ఈ లాక్ డౌన్ సరిపోదట… మరో రెండు వారాలు తప్పదా?
ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి లాక్ డౌన్ ను పొడిగించేందుకు సిద్ధమవుతున్నారు. దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా లాక్ డౌన్ ను ఇప్పట్లో భారత్ [more]
ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి లాక్ డౌన్ ను పొడిగించేందుకు సిద్ధమవుతున్నారు. దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా లాక్ డౌన్ ను ఇప్పట్లో భారత్ [more]
ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి లాక్ డౌన్ ను పొడిగించేందుకు సిద్ధమవుతున్నారు. దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా లాక్ డౌన్ ను ఇప్పట్లో భారత్ లో తీసివేసే పరిస్థితి లేదు. ఇప్పటికే యాభై వేలు దాటిన కరోనా కేసులు ప్రధాని నరేంద్ర మోదీకి ఆందోళనకు గురిచేస్తున్నాయి. మూడోసారి ప్రధాని నరేంద్ర మోదీ మే 17వ తేదీ వరకూ లాక్ డౌన్ ను పొడిగించారు. అయితే ఈసారి ప్రధాని మోదీ ప్రకటన చేయలేదు. కేంద్ర హోం శాఖ ద్వారా ప్రకటన చేయించారు.
మినహాయింపులు ఇచ్చి…..
దీని వెనక కూడా కారణాలున్నాయంటున్నారు. మూడోసారి లాక్ డౌన్ ను కొనసాగించినప్పుడు కొన్ని మినహాయింపులు ఇచ్చారు. అందులో ప్రధానంగా ఆరెంజ్, గ్రీన్ జోన్ లలో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో దేశంలోని అత్యధిక రాష్ట్రాలు మద్యం దుకాణాలను తెరిచాయి. నలభై రోజులుగా ఆదాయం లేకపోవడంతో మద్యం అమ్మకాలతోనే ఖజానాను నింపుకోవాలన్నది రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచన. ఇటు మోదీ నుంచి ఎలాంటి సాయం అందకపోవడంతో ఈ నెల 4వ తేదీనుంచే మద్యం దుకాణాలు తెరిచారు.
నిఘా వర్గాల ద్వారా….
అయితే మద్యం దుకాణాలు, అక్కడ ఉన్న నిబంధనల అమలుపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందంటున్నారు. ఎప్పటికప్పుడు వివిధ రాష్ట్రాల నుంచి ఇంటలిజెన్స్ నివేదికను తెప్పించుకుంటోంది. ఏమాత్రం మద్యం దుకాణాల ద్వారా కరోనా వ్యాప్తి చెందిందని తేలితే వెంటనే మినహాయింపుల నుంచి వాటిని తీసివేస్తామని ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. నిఘా వర్గాల ద్వారా ఎప్పటికప్పుడు రాష్ట్రాల నుంచి సమాచారం తెప్పించుకుంటున్న నివేదికల ప్రకారం తదుపరి చర్యలు ఉంటాయని చెబుతున్నారు.
కేంద్ర బృందాల నివేదికలతో…..
మరో వైపు కేంద్ర బృందాలు కూడా వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నాయి. వాటి నుంచి కూడా పూర్తి నివేదికలు తెప్పించుకున్న తర్వాత మోదీ ప్రజల ముందుకు మరోసారి వస్తారని చెబుతున్నారు. కరోనా వైరస్ ఇప్పట్లో కట్టడి అయ్యే అవకాశం లేదని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ ను పొడిగించాలన్న ఉద్దేశ్యంలో ఉంది. మరో రెండు వారాలపాటు లాక్ డౌన్ ను భారత్ లో పొడిగించే అవకాశాలున్నాయని ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.