Bjp : ఆ రెండు…. ఈ ఇద్దరినీ…?

ఈసారి అనుకున్నంత ఈజీ కాదు. ముఖ్యమైన రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలకు అవసరం. భవిష్యత్ రాజకీయమంతా ఈ [more]

Update: 2021-09-27 16:30 GMT

ఈసారి అనుకున్నంత ఈజీ కాదు. ముఖ్యమైన రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలకు అవసరం. భవిష్యత్ రాజకీయమంతా ఈ ఎన్నికల ఫలితాలపైనే ఆధారపడి ఉంటుంది. ఈ ఎన్నికల్లో గెలుపు దక్కక పోతే పార్టీలోనే వారిపై అసమ్మతి రాజుకునే అవకాశముంది. ఇప్పటి వరకూ మద్దతిస్తూ వచ్చిన సంఘ్ పరివార్ కూడా వీరిద్దరికీ వ్యతిరేకంగా మారే అవకాశాలున్నాయన్న సంకేతాలు కన్పిస్తున్నాయి.

యూపీలో గెలుపు….

వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్ కీలకంగా మారాయి. అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ లో ఈసారి గెలుపు అంత సులువు కాదు. గత ఎన్నికల మాదిరగా వన్ సైడ్ విజయం లభించదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలపై ఉత్తర్ ప్రదేశ్ ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. ఇక్కడ పార్టీలు విడివిడిగా పోటీ చేయడం బీజేపీకి కలసి వచ్చే అంశమే అయినా అది ఎంతవరకూ వర్క్ అవుట్ అవుతందన్నది ఫలితాలు వెల్లడయ్యే వరకూ చెప్పలేం.

పార్టీలో అసమ్మతి….

ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అధికారానికి దూరమైతే పార్టీలోనే అసంతృప్తి పెరిగే అవకాశముంది. ఇప్పటికే మోదీ, షాలు పార్టీలో నియంతృత్వ ధోరణిని అనుసరిస్తున్నారన్న అభిప్రాయం బలంగా ఉంది. అయితే వారిద్దరూ అన్ని రకాలుగా బలంగా ఉండటంతో బహిరంగంగా ప్రకటన చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం సహజమే. అయితే ఏమాత్రం ఫలితాలు తారుమారైనా అనేక గొంతులు మోదీ, షాలకు వ్యతిరేకంగా విన్పించక తప్పవు.

గుజరాత్ లోనూ అంతే…..

ఇక గుజరాత్ లోనూ అంతే. గుజరాత్ లో గెలుపు కోసం మోదీ, షాలు ఇద్దరూ ఇప్పటి నుంచే వ్యూహాలు మొదలు పెట్టారు. ముఖ్యమంత్రిని మార్చారు. అయితే ఇక్కడ గెలుపు దక్కకపోతే సొంత రాష్ట్రంలోనే ఓటమిపాలయ్యారన్న అపప్రధను ఇద్దరూ ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఇక్కడ రోజురోజుకూ కాంగ్రెస్ బలోపేతం అవుతుంది. ఈ రెండు రాష్ట్రాలు ఈ ఇద్దరి రాజకీయ భవిష్యత్ ను నిర్ణయించనున్నాయన్నది వాస్తవం.

Tags:    

Similar News