Nallari : నీవల్ల ఏమి ఉపయోగం రాజా?

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపైనే కాంగ్రెస్ కొద్దో గొప్పో ఆశలు పెట్టుకుంది. సామాజికపరంగా పార్టీని కొంత బలోపేతం చేయాలంటే ఆయన వల్లనే సాధ్యమవుతుందని నమ్ముతుంది. [more]

Update: 2021-10-29 12:30 GMT

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపైనే కాంగ్రెస్ కొద్దో గొప్పో ఆశలు పెట్టుకుంది. సామాజికపరంగా పార్టీని కొంత బలోపేతం చేయాలంటే ఆయన వల్లనే సాధ్యమవుతుందని నమ్ముతుంది. కానీ రాష్ట్ర రాజకీయాల్లోకి రావడానికి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సుముఖంగా లేరు. ఆయన హైదరాబాద్ లోని ఇంటికే పరిమితమయ్యారు. సన్నిహితులతో కాలక్షేపం చేస్తూ కాలం నెట్టుకొస్తున్నారు. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే తప్ప ఆయన రాజకీయంగా యాక్టివ్ కాలేరని అంటున్నారు.

కాంగ్రెస్ లో చేరినా….

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి గా మంచి పేరే సంపాదించుకున్నారు. రాష్ట్ర విభజన సమయంలోనూ ఆయనకు అనేక మంది అభిమానులను ఏపీలో తెచ్చిపెట్టింది. అయినా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించడంతో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టుకుని పోటీ చేసి 2014లో రాజకీయంగా ఇబ్బంది పడ్డారు. అనంతరం తిరిగి ఆయన కాంగ్రెస్ లోనే చేరారు. కానీ పార్టీ యాక్టివిటీస్ కు దూరంగా ఉంటున్నారు.

అన్నింటికి దూరంగా….

ఇటీవల జరిగిన తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి కూడా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ నేతలు ప్రచారానికి ఆహ్వానించినా సున్నితంగా తిరస్కరించారు. సొంత జిల్లాలో జరుగుతున్న ఆ ఉప ఎన్నికకు దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది. తాజాగా బద్వేలు ఉప ఎన్నిక ప్రచారంలోనూ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి దూరంగా ఉన్నారు. గెలుస్తారని కాదు కాని కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం ఆయన విధి.

నల్లారి అయితేనే….

అయితే కాంగ్రెస్ అధినాయకత్వం మాత్రం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని రాష్ట్ర బాధ్యతలను పర్యవేక్షించాలని కోరినట్లు తెలిసింది. ఆయన పీసీసీ బాధ్యతలను చేపడితే రాజకీయ సమీకరణాలు కూడా మారే అవకాశాలున్నాయి. ఒకబలమైన సామాజికవర్గంలో చీలిక వచ్చి అధికార పార్టీని ఇబ్బంది పెట్టవచ్చన్నది కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచన. అయితే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ గా బాధ్యతలను తీసుకునేందుకు సిద్థంగా లేరు. అలా అని ఆయన రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనే అవకాశమూ లేదు. పార్టీకి ఈయన ఎలా ఉపయోగపడతారన్న చర్చ అయితే జోరుగా సాగుతుంది.

Tags:    

Similar News