లోకేష్ కంటే ముందు.. వీరికి ప్రమోష‌నా..? టీడీపీలో వెయిటింగ్ లిస్ట్

టీడీపీలో ఆస‌క్తికర విష‌యం చ‌ర్చకు వ‌చ్చింది. ప్రస్తుత ప‌రిస్థితిలో పార్టీ ఎక్కువ‌గా జాతీయ ప్రధాన కార్యద‌ర్శి హోదాలో ఉన్న చంద్రబాబు త‌న‌యుడు.. మాజీ మంత్రి నారా లోకేష్‌ను [more]

Update: 2020-07-12 13:30 GMT

టీడీపీలో ఆస‌క్తికర విష‌యం చ‌ర్చకు వ‌చ్చింది. ప్రస్తుత ప‌రిస్థితిలో పార్టీ ఎక్కువ‌గా జాతీయ ప్రధాన కార్యద‌ర్శి హోదాలో ఉన్న చంద్రబాబు త‌న‌యుడు.. మాజీ మంత్రి నారా లోకేష్‌ను ఎక్కువ‌గా ప్రమోట్ చేస్తున్నారు. ఏ కార్యక్రమం జ‌రిగినా.. ఎక్కడ పార్టీకి ఇబ్బంది వ‌చ్చినా.. ఇటీవల కాలంలో లోకేష్ వాలిపోతున్నారు. అధికార పార్టీపై విమ‌ర్శలు సంధిస్తున్నారు. స‌వాళ్లు కూడా రువ్వుతున్నారు. అదే స‌మ‌యంలో శాస‌న మండ‌లిలోనూ పార్టీ త‌ర‌ఫున రెచ్చిపోతున్నారు. దీంతో వ్యక్తిగ‌తంగా లోకేష్‌కు మంచి మార్కులే ప‌డుతున్నాయి. ఇది అవ‌స‌రం అని కూడా సీనియ‌ర్లు అంటున్నారు. అయితే, అదే స‌మ‌యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒక వేళ సీఎం అభ్యర్థిగా ప్రక‌టించాల‌న్నా.. లేదా… పార్టీ అధ్యక్ష ప‌గ్గాలు అప్పగించాల‌ని భావిస్తే.. కేవలం లోకేష్ మాత్రమే చంద్రబాబు ప్రొజెక్టు చేస్తే చాల‌ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇదే విష‌యాన్ని పార్టీ సీనియ‌ర్లు కూడా చెబుతున్నారు.

ఎన్ని మెరుగులు అద్దినా…..

ఏదైనా గ్రౌండ్ లెవిల్లో పార్టీని, యువ నాయ‌కుల‌ను ప‌టిష్టం చేసుకోక‌పోతే.. పైపైన ఎన్ని మెరుగులు అద్దినా ప్రయోజ‌నం లేద‌నేది వీరి టాక్‌. అంటే.. లోకేష్ హ‌యాం మ‌రో నాలుగేళ్లలో ప్రారంభ మ‌వుతుంద‌ని పార్టీ అధినేత‌గా చంద్రబాబు భావిస్తున్నా.. ఇప్పటి నుంచి దాదాపు ఎక్కువ‌గా జిల్లాల బాధ్యత‌లు అప్పగించినా.. కూడా క్షేత్రస్థాయిలో పార్టీ పుంజుకోక పోతే..ప్రయోజ‌నం ఏంట‌నేది వీరి అభిప్రాయం. ఈ నేపథ్యంలో పార్టీలో ఎద‌గాలని భావిస్తున్న యువ‌నేత‌ల‌ను , వార‌సుల‌ను కూడా ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, వారికి బూస్టింగ్ ఇవ్వాల‌ని వాద‌న‌లు వ‌స్తున్నాయి. ప్రతి జిల్లాలోనూ యువ నాయ‌కులు అధినేత చంద్రబాబు ఆశీస్సుల కోసంఎదురు చూస్తున్నారు.

యువనేతల పడిగాపులు…

శ్రీకాకుళం నుంచి అనంత‌పురం వ‌ర‌కు ఈ త‌ర‌హా నాయ‌క‌త్వం ప‌డిగాపులు కాస్తోంది. ఉత్తరాంధ్రలో పెందుర్తిలో మాజీ మంత్రులు బండారు స‌త్యనారాయ‌ణ మూర్తి, అయ్యన్న పాత్రుడి త‌న‌యులు, తూర్పు గోదావ‌రిలో మ‌రో మాజీ మంత్రి య‌న‌మ‌ల కుమార్తె లైన్లో ఉన్నారు. ఇక గుంటూరులో రాయ‌పాటి సాంబ‌శివ‌రావు కుమారుడు రాయ‌పాటి రంగారావు స‌హా జిల్లాలో యువ నేత‌లుఎదురు చూస్తున్నారు. ప్రకాశం జిల్లాలో దామ‌చ‌ర్ల స‌త్య రేసులో ఉన్నాడు. అదేవిధంగా కృష్ణాజిల్లాలో మాజీడిప్యూటీ స్పీక‌ర్ మండ‌లి బుద్ధ ప్రసాద్ త‌న త‌న‌యుడిని రంగంలోకి దింపాల‌ని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఆయ‌న కూడా గ్రీన్ సిగ్నల్ కోరుతున్నారు.

వారికి పగ్గాలు అప్పగిస్తేనే?

అదేవిధంగా ప‌శ్చిమ గోదావ‌రిజిల్లాలో కీల‌క నాయ‌కుడు మాగంటిబాబు కుమారుడు జిల్లా తెలుగు యువ‌త అధ్యక్షుడు రాంజీ రాష్ట్ర తెలుగు యువ‌త ప‌దవిని ఆశిస్తున్నారు. ఇలా ప్రతి జిల్లాలోనూ యువ నేత‌లు చంద్రబాబు నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. కానీ, ఎప్పటిక‌ప్పుడు చంద్రబాబు త‌న నిర్ణయాన్ని వాయిదా వేయ‌డంతో వారంతా అసంతృప్తి జ్వాల‌లు వ్యక్తం చేస్తున్నారు. త‌న కుమారుడు లోకేష్ ప్రమోట్ కావాలంటే.. వీరంతా కూడా ప‌టిష్టమైన సైన్యంగా ఉండాల‌నుకునే సీనియ‌ర్లు కూడా గ‌త నెల‌లో జ‌రిగిన మ‌హానాడులో ఈ ప్రతిపాద‌న‌ను తెర‌మీద‌కి తెచ్చారు. యువ‌త‌కు ప‌గ్గాలు అప్పగించాల్సిందేన‌ని అన్నారు. కానీ, చంద్రబాబు ఇంకా మీన‌మేషాలు లెక్కిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News