ఇక అక్కడ కన్పించేది కష్టమేనట…కారణాలు బలంగా ఉన్నాయట
నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పత్తా లేకుండా పోయారు. పీలేరు ప్రజలకు అందుబాటులో లేకుండా ఆయన హైదరాబాద్ కే పరిమితమయ్యారు. నల్లరి కిషోర్ కుమార్ రెడ్డి కోసం [more]
నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పత్తా లేకుండా పోయారు. పీలేరు ప్రజలకు అందుబాటులో లేకుండా ఆయన హైదరాబాద్ కే పరిమితమయ్యారు. నల్లరి కిషోర్ కుమార్ రెడ్డి కోసం [more]
నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పత్తా లేకుండా పోయారు. పీలేరు ప్రజలకు అందుబాటులో లేకుండా ఆయన హైదరాబాద్ కే పరిమితమయ్యారు. నల్లరి కిషోర్ కుమార్ రెడ్డి కోసం పీలేరు తెలుగుదేశం పార్టీ క్యాడర్ వెతుకులాట ప్రారంభించింది. ఇవన్నీ సోషల్ మీడియాలో విన్పిస్తున్న సెటైర్లు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంత రాద్ధాంతం జరుగుతున్నా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాత్రం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
ఎన్నికలకు ముందు చేరి…..
2019 ఎన్నికలకు ముందు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశంపార్టీలో చేరారు. నల్లారి, పెద్దిరెడ్డి కుటుంబాలకు దీర్ఘకాల విభేధాలు ఉండటంతో ఆయన టీడీపీని ఎంచుకున్నారు. టీడీపీలో చేరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని దెబ్బతీయవచ్చన్న ఆలోచనతో ఆయన సైకిల్ పార్టీకి చేరువయ్యారు. పార్టీలో చేరిన వెంటనే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి కేబినెట్ ర్యాంకు హోదా కలిగిన నామినేటెడ్ పదవి లభించింది.
పెద్దిరెడ్డి ఓటమి లక్ష్యంగా…..
ఎన్నికలకు ముందు పీలేరు నియోజకవర్గంలో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పాదయాత్ర కూడా నిర్వహించారు. తన గెలుపు తథ్యమని భావించిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు కంటే పుంగనూరు నియోజకవర్గంపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. అక్కడ పెద్దిరెడ్డిని ఓడించడమే లక్ష్యంగా అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. చివరకు పీలేరు నియోజకవర్గంలో దారుణ ఓటమిని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి చవిచూడాల్సి వచ్చింది.
పీలేరుకు రావాలంటేనే?
పది నెలల నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పార్టీకి దూరంగా ఉంటున్నారు. చంద్రబాబు సమావేశాలకు కూడా హాజరు కావడం లేదు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనైనా ఆయన చురుగ్గా పాల్గొంటారని ఆశించిన ఆయన వర్గీయులకు నిరాశే ఎదురయింది. వాటికి కూడా నల్లారి దూరంగా ఉన్నారు. చంద్రబాబు పార్టీలో అంత ప్రాధాన్యత ఇచ్చినా అధికారం లేదన్న కారణంగా ఆయన హైదరాబాద్ కే పరిమితమయ్యారని చెబుతున్నారు. నల్లారి కంచుకోటగా ఉన్న పీలేరు నియోజకవర్గాన్ని వైసీపీ సొంతం చేసుకుంది. దీంతో ఆయన పీలేరుకు రావాలంటేనే మొహం చెల్లడం లేదన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.