మారిన చినబాబు వ్యూహం
టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తన రాజకీయ వ్యూహాన్ని మార్చుకున్నారా ? ఇన్నాళ్లు.. పప్పు అని అనిపించుకున్న ఆయనలో చైతన్యం [more]
టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తన రాజకీయ వ్యూహాన్ని మార్చుకున్నారా ? ఇన్నాళ్లు.. పప్పు అని అనిపించుకున్న ఆయనలో చైతన్యం [more]
టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తన రాజకీయ వ్యూహాన్ని మార్చుకున్నారా ? ఇన్నాళ్లు.. పప్పు అని అనిపించుకున్న ఆయనలో చైతన్యం వచ్చిందా? మంగళగిరి నుంచి గెలుపు గుర్రం ఎక్కుదా మని చేసిన ప్రయత్నం ఫలించకపోవడంతో ఒకింత కుంగుబాటుకు గురైన ఆయన.. ఇప్పుడు దాని నుంచి తేరుకుని మళ్లీ రీచార్జ్ అయ్యారా? అంటే.. తాజాగా ఆయనను గమనిస్తున్న వారు ఔననే అంటున్నారు. ఇటీవల రెండు వారాలుగా జగన్ ప్రభుత్వంపై బాగానే సెటైర్లు వేస్తున్నారు. కీలక విషయాలపై వ్యూహాత్మక వ్యాఖ్యలు సంధిస్తున్నారు. గౌరవంగా.. జగన్ గారూ.. అంటూనే చురకలు అంటిస్తున్నారు.
మంగళగిరిలోనే మకాం….
అదే సమయంలో వచ్చే 2024 ఎన్నికల్లో ఎట్టిపరిస్థితిలోనూ మంగళగిరి నుంచే పోటీ విజయం సాధిస్తానని పట్టుబట్టిన ఆయన ఇప్పుడు మంగళగిరిలోనే ఎక్కువగా ఉంటున్నారు. తరచుగా అక్కడి పార్టీ కార్యాలయానికి వెళ్లి.. ప్రజలను కలుసు కునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్ననే పట్టిసీమలో నీటిని వదిలిన సందర్భాన్ని పురస్కరించుకుని అక్కడికి వెళ్లి పసుపు-కుంకుమ వదిలి.. పూజలు చేసి వచ్చారు. దీంతో ఇక, లోకేష్ రీచార్జ్ అయ్యారనే కామెంట్లు సోషల్ మీడియాలో బలంగానే వినిపిస్తున్నాయి. వచ్చే ఐదేళ్లలో ఆయన మరింత పుంజుకుంటారని అంటున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న లోకేష్.. ప్రజల సమస్యలపై మండలిలో గళం వినిపించేందుకు కూడా రెడీ అవుతున్నట్టు సమాచారం.
అక్కడే మళ్లీ పోటీ చేసి….
ఇక ఈ ఎన్నికల్లో మంగళగిరిలో ఓడిపోవడంతో వచ్చే ఎన్నికల నాటికి లోకేష్ మంగళగిరిలో పోటీ చేస్తాడా ? లేదా అక్కడ నుంచి మూటాముల్లె సర్దేసుకుంటారా ? అన్న చర్చలు కూడా నడిచాయి. అయితే లోకేష్ మాత్రం తాను ఎక్కడ ఓడానో ? అక్కడే గెలిచి తీరతానని శపథం చేశారు. ఓడిన చోట గెలిస్తేనే అసలు మజా ఉంటుందని ? చెప్పడాన్ని బట్టి చూస్తే లోకేష్ మంగళగిరి వదిలేందుకు ప్రస్తుతానికి అయితే ఇష్టపడడం లేదని తెలుస్తోంది. అయితే ఇదే మాటపై నిలబడతారా ? లేదా పార్టీ పరిస్థితి బట్టి డెసిషన్ తీసుకుంటారా ? అన్నది చూడాలి.
ప్రసంగాలపైన కూడా….
అదే సమయంలో లోకేష్ తన ప్రసంగాలపైనా శ్రద్ధ తీసుకుంటున్నారని సమాచారం. ఆయన ఎక్కడ ఏం మాట్లాడినా.. రెండు మాటల్లో ఒకటి వివాదానికి కారణమవుతోంది. ఇది ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రభావం చూపించింది. ఈ నేపథ్యం లో ఇకపై ఎక్కడ మాట్లాడినా తప్పులు దొర్లకుండా, తప్పుడు వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా లోకే ష్ నిర్ణయించుకున్నారని అంటున్నారు. ఇక, మాస్‌ను కలుపుకొని పోవడంతోపాటు.. క్షేత్రస్థాయి సమస్యలపైనా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ప్రశ్నించి, ప్రజల మెప్పు పొందాలని చినబాబు నిర్ణయించుకున్నట్టు సమాచారం. దీంతో మొత్తంగా లోకేష్ మారిన నాయకుడిగా త్వరలోనే ప్రజల ముందుకు వస్తారని అంటున్నారు.