లోకేష్‌తో పార్టీ సర్వనాశనం: ఓ టీడీపీ ఎమ్మెల్యే యథార్థ ఆవేదన
టీడీపీకి కాబోయే రారాజు.. చంద్రబాబు తర్వాత చంద్రబాబు వంటి నాయకుడుగా ప్రచారంలో ఉన్న నాయకుడు బాబు తనయుడు నారా లోకేష్. అయితే, ఆయన వ్యవహార శైలిలో తమ్ముళ్లు [more]
టీడీపీకి కాబోయే రారాజు.. చంద్రబాబు తర్వాత చంద్రబాబు వంటి నాయకుడుగా ప్రచారంలో ఉన్న నాయకుడు బాబు తనయుడు నారా లోకేష్. అయితే, ఆయన వ్యవహార శైలిలో తమ్ముళ్లు [more]
టీడీపీకి కాబోయే రారాజు.. చంద్రబాబు తర్వాత చంద్రబాబు వంటి నాయకుడుగా ప్రచారంలో ఉన్న నాయకుడు బాబు తనయుడు నారా లోకేష్. అయితే, ఆయన వ్యవహార శైలిలో తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తు మాటేమో.. కానీ, ఇప్పుడే లోకేష్‌పై తమకు నమ్మకాలు పోతున్నాయని వారు ఆందోళన చెందుతున్నారు. పార్టీలో యాక్టివ్‌గా ఉండాల్సిన లోకేష్.. ఎవరినీ పట్టించుకోవడం లేదని, ఎవరితోనూ కలివిడిగా ఉండడం లేదని, ఎవరినీ లెక్కచేయడం లేదని.. ఇలా అయితే.. తమ పరిస్థితి ఏంటని? వారు ప్రశ్నిస్తున్నారు. తాజాగా జరిగిన ఓ ఉదంతాన్ని వారు వివరిస్తూ.. లోకేష్ వల్ల పార్టీ నాశనమే తప్ప బాగుపడేది లేదని చెబుతున్నారు.
హైదరాబాద్ లో బెడ్ కోసం…..
విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తన మన అనే తేడాలేకుండా.. బీదా బిక్కీ అనే తారతమ్యం లేకుండా అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నుంచి గెలిచిన ఓ ఎమ్మెల్యే తమ్ముడికి కరోనా సోకింది. ఇంకేముంది.. రాష్ట్రంలో ఆసుపత్రులను నమ్ముకుంటే.. కొంప కొల్లేరేనని భావించి హైదరాబాద్‌కు పరిగెట్టారు. అయితే, ఎంత ఎమ్మెల్యే అయినప్పటికీ.. ప్రస్తుత సమయంలో ఆసుపత్రిలో బెడ్ దొరుకుతుందో లేదోనని భావించి.. లోకేష్ బాబు ఎలాగూ అక్కడే ఉన్నారు కాబట్టి ఆయనతో సిఫారసు చేయించుకుందామని అనుకున్నారు. ఈ క్రమంలో ఓ ఎమ్మెల్సీ .. లోకేష్‌కు ఫోన్ చేశారు.
లోకేష్ కు ఫోన్ చేసినా…..
అయితే, లోకేష్ కనీసం ఫోన్ కూడా లిప్ట్ చేయకుండానే .. తాను మీటింగ్‌లో ఉన్నానని మెసేజ్ పెట్టారు. మళ్లీ అరగంట తర్వాత ఫోన్ చేసినా.. అదే సందేశం వచ్చింది. దీంతో నేరుగా చంద్రబాబుకే ఫోన్ కొట్టారు. దీంతో బాబు పీఏ లైన్‌లోకి వచ్చి.. విషయం తెలుసుకుని బెడ్ ఏర్పాటు చేయించారు. ఇక, మీటింగ్ ముగిసిన తర్వాత సదరు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు చంద్రబాబు ఫోన్ చేయడంతోపాటు మరోసారి నేరుగా ఆయనే ఆసుపత్రికి ఫోన్ చేసి విషయం తెలుసుకుని ఓదార్చారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తనకు ఫోన్ చేయమని సదరు ఎమ్మెల్యేకు సూచించారు. కానీ, రెండు సార్లు తనకు ఫోన్ వచ్చినా.. లోకేష్ మాత్రం మాటమాత్రంగా కూడా ఫోన్ చేయలేదు.
ఇలా అయితే ఎలా?
దీంతో సదరు ఎమ్మెల్యే తీవ్ర నిరాశకు గురై.. చంద్రబాబు ఉన్నారు కాబట్టి మమ్మల్ని పట్టించుకున్నారు. ఆయన తర్వాత లోకేష్ వస్తే.. ఇలాగే ఉంటుంది పరిస్థితి. పార్టీ ఇక, గంగపాలే అని నొచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ విషయం పార్టీ నేతల మధ్య తీవ్రస్థాయిలో చర్చకు వస్తోంది. ఇప్పటికే నాయకుడు కాలేడని ముద్రవేసుకున్న లోకేష్.. పార్టీలోనూ దూకుడు చూపించకపోతే.. ఎలా? అని తమ్ముళ్లే చిర్రుబుర్రులాడుతుండడం గమనార్హం.