మోడీకి కొత్త సవాల్
నరేంద్ర మోడీ ఒకే జెండా, ఒకంటే అజెండా అంటూ దూసుకుపోతున్నారు. ఆయన దశబ్దాలుగా దేశంలో కొరుకుడు పడని సమస్యగా ఉన్న కాశ్మీర్ ని ఒక్కసారిగా రెండు ముక్కలు [more]
నరేంద్ర మోడీ ఒకే జెండా, ఒకంటే అజెండా అంటూ దూసుకుపోతున్నారు. ఆయన దశబ్దాలుగా దేశంలో కొరుకుడు పడని సమస్యగా ఉన్న కాశ్మీర్ ని ఒక్కసారిగా రెండు ముక్కలు [more]
నరేంద్ర మోడీ ఒకే జెండా, ఒకంటే అజెండా అంటూ దూసుకుపోతున్నారు. ఆయన దశబ్దాలుగా దేశంలో కొరుకుడు పడని సమస్యగా ఉన్న కాశ్మీర్ ని ఒక్కసారిగా రెండు ముక్కలు చేసి చాలా సులువుగా పరిష్కరించేశారు. మా కాశ్మీర్ అంటూ కల్లు తాగిన కోతిలా చిందులేసిన పాకిస్తాన్ చేష్టలుడిగి చూడడం తప్ప ఏమీ చేయలేని స్థితికి తెచ్చారు. దేశం మొత్తం మీద స్వాతంత్ర వేడుకలు జరుగుతూంటే కాశ్మీర్లో మువ్వన్నెల జెండా ఇంతవరకూ ఎగిరేది కాదు, ఇపుడు మోడీ ఆ ముచ్చటను తీర్చి తాను మొనగాడు అనిపించుకున్నారు. తనకు ఎవరూ పోటీ సాటి లేరని కూడా చాటి చెప్పారు. ఇంత చేసిన మోడీకి మరో సవాల్ ఎదరవుతున్నట్లుగా కనిపిస్తోంది. దాన్ని ఆయన ఎలా ఎదుర్కొంటారన్నదే ఇపుడు ప్రశ్న.
నాగాలాండ్ ఎత్తిన జెండా….
దేశమంతా స్వాంత్ర దినోత్స వేడుకలు చేసుకుంటూ మువ్వన్నెల జెండాను ముద్దాడుతూంటే నాగాలాండ్ లో మాత్రం సొంత జెండాతోనే ఈసారి వేడుకలు జరుపుకోవడం విశేషం. ఇది నిజంగా విచారకరమైన విషయమే. అయితే భారత దేశంలో కాశ్మీర్ ని అంతర్భాగంగా చేస్తూ ఈసారి అక్కడ కూడా మూడు రంగుల జెండా రెపరెపలు కాంతులీనుతున్న వేళ నాగాలు వేరే జెండా ఎత్తడం మాత్రం కొత్త రకం సవాల్ నే సూచిస్తోంది. నాగాలు ప్రత్యేకంగా ఉంటామని చిరకాలంగా డిమాండ్ చేస్తున్నా వారిని ఏదో ఒక విధంగా కలిపి ఉంచేందుకు అనేక రాయితీలు, చట్టాలు చేస్తూ నాటి నుంచి నేటి ప్రభుత్వాలు ముందుకు కధ నడిపించాయి. అయినా ఈశాన్య రాష్ట్రాల్లో ఆ వేర్పాటు వాదం అలాగే ఉందని చెప్పడానికే ఈ జెండా ఎత్తడం అన్న సంకేతాలు అంటున్నారు. మరి దీన్ని మోడీ ఎలా పరిష్కరిస్తారన్నది చర్చగా ఉంది.
మోడీకి పరీక్షేనా…
దేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యెక జెండా ఉండరాదన్నదే కాశ్మీర్ విషయంలో భారత్ తాజాగా తీసుకున్న కఠిన నిర్ణయం. అంతెందుకు కర్ణాటకకు ఓ జెండా రూపకల్పనకు నిన్నటి ప్రభుత్వాలు ఎంతగానే ప్రయత్నం చేశాయి. ఇలా తెలంగాణాకు ప్రత్యేక జెండా అన్న మాట కూడా అప్పట్లో వినిపించింది. ముందు జెండా అంటారు. తరువాతనే అసలైన హిడెన్ అజెండాలు బయటకు వస్తాయి. ఈ సంగతి తెలిసే మొగ్గలోనే తుంచేయాల్సినవి చేశారు నాటి హోం మంత్రి సర్దార్ వల్లభాయి పటేల్. మిగిలిన సమస్యను కాశ్మీర్ అంత అందంగా మోడీ పూర్తి చేశారు. ఇపుడు నాగాలు కూడా జెండా ఎత్తి మోడీకి సవాల్ చేస్తున్నారు. ఈ కఠిన పరీక్షను మోడీ సర్కార్ ఎలా ఎదుర్కొంటుందన్నది చూడాలి. ఐతే కాశ్మీర్ నే చిటికలో పరిష్కరించిన మోడీకి ఇటువంటివి పెద్ద లెక్క కాదు అంటున్నారు. ఏది ఏమైనా జెండా పండుగ వేళ నాగాల ప్రత్యేక జెండా మాత్రం భారతీయులను కలవరపరచే అంశమే.