సాగర్ లో గెలుపు అవకాశాలు ఎవరివంటే?
నాగార్జున సాగర్ ఎన్నిక పూర్తయింది. ఇక ఫలితాల కోసం ఎదురు చూడాల్సిందే. సాగర్ ఉప ఎన్నిక రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. తిరుపతి కన్నా [more]
నాగార్జున సాగర్ ఎన్నిక పూర్తయింది. ఇక ఫలితాల కోసం ఎదురు చూడాల్సిందే. సాగర్ ఉప ఎన్నిక రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. తిరుపతి కన్నా [more]
నాగార్జున సాగర్ ఎన్నిక పూర్తయింది. ఇక ఫలితాల కోసం ఎదురు చూడాల్సిందే. సాగర్ ఉప ఎన్నిక రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. తిరుపతి కన్నా సాగర్ మీదనే అందరి దృష్టి ఉంది. తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ విజయం ముందుగానే ఖాయమయి పోవడంతో దానిపై పదె్దగా ఉత్కంఠ లేదు. కానీ నాగార్జున సాగర్ లో మాత్రం హోరాహోరీ పోరు జరుగుతుంది. ఇక్కడ గెలుపు ఎవరిదన్నది ఎవరికి అంతుపట్టకుండా ఉంది.
టీఆఎస్ నమ్మకమిదే….
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో తాము ఖచ్చితంగా గెలుస్తామని టీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది. కేసీఆర్ స్వయంగా సాగర్ ఉప ఎన్నికను పర్యవేక్షించారు. నిత్యం నేతలతో ఫోన్ లో మాట్లాడుతూ వారికి వ్యూహాలను అందించారు. నోముల భగత్ ను గెలిపించేందుకు మంత్రులు రంగంలోకి దిగారు. పెద్దయెత్తున హామీలు గుప్పించారు. దుబ్బాక ఫలితం రిపీట్ కాకుండా ఉండేందుకు ఈసారి కేసీఆర్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.
జానారెడ్డికి విశ్వాసం….
నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి శక్తికి మించి కష్టపడ్డారు. ఆయన దాదాపు మూడు నెలల నుంచి ప్రచారం నిర్వహిస్తూనే ఉన్నారు. తనకు ఇవే చివరి ఎన్నికలంటూ జానారెడ్డి సానుభూతిని పొందేందుకు ప్రయత్నించారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని కూడా చెప్పారు. రెడ్డి సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉండటంతో ఈసారి తన గెలుపు ఖాయమని జానారెడ్డి గట్టిగా విశ్వసిస్తున్నారు.
బీజేపీ నామమాత్రమే…
భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా లంబాడా సామాజికవర్గానికి చెందిన డాక్టర్ రవికుమార్ పోటీ చేశారు. అయితే నాగార్జున సాగర్ లో బీజేపీ పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు. ఆ సామాజికవర్గం ఓట్లపైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. రవికుమార్ జానారెడ్డి శిష్యుడే కావడం గమనార్హం. అయితే నాగార్జున సాగర్ లో ప్రధాన పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్యనే ఉంది. విజయావకాశాలు ఈ ఇద్దరిలో ఎవరికైనా దక్కే ఛాన్స్ ఉంది. జానారెడ్డికే ఎక్కువ అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.