ఈసారి భారీగా డ్యామేజీ చేసేది అదేనట
కరోనా సెకండ్ వేవ్ భారత్ ను వణికిస్తుంది. దీని నుంచి బయటపడేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూడా పెద్దగా ఫలించడం లేదు. దీంతో సెకండ్ వేవ్ లో కేంద్ర [more]
కరోనా సెకండ్ వేవ్ భారత్ ను వణికిస్తుంది. దీని నుంచి బయటపడేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూడా పెద్దగా ఫలించడం లేదు. దీంతో సెకండ్ వేవ్ లో కేంద్ర [more]
కరోనా సెకండ్ వేవ్ భారత్ ను వణికిస్తుంది. దీని నుంచి బయటపడేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూడా పెద్దగా ఫలించడం లేదు. దీంతో సెకండ్ వేవ్ లో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం కొట్టొచ్చినట్లు కన్పిస్తుంది. గత ఏడేళ్ల నుంచి మోదీ కి అండగా ఉన్న సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు వ్యతిరేకత కన్పిస్తుంది. సెకండ్ వేవ్ ను ముందుగా పసిగట్టలేక కష్టాలు తెచ్చిపెట్టారని మోదీపై అఖిల భారతం అభిప్రాయపడుతుంది.
కరోనా సమయంలో…..
రోజుకు మూడున్నర లక్షల కేసులు నమోదవుతున్నాయి. కేసుల సంఖ్య విపరీతంగా పెరగడంతో ఆక్సిజన్ కొరతతో పాటు ఆసుపత్రుల్లో బెడ్స్ కొరత కూడా సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో వ్యతిరేకత అంతా మోదీ ప్రభుత్వంపైనే కన్పిస్తుంది. కేవలం ఎన్నికల కోసం మోదీ ప్రభుత్వం కరోనాను వ్యాప్తి చెందేలా చేసిందన్న విమర్శలు ఉన్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల ప్రాణాలను పణంగా పెట్టారన్న కామెంట్స్ కూడా వినపడుతున్నాయి.
సోషల్ మీడియాలో…..
ప్రధానిగా పదవిని చేపట్టేందుకు మోదీకి ఉపయోగపడిన ఒకే ఒక ఆయుధం సోషల్ మీడియా. మోదీ ప్రధాని అయితే ఏదో చేస్తారన్న ప్రచారాన్ని సోషల్ మీడియాలో అప్పట్లో బాగా చేశారు. బీజేపీ సోషల్ మీడియా వింగ్ ప్రధానంగా మోదీ ఇమేజ్ ను పెంచడంతో పాటు కాంగ్రెస్ వైఫ్యల్యాలను, అవినీతిని బాగానే ఎండగట్టింది. ఆ ఫలితమే రెండుసార్లు మోదీ ప్రధాని పీఠాన్ని ఎక్కగలిగారు.
తీవ్ర వ్యతిరేకత……
అయితే గత కొద్ది నెలలుగా మోదీ తీసుకుంటున్న నిర్ణయాలపై అదే సోషల్ మీడియాలో నెగిటెవ్ ప్రచారం బాగా కనపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు సరైన అధికారాలు, నిధులు ఇవ్వకపోవడం, నియంతృత్వ విధానాలను అవలంబించడం వంటి వాటిపై ఘాటు విమర్శలే వినపడుతున్నాయి. ఈసారి ఎన్నికల నాటికి మోదీకి సోషల్ మీడియానే ప్రధాన శత్రువుగా మారనందున్న అంచనాలు ఉన్నాయి. మరి మోదీ ఇమేజ్ డ్యామేజీని ఎంతవరకూ కాపాడుగలుగుతారో చూడాలి.