లోకేష్ పెత్తనంపై బాబు క్లారిటీ… పార్టీ నేతల డెసిషన్ ఏంటో ?
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి లోకేష్ గడిచిన కొద్ది రోజులుగా రాజకీయంగా దూకుడుగా ఉన్నారు. వాస్తవానికి ఆయన గడిచిన ఏడాదిగా కూడా యాక్టివ్‌గా ఉన్న [more]
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి లోకేష్ గడిచిన కొద్ది రోజులుగా రాజకీయంగా దూకుడుగా ఉన్నారు. వాస్తవానికి ఆయన గడిచిన ఏడాదిగా కూడా యాక్టివ్‌గా ఉన్న [more]
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి లోకేష్ గడిచిన కొద్ది రోజులుగా రాజకీయంగా దూకుడుగా ఉన్నారు. వాస్తవానికి ఆయన గడిచిన ఏడాదిగా కూడా యాక్టివ్‌గా ఉన్న విషయం తెలిసిందే. అయితే.. అప్పట్లో లేని కొత్త ఉత్సాహం ఏదో ఇప్పుడు లోకేష్‌లో తొణికిసలాడుతోందని అంటున్నారు పరిశీలకులు. ఇదే విషయం ఇప్పుడు టీడీపీ సీనియర్ల మధ్య కూడా చర్చనీయాంశంగా మారింది. తిరుపతిలో ఎంత జోరుతో దూకుడు చూపించారో.. ఇప్పుడు కూడా లోకేష్ ఇదే జోరుగా కొనసాగిస్తున్నారని అంటున్నా..'అంతకు మించి' అనే మాట వినిపిస్తోంది.
వర్చువల్ విధానంలో…..
ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక ప్రచారం తర్వాత.. ఏపీ నుంచి వెళ్లిన చంద్రబాబు హైదరాబాద్‌కే పరిమితయ్యారు. కానీ, లోకేష్ మాత్రం బాబు పుట్టిన రోజుకు హైదరాబాద్‌కు వెళ్లినా.. వెంటనే ఏపీకి వచ్చేశారు. అనంతరం.. విద్యార్థుల పరీక్షలను లక్ష్యంగా చేసుకుని.. జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అదేసమయంలో వర్చువల్‌గా విద్యా ర్థుల తల్లిదండ్రులతో (అంటే పబ్లిక్‌తో తొలిసారి) లోకేష్ భేటీ అయ్యారు. వారి నుంచి సలహాలు తీసుకున్నారు. ప్రభుత్వంపై మరిన్ని విమర్శలు గుప్పించారు.
పగ్గాలు ఇచ్చినట్లే….?
ఈ పరిణామాలను గమనిస్తే.. దాదాపు అనధికారికంగా చంద్రబాబు.. లోకేష్‌కు పగ్గాలు అప్పగించారని అంటున్నారు పరిశీలకులు. గతంలో ఎప్పుడూ.. పబ్లిక్‌తో వర్చువల్ సమావేశాలు నిర్వహించిన అనుభవం లోకేష్‌కు లేదు. అదే సమయంలో చంద్రబాబు ఎక్కడా ప్రభుత్వంపై విమర్శలు చేయడం లేదు. అంతా లోకేష్‌దే పెత్తనం అన్నట్టుగా మారిపోయింది. ఈ పరిస్థితి.. గడిచిన రెండు రోజులుగా మరింత ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో.. చంద్రబాబు.. దాదాపు అనధికారికంగా.. లోకేష్‌కు పగ్గాలు ఇచ్చేశారనే వాదన సీనియర్ల మధ్య వస్తోంది.
లోకేష్ పై గుర్రుగా ఉన్నోళ్లు…..
కనీసం చంద్రబాబు ఒక్క మాటకూడా నోరెత్తకుండా.. ఇటు సర్కారుపై విమర్శలు చేయడం.. వారు కూడా గతానికంటే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ.. లోకేష్‌కు కౌంటర్లు ఇవ్వడం వంటివి వైసీపీలో కంటే కూడా టీడీపీలోనే ఎక్కువగా ఆసక్తిగా మారడం గమనార్హం. మరి ఇప్పటి వరకు లోకేష్‌పై అంతర్గతంగా గుస్సాగా ఉన్న వారంతా.. ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. చంద్రబాబు ఇకపై పెత్తనం అంతా లోకేష్‌దే చెప్పకనే చెప్పినప్పుడు.. వీరి భవిష్యత్ నిర్ణయాలు ఎలా? ఉంటాయో ? చూడాలి.