మురళీ మోహన్ @ సేల్
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టమే. వర్కవుట్ అయినన్నాళ్లు ఇబ్బందులు ఉండ వు కానీ, వర్కవుట్ కానప్పుడే కష్టం. ఇప్పుడు ఇలాంటి పరిస్థితినే.. సినీ నటుడు, [more]
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టమే. వర్కవుట్ అయినన్నాళ్లు ఇబ్బందులు ఉండ వు కానీ, వర్కవుట్ కానప్పుడే కష్టం. ఇప్పుడు ఇలాంటి పరిస్థితినే.. సినీ నటుడు, [more]
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టమే. వర్కవుట్ అయినన్నాళ్లు ఇబ్బందులు ఉండ వు కానీ, వర్కవుట్ కానప్పుడే కష్టం. ఇప్పుడు ఇలాంటి పరిస్థితినే.. సినీ నటుడు, మాజీ ఎంపీ మురళీ మోహన్ ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి రాజకీయాల నుంచి విరమించుకునేలా ఉందని అం టున్నారు. సినిమా రంగంలో తనకంటూ.. ప్రత్యేక స్థానం సంపాయించుకున్న మురళీ మోహన్.. ఆది నుంచి కూడా టీడీపీకి అనుకూలంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ రాజకీయాల్లో ఉన్న సమయంలోనే ఆయన తరఫున విస్తృతంగా ప్రచారానికి వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
రాజ్యసభకు ఆఫర్ చేసినా…
రాష్ట్ర మంతా కలియదిరిగి.. ఎన్టీఆర్ తరపున మురళీ మోహన్ ప్రచారం చేశారు. మురళీమోహన్‌కు ఎన్టీఆర్ రాజ్యసభ ఆఫర్ చేసినా ఆయన మాత్రం ఎంపీగా పోటీ చేసి గెలవాలని అనుకునేవారు. చాలా రోజుల పాటు ఆయన కోరిక అలాగే ఉండిపోయింది. ఈ క్రమంలోనే 2005లో రాజమండ్రిలో ఎంట్రీ ఇచ్చారు మురళీ మోహన్. 2009లో ఉండవల్లి అరుణ్‌కుమార్‌పై రాజమండ్రి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ.. నియోజకవర్గంలో ప్రజలకు మురళీ మోహన్ అందుబాటులో ఉన్నారు. దీంతో 2014 ఎన్నికల నాటికి రాజమండ్రి ప్రజలు మురళీ మోహన్‌పై విశ్వాసం కనబరిచారు. ఆయనకు జై కొట్టారు.
రాజకీయ వారసురాలిగా….
పదేళ్ల పాటు ప్రజల్లోనే ఉన్నందుకు ఆయన తగిన ప్రతిపలం దక్కింది. 2014లో గెలుపు గుర్రం ఎక్కారు మురళీ మోహన్. అయతే, రెండు సంవత్సరాలు గడిచే సరికి.. మురళీ మోహన్ ఆరోగ్యం దెబ్బతింది. దీంతో ఆయన నియోజకవర్గానికి దూరమయ్యారు. ఈ క్రమంలోనే మురళీ మోహన్ కోడలు రూపాదేవి రంగ ప్రవేశం చేశారు. ఇక్కడ అన్నీ తానై చూసుకున్నారు. ప్రజలకు చేరువయ్యారు. వారి సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేశారు. దీంతో మురళీ మో హన్ తన రాజకీయ వారసురాలిగా రూపాదేవికి అవకాశం కల్పించారు. ఈ క్రమంలోనే తాజా ఎన్నికల్లో రాజమండ్రి టీడీపీ అభ్యర్థిగా రూపాదేవి పోటీ చేశారు.
చంద్రబాబు కోరినా…
అయితే, జగన్ సునామీ ప్రభావంతో ఆమె ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ.. ప్రజలకు చేరువగా ఉండి.. వచ్చే ఎన్నికల నాటికి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ఆమె భావిస్తున్నారు. కానీ, ఓటమి ప్రభావం.. మురళీ మోహన్‌ను భారీగా కుంగదీసింది. దీంతో ఆయన ఏకంగా రాజకీయాలకే గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్నమురళీ మోహన్.. తన కోడలిని కూడా రాజకీయాల నుంచి దూరంగా ఉంచాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల మురళీమోహన్ శస్త్రచికిత్స చేయించుకున్నప్పుడు ఆయన్ను పరామర్శించేందుకు వెళ్లిన చంద్రబాబు రూపాదేవిని రాజకీయాల్లో ఉంచాలని…. ఆమెకు మీరు అడ్డు చెప్పవద్దని సూచించినా…ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీలో ఉంటే వ్యాపారాలు దెబ్బతింటాయని.. వారు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు పార్టీ వర్గాలే చర్చింకుంటున్నాయి.
రాజమండ్రిలో ఆస్తులను…
ఈ క్రమంలోనే మురళీ మోహన్ రాజమండ్రిని ఖాళీ చేసేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాజమండ్రిలో ఉన్న ఆస్తులను అమ్మేయాలని కూడా నిర్ణయించుకున్నారట. పార్టీ ఆఫీస్‌లో పనిచేస్తున్నవారిని తొలగించేందుకు రెడీ అయ్యారని టీడీపీలోనే చర్చ సాగుతుండడం విశేషం. అదే సమయంలో పార్టీ కార్యాలయం కూడా అద్దెకిచ్చేశారు. మొత్తం మూడు ఫ్లోర్‌లలో రెండింటిని అద్దెకు ఇచ్చి.. కేవలం ఒకటి మాత్రమే వ్యక్తిగత అవసరాలకు ఉంచుకున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే ఇక, మురళీమోహన్ రాజకీయాలకు స్వస్థి చెప్పాలని నిర్ణయించుకున్నారనే ప్రచారం జోరుగా సాగుతుండడం గమనార్హం.