ఇప్పుడయినా కరెక్ట్ రిపోర్ట్ ఇచ్చారా.. సారూ?

ఏపీలో రాజకీయం రెండు ప్రాంతీయ పార్టీల మధ్యన ఉంది. ఉమ్మడి ఏపీలో టీడీపీతో పాటు కాంగ్రెస్ ప్రధాన పోటీదారులుగా ఉండేవారు. అంటే జాతీయ ప్రాంతీయ శక్తుల మధ్య [more]

Update: 2020-08-26 12:30 GMT

ఏపీలో రాజకీయం రెండు ప్రాంతీయ పార్టీల మధ్యన ఉంది. ఉమ్మడి ఏపీలో టీడీపీతో పాటు కాంగ్రెస్ ప్రధాన పోటీదారులుగా ఉండేవారు. అంటే జాతీయ ప్రాంతీయ శక్తుల మధ్య ఆనాడు యుధ్ధం సాగేదన్న మాట. విభజన ఏపీలో తమిళనాడు తరహాలో పొలిటికల్ సీన్ వచ్చేసింది. టీడీపీకి ప్రత్యర్ధిగా మరో ప్రాంతీయ పార్టీ వైసీపీ అవతరించింది. ఈ రెండు ప్రాంతీయ పార్టీల మధ్యన రాజకీయం జాగ్రత్తగా సర్దుకుంది. ఇక రెండు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ సోదిలోకి లేకుండా పోయాయి.

ఆ శూన్యంలోకి …..

ఇక ఏపీలో ఇపుడు వైసీపీ అధికారంలోకి వచ్చింది. టీడీపీని చంద్రబాబు బలవంతాన లాక్కొస్తున్నారు. ఆయన వయసు, లోకేష్ వరస చూసిన వారు పార్టీ బతికి బట్టకట్టడం కష్టమేనని తేల్చిచెబుతున్నారు. మరో వైపు చూస్తే వైసీపీ కూడా టీడీపీని లేకుండా చేయాలనుకుంటోంది. తెలుగుదేశం చూసేసిన సినిమా అని జనం ఫిక్స్ అవాలని జగన్ పంతం. ఈ పోరాటంలో రెండవ ప్రాంతీయ పార్టీ ఖాళీ అయితే సందు చూసి అందులోకి రావాలని బీజేపీ ఆరాటం. దానికి జనసేనతో పొత్తుతో కాస్తా పొలిటికల్ గ్లామరు అద్ది న్యూ మేకప్ ఇచ్చింది.

కాంగ్రెస్ రెడీ….

ఇపుడు ఏపీలో రాజకీయ మైదానం తమకు అనుకూలమని కాంగ్రెస్ భావిస్తోందిట. కాంగ్రెస్ పార్టీకి రాజస్థాన్ పరిణామాలతో కొంత ధైర్యం వచ్చింది. కరోనా తరువాత తగ్గుతున్న మోడీ గ్రాఫ్ ని చూసి ప్రియాంక రాహుల్ గట్టిగా పట్టుపడితే 2024 నాటికి అంతా అనుకూలం అవుతుందని కాంగ్రెస్ పెద్దలు అంచనాలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో పోయిన చోట వెతుక్కోవాలన్న రాజకీయ సూత్రాన్ని అనుసరించి ఏపీలో కాంగ్రెస్ జెండా మళ్ళీ పాతేందుకు రెడీ అవుతున్నారుట. ఇక ఏపీలో పాత కాపు, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని ఢిల్లీకి స్వయంగా పిలిపించుకుని మరీ ఏపీ రాజకీయాల మీద‌ నివేదికను తీసుకున్నారని అంటున్నారు.

కాంగ్రెస్ రీ ఎంట్రీ…..

ఏపీలో రాజకీయ వాతావరణం తమకు అనుకూలంగా ఉంటుందని కిరణ్ కుమార్ రెడ్డి ఒక నివేదికను రాహుల్, ప్రియాంకలకు ఇచ్చినట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం అవుతోంది. ఏపీలో చంద్రబాబు చతికిలపడిపోయారని, ఆయన పార్టీ తిరిగి లేవడం కష్టమేనని కూడా కిరణ్ చెప్పినట్లుగా తెలుస్తోంది. అదే విధంగా ఏపీలో ఎన్నో ఆశలు పెట్టుకుని వైసీపీని జనం గెలిపిస్తే ఏడాదిలోనే జగన్ తన దూకుడు రాజకీయంతో వెగటు పుట్టించారని కూడా కిరణ్ కుమార్ రెడ్డి తన నివేదికలో పేర్కొన్నారుట. ఏపీలో కాంగ్రెస్ కి ఇపుడు అన్ని విధాలుగా కలసివచ్చే వాతావరణం ఉందని ఆయన వివరించారుట. ఇప్పటి నుంచే గట్టి నేతలను ఎంపిక చేసుకుని పార్టీని జనంలోకి తీసుకువెళ్తే 2024 నాటికి అనూహ్యమైన ఫలితాలు వస్తాయని, పోయిన ఓటు బ్యాంక్ కూడా కాంగ్రెస్ గూటికి చేరుతుందని కిరణ్ కుమార్ రెడ్డి ఆశావహమైన నివేదికను రాహుల్, ప్రీయాంక చేతిలో పెట్టారట. మరి కాంగ్రెస్ రీ ఎంట్రీ ఎలా ఉంటుందో చూడాల్సిందే.

Tags:    

Similar News