ పది కాలాలు ఏపీకి సీఎం గా ఉండాలంటే మాత్రం కాపులను బీసీలలో చేర్చాలని కాస్తా గట్టిగానే డిమాండ్ చేశారు.

పవన్ తో అలా….

నిజానికి కాపు నేస్తం ద్వారా మహిళలను ఆదుకుంటూ జగన్ శ్రీకారం చుట్టిన పధకం ఇపుడు ఆ కులంలో కాక రేపుతోంది. కాపు కార్పొరేషన్ మరో వైపు ఉండనే ఉంది. ఇవన్నీ చాలవు రిజర్వేషన్లు తప్ప అని పవన్ కళ్యాణ్ గట్టిగా తగులుకున్నారు. నిజానికి పవన్ రాజకీయంగా విమర్శలు చేశారు. దానికి వైసీపీ కాపు మంత్రులు అంతే ధీటుగా రివర్స్ లో అటాక్ చేశారు. ఆ కధ అక్కడితో అయిపోతుందనుకుంటున్న వేళ ముద్రగడ పద్మనాభం ఇపుడు రంగ ప్రవేశం చేయడమే ఆసక్తిని రేపుతున్న అంశం, కాపుల ఊసు ఎత్తడానికి పవన్ కి హక్కు ఎక్కడిది అని వైసీపీ నిలదీయడంతో అన్ని హక్కులూ పూర్తిగా ఉన్న ముద్రగడ పద్మనాభం రంగం మీదకు వచ్చారన్న మాట.

కలయికేనా….

ముద్రగడ పద్మనాభం కాపుల కోసం మళ్ళీ పోరాటం చేసే సూచనలు ఈ లేఖ ద్వారా కనిపిస్తున్నాయి. ఇక కాపుల విషయంలో గత ఎన్నికల ముందు కాస్తా అటు ఇటుగా ఆలోచించిన జనసేనాని పవన్ ఇపుడు వారి పక్షం నిలబడ్డారు. అంటే ముద్రగడది సామాజిక పోరాటం అయితే పవన్ ది రాజకీయ పోరాటం అన్న మాట. ఇలా కాపులకు ఒక పార్టీ ఉంది. వారి డిమాండ్ తీర్చేందుకు ఉద్యమమూ ఉంది అని చెప్పడానికి విడివిడిగా అయినా కలివిడిగా కూడబలుక్కునే ముద్రగడ పద్మనాభం, పవన్ స్పందించినట్లుగా అర్ధమవుతోంది. కాపులకు ఎటూ ముద్రగడే మొదటి చాయిస్. అయితే ఆయనకు రాజకీయంగా ఫోకస్ తగ్గిపోయింది. ఆ లోటుని పవన్ భర్తీ చేస్తారన్న మాట. 2024 నాటికి కాపులను రగిలించి ఆ ఓటూ,సీట్లు తమ ఖాతాలో వేసుకోవడానికి ఇదొక రాజకీయ ప్రయోగం అని కూడా భావించవచ్చునేమో.మొత్తానికి చక్రధారిగా ముద్రగడ సీన్ లోకి వచ్చాక పవన్ ఎటూ అర్జునుడై బాణాలు వేయాల్సిందే. ఇక వైసీపీ దీన్ని ఎదుర్కొనేందుకు ఎలాంటి ఆలోచన చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News