ఈ నాదెండ్ల ఉన్నాడే?

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కేవలం ఒక్కరిపైనే ఆధారపడుతున్నారు. ఆయనకు అన్నింటా అధికారాలు ఇచ్చారు. దీంతో జనసేన పార్టీ నేతల్లో అసహనం వ్యక్తమవుతుందంటున్నారు. అందుకే జనసేనను [more]

Update: 2021-05-05 13:30 GMT

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కేవలం ఒక్కరిపైనే ఆధారపడుతున్నారు. ఆయనకు అన్నింటా అధికారాలు ఇచ్చారు. దీంతో జనసేన పార్టీ నేతల్లో అసహనం వ్యక్తమవుతుందంటున్నారు. అందుకే జనసేనను వరసపెట్టి నేతలు విడిచిపోతున్నారన్న టాక్ పార్టీలో బలంగా విన్పిస్తుంది. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ టార్గెట్ గా సోషల్ మీడియాలో కొందరు పోస్ట్ లు పెడుతుండటం చర్చనీయాంశంగా మారింది.

వివాదాలకు దూరంగా….

నాదెండ్ల మనోహర్ వివాదాలకు దూరంగా ఉండే నేత. నిజానికి నాదెండ్ల మనోహర్ వైసీపీలో చేరాల్సి ఉంది. వైసీపీలో అవకాశం లేకపోవడంతో టీడీపీలో చేరాలనుకున్నారు. కానీ టీడీపీలో తనకు పోటీ దారులు ఎక్కువగా ఉండటంతో ఆయన జనసేనను ఎంచుకున్నారు. పవన్ కల్యాణ్ కు నమ్మకమైన వ్యక్తిగా మారారు. దీంతో పవన్ కల్యాణ్ నాదెండ్ల మనోహర్ ను రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ గా నియమించారు.

ఎక్కువ ప్రాధాన్యత….

పవన్ కల్యాణ్ కు చరిష్మా ఉండటం ఆయన ఎక్కువగా జనంలోకి వెళితే ఇబ్బందులు తలెత్తుతాయని భావించి నాదెండ్ల మనోహర్ కే ఎక్కువ పనులను అప్పగిస్తున్నారు. వివిధ జిల్లాల బాధ్యతలను కూడా నాదెండ్ల మనోహర్ చూసుకుంటున్నారు. జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పార్టీ పై అసంతృప్తి వ్యక్తం చేయడానికి నాదెండ్ల మనోహర్ కారణమంటున్నారు. తనకు నాదెండ్ల సరైన గౌరవం ఇవ్వలేదని పలుమార్లు ఆయన ఆరోపించారు.

వీడిన నేతలందరూ….

ఇక జేడీ లక్ష్మీనారాయణ నుంచి మొన్నటి మాదాసు గంగాధరం వరకూ వరసగా పార్టీని వీడి వెళ్లిపోయిన నేతలందరూ తమ వేళ్లను నాదెండ్ల మనోహర్ వైపే చూపుతున్నారు. పవన్ కల్యాణ్ నాదెండ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, ఇతర నేతలతో కలసి సమస్యలపై చర్చించక పోవడంతోనే ఈ ఇబ్బంది ఎదురయిందంటున్నారు. మొత్తం మీద సోషల్ మీడియాలో నాదెండ్ల మనోహర్ జనసైనికులకు టార్గెట్ గా మారుతున్నారు.

Tags:    

Similar News