అందుకే ఈయన సైలెంట్ గా సమర్పించుకున్నారా?
రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చెప్పలేం. ఇక, వ్యాపార పరంగాకూడా అంతే. ఏదైనా చేసేటప్పుడే.. సదరు వ్యవహారంపై పూర్తిగా పట్టుసాధించాలని నాయకులు భావిస్తారు. వ్యాపారంలో.. రాజకీయంలో [more]
రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చెప్పలేం. ఇక, వ్యాపార పరంగాకూడా అంతే. ఏదైనా చేసేటప్పుడే.. సదరు వ్యవహారంపై పూర్తిగా పట్టుసాధించాలని నాయకులు భావిస్తారు. వ్యాపారంలో.. రాజకీయంలో [more]
రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చెప్పలేం. ఇక, వ్యాపార పరంగాకూడా అంతే. ఏదైనా చేసేటప్పుడే.. సదరు వ్యవహారంపై పూర్తిగా పట్టుసాధించాలని నాయకులు భావిస్తారు. వ్యాపారంలో.. రాజకీయంలో ఆధిపత్యం సహజం. అయితే తమ పార్టీనే అధికారంలో ఉన్నా.. ఒక్కొక్కసారి తప్పటడుగులు వేస్తుంటారు. లేదా.. పార్టీ అధినేతలను ఒప్పించలేకపోతుంటారు. దీంతో సదరు నేతలు ఇప్పుడు జగన్ సర్కారు చేతిలో నలిగిపోతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఓ విషయం చాలా విస్మయానికి దారితీసింది.
రియల్ ఎస్టేట్ వ్యాపారిగా..?
టీడీపీలో సీనియర్ నాయకుడు, రాజమండ్రి నుంచి 2014లో విజయం దక్కించుకున్న సినీ నటుడు మాగంటి మురళీమోహన్‌కు జగన్ ప్రభుత్వం బాగానే వాత పెట్టిందని.. అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీనిపై అటు మురళీ మోహన్ కూడా ఎక్కడా యాగీ చేయకుండా.. సైలెంట్‌గా జగన్ ప్రభుత్వం చెప్పినట్టే నడుచు కున్నారని.. ఇక, టీడీపీ నేతలు సైతం ఎక్కడా దీనిని వివాదం చేయలేదని అంటున్నారు. విషయంలోకి వెళ్తే.. మాగంటి మురళీ మోహన్ సినిమాల్లో సంపాయించుకున్న సొమ్ముతో జయభేరి అనే నిర్మాణ సంస్థతో రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేశారు.
రాజధాని ప్రాంతంలో….
ఈ క్రమంలో మురళీమోహన్ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక.. రాజధాని ప్రాంతం అమరావతిని దృష్టిలో ఉంచుకుని.. గుంటూరు జిల్లా (విజయవాడ బోర్డర్) తాడేపల్లి సమీపంలోని కుంచనపల్లి ప్రాంతంలో.10 ఎకరాల వ్యవసాయ స్థలం కొన్నారు. వాస్తవానికి ఇది వ్యవసాయ సాగు భూమి. అంటే.. ఈ భూమిలో ఎలాంటి నిర్మా ణాలు చేపట్టకూడదు. ముఖ్యంగా నివాసాలకు అసలు వాడకూడదు. అయితే.. ఇలా వాడుకునేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చుకుని, ల్యాండ్ కన్వర్షన్ యాక్ట్ ప్రకారం వ్యవసాయేతర భూమిగా మార్చు కుంటే సరిపోతుంది.
చంద్రబాబు తొక్కిపెట్టడంతోనే….
మరి ఈ విషయంలో మాగంటికి చంద్రబాబు ప్రభుత్వం పెద్ద దెబ్బ వేసేసింది. ఈ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చాలంటూ.. పెట్టుకున్న అర్జీని దాదాపు మూడు సంవత్సరాల పాటు తొక్కి పెట్టింది. దీనికి కారణాలు ఏమిటో తెలియదు. సరే.. 'ప్రభుత్వం మనదే కదా!' అనుకున్న మురళీమోహన్ ఆ భూమిలో భారీ ఎత్తున అపార్ట్‌మెంట్లు కట్టేశారు. ఇక, ఆ తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చే వరకు ఈ భూమి తాలూకు వివాదాన్ని చంద్రబాబు సర్కారు పరిష్కరించలేదు.
వెంటనే చెల్లించి….
ఇక, జగన్ సర్కారు.. ఈ ఏడాది ప్రారంభంలోనే దీనిపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే మురళీ మోహన్‌కు నోటీసులు జారీ చేయడమే కాకుండా.. సుమారు రూ.2 కోట్ల రూపాయల వరకు ఫైన్ విధించింది. దీంతో ఈ విషయంలో చేతులు కాలాయని భావించిన మురళీ మోహన్.. ప్రభుత్వం వేసిన ఫైన్ చెల్లించి చాలా సైలెంట్ అయిపోయారు. ఇక, ఇదే విషయం తెలిసినప్పటికీ.. టీడీపీ నేతలు మౌనంగా ఉండడం గమనార్హం. మొత్తానికి తాజాగా వెలుగు చూసిన ఈ విషయం.. రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.