నాదెండ్ల సైలెంట్ వెనక ?

జనసేనలో పవన్ కళ్యాణ్ తరువాత స్థానం ఎవరిది అంటే కచ్చితంగా నాదెండ్ల మనోహర్ అని చెబుతారు. ఆయన సీనియర్ నాయకుడు, రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఉప సభాపతి, [more]

Update: 2020-02-18 05:00 GMT

జనసేనలో పవన్ కళ్యాణ్ తరువాత స్థానం ఎవరిది అంటే కచ్చితంగా నాదెండ్ల మనోహర్ అని చెబుతారు. ఆయన సీనియర్ నాయకుడు, రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఉప సభాపతి, సభాపతిగా పనిచేసిన అనుభవం కలిగిన నేతగా మంచి గుర్తింపు ఉంది. పైగా తండ్రి నాదెండ్ల భాస్కరరావు రాజకీయ వారసుడిగా కూడా ఉన్నారు. నాదెండ్ల మనోహర్ జనసేనలో చేరాక పార్టీ రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడల్లో మార్పులు కూడా వచ్చాయని అంటారు. 2019 ఎన్నికల్లో టీడీపీతో లోపాయికారి అవగాహనలు, బీఎస్పీ, వామపక్షాలతో పొత్తులకు కూడా నాదెండ్ల మనోహర్ ఆలోచనలే కారణం అంటారు. రాజకీయంగా నాదెండ్ల అనుభవాన్ని పవన్ సైతం బాగానే తీసుకుని పార్టీలో అయన్ని నంబర్ టూ గా చేశారు. అయితే ఈ బంధం ఇపుడు కొంత బీటలు వారే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు.

కనబడలేదుగా..?

తాజాగా అమరావతి పర్యటన పవన్ చేస్తే పక్కన నాదెండ్ల మనోహర్ లేరు. దాని వెనక చాలా విషయాలు ఉన్నాయని అంటున్నారు. నాదెండ్ల మనోహర్ ముందుగానే పవన్ తో మాట్లాడుకుని తాను ఆరోగ్య కారణాల వల్ల రాలేనని చెప్పారని అంటున్నారు. అయితే అది సరైన కారణం కాదని, పవన్ పోకడలతో విసుగెత్తిన నాదెండ్ల మనోహర్ అలా కావాలని తప్పుకున్నారని చెబుతున్నారు. పవన్ వెంట అలా ఈ మధ్య నాదెండ్ల మనోహర్ వరసగా మిస్ కావడం ఆయన వేరే రూట్లోకి వెళ్తున్నారా అన్న అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి.

నచ్చలేదా…?

ఇక పవన్ మళ్ళీ సినిమాల్లో నటించడంనాదెండ్ల మనోహర్ కు అసలు నచ్చలేదని అంటున్నారు. దీని వల్ల పార్టీ క్యాడర్ కి తప్పుడు సంకేతాలు వెళ్తాయని, జనం కూడా పవన్ని నాన్ సీరియస్ పొలిటీషియన్ గా చూస్తారని నాదెండ్ల మనోహర్ వాదించారని అంటున్నారు. పవన్ కి ఈ విషయంలో తన వంతుగా సలహా ఇచ్చారని కూడా చెబుతున్నారు. అయితే పవన్ మాత్రం నాదెండ్ల మనోహర్ మాటలను పట్టించుకోకుండా వరసగా సినిమాలు చేసూండడంతో అహం దెబ్బ తిన్న నాదెండ్ల తనకెందుకొచ్చిన తంటా అనుకుని పార్టీకి కొంత ఎడం పాటిస్తున్నార‌ని వినిపిస్తోంది.

అంచనా అదేనా…?

పవన్ వెంట గత మూడేళ్ళుగా ఉన్న నాదెండ్ల మనోహర్ జనసేనకు ఆయువు పోయడానికి తన వంతుగా కృషి చేశారు. పవన్ గ్లామర్ ని పార్టీ కోసం వాడుకునేందుకు అనేక అవకాశాలను అన్వేషించారు. అయితే అతి పెద్ద మైనస్ గా పవన్ వైఖరి ఉండడంతోనే నాదెండ్ల మనోహర్ సక్సెస్ కాలేకపోయారని అంటున్నారు. పవన్ నిలకడ లేని విధానాలు, పూటకో మాటతోనే పార్టీకి విశ్వసనీయత తగ్గిందని అంటున్నారు. ఇక మరో నాలుగేళ్ళ పాటు పార్టీని పార్ట్ టైం పాలిటిక్స్ తో పవన్ ఇలాగే నడిపితే మరింత ఇబ్బంది వస్తుందని ముందే అంచనాకు వచ్చిన నాదెండ్ల మనోహర్ మెల్లగా సైడ్ అయిపోతున్నారని అంటున్నారు. మరి నాదెండ్ల మనోహర్ కనుక పార్టీని వీడితే అది జనసేనకు, పవన్ కి పెద్ద దెబ్బగా ఉంటుందని అంటున్నారు. ఈ నేపధ్యంలో నాదెండ్ల మనోహర్ ఏ పార్టీలో చేరుతారన్నది మరో చర్చగా ఉంది. ఆయనకు వైసీపీ అప్పట్లోనే ఆఫర్లు ఇచ్చింది. ఆయన కూడా రావాలనుకున్నారు. మరి ఇపుడు ఏం చేస్తారో.

Tags:    

Similar News