Narayana : నారాయణ కోసం వారంతా ఎదురు చూపులు
నెల్లూరు కార్పొరేషన్ కు ఎన్నికలు జరగనున్నాయి. టీడీపీ ఇక్కడ బరిలోకి దిగనుంది. అభ్యర్థుల ఎంపికను కూడా మొదలు పెట్టింది. మరి కీలకమైన నేత నారాయణ ఏమయ్యారన్నది ప్రశ్నగా [more]
నెల్లూరు కార్పొరేషన్ కు ఎన్నికలు జరగనున్నాయి. టీడీపీ ఇక్కడ బరిలోకి దిగనుంది. అభ్యర్థుల ఎంపికను కూడా మొదలు పెట్టింది. మరి కీలకమైన నేత నారాయణ ఏమయ్యారన్నది ప్రశ్నగా [more]
నెల్లూరు కార్పొరేషన్ కు ఎన్నికలు జరగనున్నాయి. టీడీపీ ఇక్కడ బరిలోకి దిగనుంది. అభ్యర్థుల ఎంపికను కూడా మొదలు పెట్టింది. మరి కీలకమైన నేత నారాయణ ఏమయ్యారన్నది ప్రశ్నగా మారింది. నెల్లూరు అంటేనే టీడీపీలో సోమిరెడ్డి తర్వాత నారాయణ గుర్తుకు వస్తారు. ఆయన 2014 నుంచి చంద్రబాబు మంత్రివర్గంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో చేసిన అభివృద్ధిని నారాయణ నెల్లూరు ప్రజలకు గుర్తుకు తెస్తారా? లేదా? అన్నది చర్చగా మారింది.
ఎన్నికలు జరగనుండటంతో….
నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కు ఈ నెల 15వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 54 డివిజన్లకు ఎన్నికలు జరగనున్నాయి. 2014లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. అప్పుడు కూడా టీడీపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. విపక్షంలో ఉన్నా వైసీపీకి 31 స్థానాలను గెలుచుకుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత నారాయణను ఎమ్మెల్సీ చేసి చంద్రబాబు మంత్రిని చేశారు. అయితే నెల్లూరు నగరంపై ప్రేమతో నారాయణ అక్కడ ఎక్కువ నిధులను తెచ్చి అభివృద్ధి పనులు చేపట్టారు.
అభివృద్ధి చేయడంతో….
ఆ ధైర్యంతోనే నారాయణ 2019 శాసనసభ ఎన్నికల్లో నెల్లూరు పట్టణ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. తాను పట్టణంలో చేసిన అభివృద్ధి గెలిపిస్తుందనుకున్నారు. బాగానే చేతి చమురు కూడా వదిలించుకున్నారు. చివరకు నారాయణ వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ చేతిలో ఓటమి పాలు కావాల్సి వచ్చింది. నారాయణ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని ఓటమి పాలు కావడంతో తీవ్ర నిరాశ చెందారు. అప్పటి నుంచి నారాయణ తన వ్యాపారాలకే పరిమితమయ్యారు.
వస్తారా? రారా?
నారాయణ 2019 ఎన్నికల ఫలితాల తర్వాత దూరంగా ఉంటున్నారు. ఆయనపై అమరాతి భూముల కేసు కూడా నమోదయింది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో తన వర్గం వారికి నారాయణ టిక్కెట్లు ఇప్పించుకోవాల్సి ఉంది. ఇప్పటికే ప్రచారానికి రావాలని నారాయణను కొందరు నేతలు కోరారు. అయితే నారాయణ ఎన్నికల ప్రచారానికి వస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.