లోకేష్-గల్లాల స్కెచ్.. గుంటూరు టీడీపీలో అదిరిపోయిన ట్విస్ట్
టీడీపీలో తాజాగా జరిగిన పార్లమెంటరీ నియోజకవర్గాల ఇంచార్జ్ కూర్పులో తెరవెనుక అనేక ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయని అంటున్నారు పరిశీలకులు. కొన్ని చోట్ల నేతల ఎంపిక విషయంలో [more]
టీడీపీలో తాజాగా జరిగిన పార్లమెంటరీ నియోజకవర్గాల ఇంచార్జ్ కూర్పులో తెరవెనుక అనేక ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయని అంటున్నారు పరిశీలకులు. కొన్ని చోట్ల నేతల ఎంపిక విషయంలో [more]
టీడీపీలో తాజాగా జరిగిన పార్లమెంటరీ నియోజకవర్గాల ఇంచార్జ్ కూర్పులో తెరవెనుక అనేక ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయని అంటున్నారు పరిశీలకులు. కొన్ని చోట్ల నేతల ఎంపిక విషయంలో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అడుగులు వేశారని చర్చించుకుంటున్నారు. ఇలాంటి వాటిలో గుంటూరు పార్లమెంటరీ జిల్లా ఒకటిగా ప్రచారంలో ఉంది. గుంటూరు జిల్లాను తీసుకుంటే.. మూడు పార్లమెంటరీ జిల్లాలు ఉన్నాయి. బాపట్ల, నరసారావు పేట, గుంటూరు ఉన్నాయి.
కమ్మ సామాజికవర్గానికి చెందిన…..
బాపట్ల నియోజకవర్గం ఇంచార్జ్‌గా ప్రకాశం జిల్లా పరుచూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఏలూరి సాంబశివ రావుకు అవకాశం ఇచ్చారు. ఈయన కమ్మ సామాజిక వర్గం నాయకుడు. పైగా యువ నేత.. దూకుడు ఎక్కువ. పార్టీకి అన్నివిధాలా ఉపయోగపడే నాయకుడిగా ముద్ర వేసుకున్నారు. సో.. ఆయనకు తిరుగులేదు. ఇక, నరసారావుపేట నియోజకవర్గం బాధ్యతను వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుకు అప్పగించారు. ఈయన కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతే. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా సమర్థవంతంగా పని చేయడంతో బాబు ఆయన్ను నరసారావుపేట పార్లమెంటరీ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కంటిన్యూ చేశారు.
అందుకే శ్రావణ్ కుమార్ కు……
అయితే, ఎటొచ్చీ.. గుంటూరు పార్లమెంటరీ జిల్లా ఇంచార్జ్‌గా ఎస్సీ వర్గానికి చెందిన తెనాలి శ్రావణ్‌కుమార్ కు ఇవ్వడం వెనుక మాత్రమే తెరవెనుక ఏదో జరిగిందన్న గుసగుసలు సొంత పార్టీ నేతల్లోనే వినిపిస్తున్నాయి. తెనాలి శ్రవణ్‌కుమార్ తాడికొండ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి 2009లో ఓడి, 2014లో గెలిచి గత ఎన్నికల్లో ఓడిపోయారు. వాస్తవానికి ఈ కీలక పదవి కోసం మాజీ మంత్రులు ఆలపాటి రాజా.. మాకినేని పెదరత్తయ్య పోటీ పడ్డారు. వీరిద్దరూ కమ్మ వర్గానికి చెందిన నాయకులే. బాబు ఈ ఇద్దరిలో ఎవరికి పదవి ఇచ్చినా జిల్లాలో మూడు పార్లమెంటరీ జిల్లా పదవులు కమ్మ నేతల చేతుల్లోనే ఉండేవి.
మంగళగిరికి ఇబ్బంది అవుతుందని….
అయితే ఇక్కడ ఈ ఈక్వేషన్ మాత్రమే కాకుండా మరో షాకింగ్ స్కెచ్‌తో ఈ పదవి శ్రవణ్‌కు దక్కినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. మాకినేని, ఆలపాటిలో ఎవరికి ఈ బాధ్యతలు అప్పగించినా వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి మళ్లీ తన అదృష్టం పరిశీలించుకోవాలని భావిస్తున్న నారా లోకేష్‌కు ఈ కూర్పు ఇబ్బందవుతుందని భావించారట. మాకినేని, రాజా ఇద్దరు కూడా సీనియర్లు కావడంతో ఇద్దరూ తమ మాటే నెగ్గాలని కొరుకుంటారని.. ఇది మళ్లీ గ్రూపు రాజకీయాలకు ఆద్యం పోసినట్లవుతుందని భావించి లోకేష్, ప్రస్తుతం ఎంపీ గల్లా జయదేవ్ వ్యూహాత్మకంగా ఇక్కడ తెనాలి శ్రావణ్ కుమార్ కి అవకాశం ఇచ్చారని అంటున్నారు. తెనాలి శ్రావణ్ కుమార్ తాము చెప్పినట్టు వింటాడని… తమకు ఇబ్బంది లేదన్నదే ఈ ఇద్దరు నేతల ప్లాన్‌గా తెలుస్తోంది. తెనాలికి ఈ పదవి ఇవ్వడంతో అటు ఎస్సీలకు పదవి ఇచ్చామన్న ఈక్వేషన్ సెట్ చేయడంతో పాటు ఎలాంటివివాదాలకు అవకాశం లేకుండా ఉంటుందని భావించారట. ఈ ఎఫెక్ట్‌తో ఇద్దరు మాజీ మంత్రులు కూడా సైలెంట్ అయ్యారని అంటున్నారు.