లోకేష్ అల్టిమేటం… వత్తిడిలో చంద్రబాబు

ఏదైనా రాజకీయాల్లో సాధ్యం. శత్రువులు మిత్రులవుతారు. మిత్రులు శత్రువులుగా మారడానికి క్షణం సమయం కూడా పట్టదు. అచ్చెన్నాయుడు విషయంలో ఇప్పుడు అదే జరుగతుంది. తిరుపతి ఉప ఎన్నిక [more]

Update: 2021-04-19 15:30 GMT

ఏదైనా రాజకీయాల్లో సాధ్యం. శత్రువులు మిత్రులవుతారు. మిత్రులు శత్రువులుగా మారడానికి క్షణం సమయం కూడా పట్టదు. అచ్చెన్నాయుడు విషయంలో ఇప్పుడు అదే జరుగతుంది. తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా లీకయిన వీడియో అచ్చెన్నాయుడుకు ఇబ్బందికరంగా మారింది. ఆ వీడియోలో నేరుగా లోకేష్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడటంతో దానిపై వివరణ ఇచ్చేందుకు కూడా లోకేష్ అంగీకరించలేదని సమాచారం.

ఎప్పటికైనా ఇబ్బందే….?

ఎప్పటికైనా అచ్చెన్నాయుడు తనకు ఇబ్బందికరంగా మారతారని లోకేష్ భావిస్తున్నారు. అసలు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేసే సమయంలోనే అచ్చెన్నాయుడు పేరును లోకేష్ వ్యతిరేకించారని వార్తలు వచ్చాయి. బీద రవిచంద్రయాదవ్ కు ఇవ్వాలని లోకేష్ చంద్రబాబు పై బాగానే వత్తిడి తెచ్చారు. కానీ ఉత్తరాంధ్రలో బలపడాలన్నా, బలమైన వాయిస్ కావాలన్నా అచ్చెన్నాయుడు కరెక్ట్ అని చంద్రబాబు నచ్చ చెప్పిన తర్వాత లోకేష్ అచ్చెన్నాయుడు విషయంలో అయిష్టంగానే అంగీకరించినట్లు చెబుతున్నారు.

కిందిస్థాయి క్యాడర్ కు….

ఇప్పటి వరకూ బాగానే ఉన్న తిరుపతి ఉప ఎన్నిక సమయంలో అచ్చెన్నాయుడు వీడియో టేపుల వ్యవహారంతో లోకేష్ రగలిపోతున్నారని చెబుతున్నారు. కిందిస్థాయి క్యాడర్ కు తప్పుడు సంకేతాలు వెళతాయని లోకేష్ అభిప్రాయపడుతున్నారు. అచ్చెన్నాయుడు కనీసం ఆ వీడియో టేపుల పై విచారణను కూడా కోరకపోవడంతో నిజమైన వీడియోనని లోకేష్ సయితం నమ్ముతున్నారు.

ఎవరిని నియమించినా?

దీంతో అచ్చెన్నాయుడు విషయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ తన తండ్రి చంద్రబాబుపై వత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. ఆయనను పదవి నుంచి తప్పించి వేరే వారికి ఇవ్వాలని సూచించినట్లు తెలిసింది. ఆయన స్థానంలో రామ్మోహన్ నాయుడుకు ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని, అచ్చెన్నాయుడు మాత్రం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండటానికి వీల్లేదని లోకేష్ చంద్రబాబుకు అల్టిమేటం ఇచ్చినట్లు సమాచారం. దీనిపై చంద్రబాబు సయితం వత్తిడికి గురవుతున్నారు. అచ్చెన్నాయుడునే స్వచ్ఛందంగా పదవికి రాజీనామా చేసే యత్నాలు చేస్తున్నారని సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News