నల్లారి ఇన్సింగ్స్ ముగిసినట్లేనా.. కొత్త శకం స్టార్ట్ అవుతుందా?
సమైక్యాంధ్రప్రదేశ్‌కు చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డికి క్రికెట్ అంతే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన భారత మాజీ క్రికెట్ జట్టు కెప్టెన్ అజారుద్దీన్ [more]
సమైక్యాంధ్రప్రదేశ్‌కు చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డికి క్రికెట్ అంతే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన భారత మాజీ క్రికెట్ జట్టు కెప్టెన్ అజారుద్దీన్ [more]
సమైక్యాంధ్రప్రదేశ్‌కు చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డికి క్రికెట్ అంతే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన భారత మాజీ క్రికెట్ జట్టు కెప్టెన్ అజారుద్దీన్ ఎంతో సన్నిహితులు. ఆయనకు ఇష్టమైన క్రికెట్ పరిభాషలో చెప్పాలంటే ఆయన పొలిటికల్ ఇన్సింగ్స్ ముగిసినట్టేనా ? లేదా ? ఆయన ఇన్సింగ్స్‌లో కొత్త శకం ఆరంభం కాబోతుందా ? అన్నదే ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ నేతల్లో చాలా మంది అడ్రస్ లేకుండా పోయారు. ఈ లిస్టులోనే ఉంటారు నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి.
చిన్న వయసులో పెద్ద పదవి….
ఎంతో మంది రాజకీయ నేతలు 70 ఏళ్లు వచ్చినా ఇంకా రాజకీయాల్లో ఏదో చేయాలని.. ఎంతో సాధించాలని.. మరెన్నో పదవులు చేపట్టాలని ఉత్సాహంగా పని చేస్తున్నారు. నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి వయస్సు చాలా చిన్నదే.. ఆయన ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. అయితే ఆయనకు చిన్న వయస్సులోనే పెద్ద పదవి రావడంతో ఆ పదవికి మించి ఏ పదవి ఆయనకు వచ్చే ఛాన్స్ లేకపోవడంతో ఆయన రాజకీయం అక్కడే ఆగిపోయింది. పైగా ఉమ్మడి ఆంధ్రాకు స్పీకర్… ఆ తర్వాత ముఖ్యమంత్రి ఇలా కీలక పదవులు చేపట్టిన నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి ఇప్పుడు ఏం చేయాలో ? రాజకీయంగా ఎటు వైపునకు పోవాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు.
పదవి ఏదీ లేక…..
వాస్తవంగా నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డికి రాష్ట్ర విభజన ఇష్టం లేదు. అందుకోసమే చివరి వరకు ముఖ్యమంత్రిగా ఉంటూనే అధిష్టానంతో ఫైట్ చేశారు. చివరకు పార్టీ నుంచి బయటకు వచ్చి జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. పైగా ఓటమిని ముందే గ్రహించి.. ఆయన మాత్రం ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆ తర్వాత కొన్నాళ్లు సైలెంట్.. 2017లో బీజేపీలోకి… టీడీపీలోకి వెళతారన్న ప్రచారం… చివరకు అదే యేడాది తిరిగి స్వగృహ్ ప్రవేశం చేస్తూ తిరిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఆయనే అవుతారన్న ప్రచారం జరిగినా అది కార్యరూపం దాల్చలేదు.
ఆ రెండు పార్టీల నుంచి….
నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డికి రాజకీయంగా యాక్టివ్ అవ్వాలన్న ఆశా ఉంది.. ఏదైనా పదవి వస్తే బాగుండు అన్న కోరిక కూడా ఉంది. కానీ ఆయన ఏం చేయలేని.. ఎటూ పోలేని పరిస్థితిలో ఉన్నారు. హైదరాబాద్‌లో ఉంటున్నా.. ఏం చేస్తున్నారో ? కూడా తెలియని పరిస్థితి. కాంగ్రెస్‌కు ఏపీలో ఫ్యూచర్ కనపడడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాజీ ముఖ్యమంత్రిగా బీజేపీలోకి వెళ్లినా.. ఏపీలో బీజేపీ జనాల నుంచి తీవ్ర వ్యతిరేకత మూటకట్టుకుంది.. కిరణ్‌కుమార్ రెడ్డి బీజేపీలోకి వెళ్లినా.. కాంగ్రెస్‌లో ఉన్నా ఏపీలో చేయడానికి ఈ రెండు పార్టీల నుంచి ఏం లేదు.
సోదరుడు మాత్రం….
ఇక నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్‌కుమార్ రెడ్డి ప్రస్తుతం టీడీపీ ముఖ్యనేత.. గత ఎన్నికల్లో ఆయన ఓడిపోయినా పార్టీలో యాక్టివ్‌గానే ఉన్నారు. పైగా వచ్చే ఎన్నికల్లో కిషోర్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా, ఆయన తనయుడు రాజంపేట ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారమూ ఉంది. దీంతో ఆ కుటుంబం నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి వెంట నడిచే పరిస్థితి లేదు. ఇక పొలిటికల్‌గా కొత్తదారులు వెతుక్కున్నా కలిసొచ్చే మార్గాలు కనపడడం లేదు. దీంతో నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి సైలెంట్‌గా ఉండడం తప్పా రాజకీయంగా యాక్టివ్ కాలేని పరిస్థితి.