నారాయ‌ణకు ద‌డ‌..ద‌డ‌.. రీజ‌నేంటి..!

ఆయ‌న విద్యాధికుడు. గ‌త చంద్రబాబు ప్రభుత్వంలో కీల‌క‌మైన రాజ‌ధాని నిర్మాణాన్ని త‌న భుజాల‌పై మోసి న అత్యంత విన‌య సంప‌న్నుడు. ఈ విష‌యంలో చంద్రబాబుకు రైట్ హ్యాండ్ [more]

Update: 2019-08-29 13:30 GMT

ఆయ‌న విద్యాధికుడు. గ‌త చంద్రబాబు ప్రభుత్వంలో కీల‌క‌మైన రాజ‌ధాని నిర్మాణాన్ని త‌న భుజాల‌పై మోసి న అత్యంత విన‌య సంప‌న్నుడు. ఈ విష‌యంలో చంద్రబాబుకు రైట్ హ్యాండ్ కూడా. అంతేకాదు, వివాదర‌హితుడిగా పేరు తెచ్చుకున్నారు. సంయ‌మ‌నం పాటించే మంత్రిగా, ఆచితూచి మాట్లాడేనేర్పరిగా కూడా పేరు తెచ్చుకున్నారు. అలాంటి నాయ‌కుడు 2014కు ముందుకు చంద్రబాబు నిర్వహించిన వ‌స్తున్నా మీకోసం పాద‌యాత్రకు నిధులు స‌మ‌కూర్చారు. ఆ త‌ర్వాత 2014లో బాబు ప్రభుత్వం ఏర్పడగానే.. వెను వెంట‌నే ఆయ‌న‌ను మంత్రి వ‌ర్గంలోకి తీసుకున్న త‌ర్వాతే.. నారాయ‌ణ రాజ‌కీయంగా అంద‌రికీ ప‌రిచ‌య‌మ‌య్యారు.

మంచి ప్రయారిటీ ఇచ్చి…..

వాస్తవానికి అప్పటి వ‌ర‌కు కూడా ఆయ‌న‌ను నారాయ‌ణ విద్యాసంస్థల అధినేత‌గానే అంద‌రూ చూశారు. త‌న‌కు ఎంతో శ‌క్తినిచ్చిన నారాయ‌ణ‌ను చంద్రబాబు త‌న కేబినెట్‌లోకి తీసుకుని, త‌ర్వాత ఎమ్మెల్సీని చేశారు. ఇక‌, ఆ త‌ర్వాత రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో నారాయ‌ణ‌కు కీల‌క బాధ్యత‌లు అప్పగించారు. అనేక దేశాలు తిరిగి, అక్కడి రాజ‌ధానుల‌ను ప‌రిశీలించి, వాటి ప్రకారం అమ‌రావ‌తిని మ‌రింత ప‌టిష్టంగా తీర్చిదిద్దాల‌ని నారాయ‌ణ చేసిన ప్రయ‌త్నాన్ని చంద్రబాబు ప్రోత్సహించారు. క‌ట్ చేస్తే.. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో అసెంబ్లీ కి పోటీ చేసిన ఆయ‌న నెల్లూరు సిటీ నుంచి టీడీపీ టికెట్ సంపాయించుకున్నారు. ఎన్నిక‌ల‌కు క‌నీసం 6 మాసాల ముందుగానే ఇక్కడ నిధులు కుమ్మరించి అభివృద్ధి చేప‌ట్టారు.

ఇంత రచ్చ జరుగుతున్నా…..

ఇక‌, ఎన్నిక‌ల నాటికి త‌న కుటుంబం మొత్తాన్నీ రంగంలోకి దింపేశారు. అయినా కూడా వైసీపీ హ‌వా ముందు నారాయ‌ణ నిల‌వ‌లేక పోయారు. 1200 ఓట్ల తేడాతో ఓట‌మిపాల‌య్యారు. అయితే, త‌న ఓట‌మికి సొంత పార్టీ స్థానిక నాయ‌కులే కార‌ణ‌మ‌ని ఆరోపించిన నారాయ‌ణ ఆతర్వాత మాత్రం పార్టీలోను, ఇటు మీడియా ముందుకు కూడా రావ‌డంలేదు. నియోజ‌క‌వ‌ర్గంలోనూ క‌నిపించడం లేదు. వాస్తవానికి గ‌డిచిన వారం రోజులుగా రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో పెద్ద ఎత్తున రాజ‌కీయ ర‌గ‌డ సాగుతోంది. ఇక్కడ భూములను క‌మ్మ సామాజిక వర్గం వారే కొనుగోలు చేశార‌ని, చంద్రబాబు త‌న సామాజిక వ‌ర్గానికి మేలు చేసేందుకు య‌త్నిస్తున్నార‌ని అధికార ప‌క్షం విమ‌ర్శిస్తోంది.

తెరమీదకు రాకుండా….

అదే స‌మ‌యంలో రాజ‌ధాని ముంపు ప్రభావిత ప్రాంత‌మ‌ని, ఇక్కడ క‌డితే మునిగిపోతుంద‌ని కూడా ఆరోపిస్తున్నారు. మ‌రి ఈ స‌మ‌యంలో రాజ‌ధానిపై అన్నీ తెలిసిన‌, ద‌గ్గరుండి అన్నీ చూసిన మాజీ మంత్రి నారాయ‌ణ క‌నీసం ప‌న్నెత్తు మాట కూడా మాట్లాడ‌డం లేదు. పార్టీ త‌ర‌ఫున కానీ, వ్యక్తిగ‌తంగా కానీ ఆయ‌న ఏ ఒక్క ప్రక‌ట‌న కూడా చేయ‌లేదు. ఇది వాస్తవం.. లేదా ఇది వాస్తవం కాదు.. అని ఆయ‌న చెబితే.. దానికి చాలా బలం ఉంటుంది. గ‌తంలో సీఆర్ డీఏ ఉపాధ్యక్షుడు కూడా అయిన ఆయ‌న మాట‌ల‌కు చాలా ఇంపార్టెన్స్ ఉంది. కానీ, నారాయ‌ణ మాత్రం తెర‌మీదికి రాలేదు.

అందుకే దూరంగా ఉన్నారా?

దీనికి కార‌ణంపై విశ్లేష‌కులు దృష్టి పెట్టారు. ఇప్పటికే టీడీపీకి చెందిన నాయ‌కుల‌పై జ‌గ‌న్ ప్రభుత్వం అనేక కేసులు పెడుతోంది. కార‌ణాలు ఏవైనా కేసులు కామ‌న్ అనే రీతిలో ముందుకు వెళ్తోంది. ఈ నేప‌థ్యంలో త‌న విద్యా సంస్థల్లో నిత్యం జ‌రిగే అవ‌కత‌వ‌క‌లు కానీ.. రాజ‌ధానిలో చోటు చేసుకున్న లోటు పాట్లు కానీ త‌న మెడ‌కు చుట్టుకోవ‌డం ఖాయ‌మ‌ని… కేసులు న‌మోద‌య్యాక కొత్త చిక్కులు ఏర్ప‌డ‌డం కూడా ఖాయ‌మేన‌ని భావిస్తున్నందునే ఆయ‌న మౌనం వ‌హిస్తున్నార‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో ?చూడాలి.

Tags:    

Similar News