యూటర్న్ బాబు… స్టిక్కర్ బాబు

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఇచ్చిన డబ్బుకు లెక్కలు అడిగితే చంద్రబాబు యూటర్న్ తీసుకుని ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు. శుక్రవారం [more]

Update: 2019-03-29 12:16 GMT

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఇచ్చిన డబ్బుకు లెక్కలు అడిగితే చంద్రబాబు యూటర్న్ తీసుకుని ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు. శుక్రవారం ఆయన కర్నూలులో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ… ఇప్పుడు చంద్రబాబు అవినీతి ఆరోపణల్లో బెయిల్ పై తిరుగుతున్న వారితో దోస్తీ చేసి తిరుగుతున్నారని అన్నారు. వీరి మాటల ద్వారా పాకిస్తాన్ లో హీరోలు అవుతున్నారని పేర్కొన్నారు. తన రాజకీయ స్వార్థం కోసం, అసమర్ధతను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు యూటర్న్ లు మొదలుపెట్టారన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు తన స్టిక్కర్ వేసుకొని చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని, అందుకే ఆయన స్టిక్కర్ బాబు అని ఎద్దేవా చేశారు. రైతు కోసం పీఎం కిసాన్ యోజన పథకం తీసుకువస్తే చంద్రబాబు తన స్టిక్కర్ వేసుకున్నారన్నారు.

కుంభకోణాల కోసమే పథకాలా..?

ఆంధ్రప్రదేశ్ లో అవినీతి, కుటుంబ పాలన ఉందన్నారు. అన్నింటా అభివృద్ధి పేరుకుపోయిందని, పథకాల్లో అవినీతిని చూశాము కానీ ఏపీలో మాత్రం కుంభకోణాల చేయడానికే పథకాలు రచిస్తున్నారని ఆరోపించారు. కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసం చంద్రబాబు రాష్ట్రానికి నష్టం చేస్తున్నారని అన్నారు. టీడీపీతో పాటు కాంగ్రెస్, వైసీపీ కుటుంబ పార్టీలన్నారు. కుటుంబ పాలన పోవాలన్నా, అవినీతి అంతం కావాలన్నా, రాష్ట్ర అభివృద్ధి డబుల్ ఇంజన్ తో పరుగెత్తాలన్నా కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. ఐదేళ్ల తమ పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి పూర్తిగా ప్రయత్నించామన్నారు. అయినా చంద్రబాబు తన రాజకీయ స్వలాభం కోసం అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు.

Tags:    

Similar News