మోదీలో ఛేంజ్ కు అదే కారణమా?
ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత మోదీ లో కొంచెం ఛేంజ్ కన్పిస్తుంది. మిత్రపక్షాలను అనవసరంగా దూరం చేసుకున్నానన్న భావన ఆయనలో కనపడుతుంది. 2014లో తొలిసారి గెలిచిన తర్వాత [more]
ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత మోదీ లో కొంచెం ఛేంజ్ కన్పిస్తుంది. మిత్రపక్షాలను అనవసరంగా దూరం చేసుకున్నానన్న భావన ఆయనలో కనపడుతుంది. 2014లో తొలిసారి గెలిచిన తర్వాత [more]
ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత మోదీ లో కొంచెం ఛేంజ్ కన్పిస్తుంది. మిత్రపక్షాలను అనవసరంగా దూరం చేసుకున్నానన్న భావన ఆయనలో కనపడుతుంది. 2014లో తొలిసారి గెలిచిన తర్వాత ఎన్డీఏ కూటమి బలంగానే ఉంది. అప్పటి నుంచి మోదీ తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా మిత్రపక్షాలు ఒక్కొక్కటి వైదొలుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వలేదన్న కారణంతో టీడీపీ బయటకు వచ్చేసింది.
అనేక మిత్ర పక్షాలు…
ఇక మహారాష్ట్ర ఎన్నికల్లో శివసేన, బీజేపీ కలసి పోటీ చేసి విజయం సాధించినా ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములాకు అంగీకరించకపోవడంతో శివసేన తన దారి తాను చూసుకుంది. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ అగ్రనాయకత్వం మొండిపట్టుదల కారణంగానే బీజేపీతో ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని సయితం శివసేన తెంచుకుని వెళ్లిపోయింది. ఇక రైతు చట్టాలను తెచ్చిన తర్వాత శిరోమణి అకాలీదళ్ పార్టీ కూడా గుడ్ బై చెప్పేసింది.
ఒకటి అరా తప్ప……
ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో జేడీయూ మరోచిన్నా చితక పార్టీలు తప్ప మరేవీ లేవు. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మోదీ, అమిత్ షాలకు కనువివ్పు కలిగించాయంటున్నారు. అందుకే జారిపోయిన మిత్ర పక్షాలను తిరిగి దగ్గరకు చేసుకోవాలన్న యోచనలో మోదీ ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలను దక్కించుకోవాలంటే శివసేన మద్దతు అవసరం.
వారిని దువ్వుతూ…?
అందుకే మోదీ శివసేన మీద ప్రశంసలు కురిపిస్తున్నారంటున్నారు. కోవిడ్ నియంత్రణలో ఉద్ధవ్ థాక్రే పనితీరు బాగా ఉందని మోదీ మెచ్చుకోలు వెనక కూడా దగ్గరతీయడానికే నని అంటున్నారు. శివసేన తో పాటు ఎన్డీఏని వీడివెళ్లిన కొన్ని ముఖ్యమైన పార్టీలను కూడా తిరిగి రప్పించుకోవాలన్న ప్రయత్నం జరుగుతుందంటున్నారు. వెనువెంటనే కాకున్నా రానున్న కాలంలో ఎన్టీఏలో మిత్రపక్షాల బలం పెంచుకునే ప్రయత్నం ఊపందుకుంటుందని చెబుతున్నారు.