కొత్త ఎత్తుగడకు సిద్ధమయిందా?
ఏపీ రాజకీయాలను బీజేపీ బాగానే అవగాహన చేసుకున్నట్లుగా సీన్ కనిపిసోంది. అధికారం కొట్టాలంటే కోస్తాలో పట్టు సాధించాలన్న సూత్రాన్ని బీజేపీ నమ్ముకున్నట్లుగా ఉంది. అక్కడ కనుక గట్టిగా [more]
ఏపీ రాజకీయాలను బీజేపీ బాగానే అవగాహన చేసుకున్నట్లుగా సీన్ కనిపిసోంది. అధికారం కొట్టాలంటే కోస్తాలో పట్టు సాధించాలన్న సూత్రాన్ని బీజేపీ నమ్ముకున్నట్లుగా ఉంది. అక్కడ కనుక గట్టిగా [more]
ఏపీ రాజకీయాలను బీజేపీ బాగానే అవగాహన చేసుకున్నట్లుగా సీన్ కనిపిసోంది. అధికారం కొట్టాలంటే కోస్తాలో పట్టు సాధించాలన్న సూత్రాన్ని బీజేపీ నమ్ముకున్నట్లుగా ఉంది. అక్కడ కనుక గట్టిగా నిలబడి రేసులో ఉన్నట్లుగా చెప్పుకుంటే మిగిలిన ప్రాంతాలు అనుసరించడం ఖాయమన్న ధియరీని ఇపుడు అమలు చేస్తోంది. ఇక ఏపీలో కాపులనే దువ్వేందుకు బీజేపీ సిధ్ధమైనట్లుగా తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. అందువల్లనే జనసేనాని పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకున్న బీజేపీ ఇపుడు సీనియర్ నేత, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభాన్ని దువ్వుతోంది. ఆయన కనుక వస్తే తమకు కొస్తా తీరంలో తిరుగు ఉండదని బలంగా విశ్వసిస్తోంది.
పాత కాపే….
నిజానికి ముద్రగడకు బీజేపీ కొత్త కాదు, ఆయన సరిగ్గా 22 ఏళ్ళ క్రితం అంటే 1998 టైంలో బీజేపీలో చేరారు. నాడు దేశమంతా వాజ్ పేయ్ ప్రభంజం ఉన్న వేళ బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఫలితంగా గోదావరి జిల్లాలో రెండు ఎంపీ సీట్లు కూడా బీజేపీ పరం అయ్యాయి. ఆ తరువాత ఊపుని కంటిన్యూ చేయడంతో బీజేపీ విఫలమైంది. ముద్రగడ కూడా ఆ పార్టీకి రాజీనామా ఇచ్చేశారు. ఇక ముద్రగడ గత కొంతకాలంగా తన సొంత సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకునే పోరాటాలు చేస్తున్నారు. కాపులను బీసీల్లో కలపాలన్నది ఆయన ఉద్యమం. మరి ఆయన్ని బీజేపీ దగ్గరకు తీస్తే దీని మీద కూడా మాట్లాడాల్సివుంటుంది.
అది జరిగితేనే…
తాజాగా ముద్రగడ ఇంటికి వెళ్ళి మరీ బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు చర్చలు జరిపారు. ఇపుడున్న వాతావరణంలో కాపులకు బీజేపీ పెద్ద పీట వేస్తోందని, వచ్చి చేరాలని కోరినట్లుగా చెబుతున్నారు. అయితే తనకు రాజకీయాల కంటే కూడా కాపులను బీసీలల్లో చేర్చే అంశమే ముఖ్యమని ముద్రగడ అన్నట్లుగా చెబుతున్నారు. బీజేపీలో చేరి పదవులు పొందితే తన మీద కాపు ద్రోహి ముద్ర పడుతుందని ఆయన ఆలోచిస్తున్నారని అంటున్నారు. అదే సమయంలో ఒక బలమైన జాతీయ పార్టీగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరి తమ చిరకాల డిమాండ్ ని నెగ్గించుకోగలిగితే చరిత్రలో తాను నిలిచిపోతానని ముద్రగడ అనుకుంటున్నట్లుగా కూడా ప్రచారం ఉంది. మరి బీజేపీ బీసీల్లో కాపులను చేర్చే అంశంలో ఎంతవరకు ముందుకు వస్తుందన్నది పెద్ద ప్రశ్న.
బీసీలు దూరం….
మరో వైపు దేశంలో కూడా పలు చోట్ల కుల ఉద్యమాలు గట్టిగానే జరుగుతున్నాయి. బీసీల్లో, ఎస్సీల్లో చేర్చమంటూ ఉత్తరాదిన అట్టుడిపోయే పోరాటాలు ఎన్నో ఉన్నాయి. ఇపుడు ఏపీలోని ఒక్క కాపుల అంశమే బీజేపీ పరిష్కరించాలనుకుంటే మొత్తం తేనె తుట్టె కదిలినట్లు అవుతుంది. దాంతో బీజేపీ అటువంటి సాహసం చేయదని అంటున్నారు. పైగా బీసీలు కూడా ఏపీలో దూరమయ్యే ప్రమాదం కూడా ఉంది. రాజకీయంగా ఇది మంచి పరిణామం కాదని కూడా ఆ పార్టీకి తెలుసు. మరి కాపునేత ముద్రగడ ఎటువంటి హామీ తీసుకోకుండా బీజేపీలోకి వస్తారా అన్నదే పెద్ద డౌట్. వచ్చినా ఆయన సైతం విమర్శల పాలు అయితే అపుడు కాపుల మద్దతు దేముడెరుగు అసలుకే ఎసరు వచ్చినా వస్తుంది. దాంతో వయా మీడియాగా ఒక పరిష్కారం ఆలోచించైనా ముద్రగడ వంటి జెయింట్ ని ని బీజేపీలోకి తీసుకురావాలని బీజేపీ వ్యూహ రచన చేస్తోంది. అదే కనుక జరిగితే ఏపీలో రాజకీయ పరిణామాల్లో కొత్త సమీకరణలు చోటు చేసుకోవడం ఖాయమని అంటున్నారు.