ముందు అది చూసుకో చినబాబూ… ?
దేశానికి ప్రధాని అయినా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ముందు ఏదో చోట నుంచి పోటీ చేసి గెలవాలి. తన గెలుపు ఖాయమనుకున్నపుడే మిగిలిన ప్రాంతమంతా తిరిగి ప్రచారం [more]
దేశానికి ప్రధాని అయినా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ముందు ఏదో చోట నుంచి పోటీ చేసి గెలవాలి. తన గెలుపు ఖాయమనుకున్నపుడే మిగిలిన ప్రాంతమంతా తిరిగి ప్రచారం [more]
దేశానికి ప్రధాని అయినా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ముందు ఏదో చోట నుంచి పోటీ చేసి గెలవాలి. తన గెలుపు ఖాయమనుకున్నపుడే మిగిలిన ప్రాంతమంతా తిరిగి ప్రచారం చేయగలరు. ఆ విధంగా చూస్తే ముఖ్యమంత్రి జగన్ కి పులివెందుల వంటి స్ట్రాంగ్ కోట ఉంది. ఇక చంద్రబాబుకు కుప్పం అన్న సేఫేస్ట్ ప్లేస్ ఉంది. మరి భావి వారసుడు లోకేష్ కి అలాంటి నియోజకవర్గం ఏపీలో ఎక్కడ ఉంది అన్నదే ప్రశ్న. లోకేష్ అయితే తన తండ్రి చంద్రబాబు అపర విశ్వామిత్ర సృష్టి అయిన జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని చూసుకుని తనను తాను దేశ్ కీ నేత అన్న ఫీలింగులో ఉన్నారని టాక్.
మంగళమేనా ..?
లోకేష్ పొలిటికల్ ఎంట్రీయే రాంగ్ రూట్ లో స్టార్ట్ అయింది. ఆయన డైరెక్ట్ గా ఎమ్మెల్యే గా కాకుండా ఎమ్మెల్సీ అయి మంత్రి అయిపోయారు. ఆ తరువాత ఆయన మంగళగిరి నుంచి పోటీ చేస్తే 2019 ఎన్నికల వేళ దారుణంగా ఓటమి పాలు అయ్యారు. ఆ మీదట నుంచి చినబాబు ఆ వైపునకు కనీసం కన్నెత్తి చూడలేదు. తాను ఎక్కడ పోటీ చేసినా గెలిచి తీరుతాను అన్న ధీమా కావచ్చు. మరోటి కావచ్చు మొత్తానికి లోకేష్ రెండేళ్ళుగా మంగళగరి ముఖం చూడలేదు సరికదా మంగళం పాడేసారు అన్న ప్రచారం అయితే ఉంది.
బాబుదే బాధ్యత ….?
చేసుకున్న వారికి చేసుకున్నంత అని అంటారు. ఇపుడు లోకేష్ ని వారసుడిగా చేయాలన్న బాధ అంతా చంద్రబాబుదే అవుతోంది. అదే లోకేష్ లోనూ ధీమా పెంచుతోంది. అందుకే బే ఫికర్ గా ఆయన బాబు అంతటి నాయకుడిని అని పార్టీ నేతల మీద పెత్తనం చేస్తూ తనదైన కలలతో కాబోయే సీఎంగా భావించుకుంటున్నాడు అంటున్నారు. మరి ముఖ్యమంత్రి కావాలంటే ఎమ్మెల్యేగా గెలిచి తీరాలి కదా. కానీ చినబాబు మాత్రం తనకంటూ ఒక నియోజకవర్గాన్ని మాత్రం ఇప్పటిదాకా కనిపెట్టలేకపోతున్నారు. ఆ బాధ్యత అంతా చంద్రబాబుదే అన్నట్లుగా నిబ్బరంగా ఉన్నారు.
అదే ధైర్యమా…?
మరో మూడేళ్ళలో సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. ఈసారి కూడా కుప్పం నుంచే చంద్రబాబు పోటీ చేస్తారు. అందులో రెండవ మాట లేదు. మరి చినబాబు సీటు ఏంటి అంటే అప్పటికపుడు ఎంచుకోవడమేనట. ఒకవేళ అది కాదూ అనుకుంటే 2025 వరకూ ఎమ్మెల్సీ పదవి ఉంది కాబట్టి ఆయన పోటీ చేయకపోవచ్చు అన్న మాట కూడా వినిపిస్తోంది. అంటే తాను రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేసి ఒకవేళ పార్టీ గెలిస్తే అపుడు చూసుకోవచ్చు అన్న ఆలోచనలో లోకేష్ ఉన్నారు అని కూడా అంటున్నారు. ఏది ఏమైనా ఏ ముహూర్తాన ఎమ్మెల్సీ అయ్యారో కానీ చినబాబుకు చివరికి అదే ఖాయంగా అయ్యేట్లుంది అన్న కౌంటర్లు మాత్రం ప్రత్యర్ధి పార్టీల నుంచి పడిపోతున్నాయి. అదే సమయంలో నియోజకవర్గమే లేని నేతగా కూడా లోకేష్ కనిపిస్తున్నారు అంటున్నారు. ఈసారి కుప్పంలోనూ చంద్రబాబు గెలుపుకే డౌట్ పుట్టించేలా వైసీపీ ప్లాన్ సాగుతోంది అంటే చినబాబుకు ఏ సీటు గెలుపు ఠికానా ఇస్తుందన్నది ఆలోచించాల్సిందేగా.