నవీన్ కు అదే మైనస్ … అయినా మారరా?

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఇరవై ఏళ్ల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒడిశా అంటే నవీన్ పట్నాయక్ అని మాత్రమే దేశ ప్రజలకు తెలుసు. గత ఇరవై [more]

Update: 2020-09-09 18:29 GMT

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఇరవై ఏళ్ల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒడిశా అంటే నవీన్ పట్నాయక్ అని మాత్రమే దేశ ప్రజలకు తెలుసు. గత ఇరవై ఏళ్లుగా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నవీన్ పట్నాయక్ కేంద్ర ప్రభుత్వం విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించడం చర్చనీయాంశమైంది. అసలు నవీన్ పట్నాయక్ కు పోరాట పటిమ లేదన్నది ఇప్పుడు ఒడిశాలో విన్పిస్తున్న టాక్. విశేష అనుభవం ఉన్న, ప్రజాబలం ఉన్న నేతగా నవీన్ పట్నాయక్ కేంద్ర ప్రభుత్వం విషయంలో మెతక వైఖరిని అవలంబిస్తుండటం చర్చనీయాంశమైంది.

ఇరవై ఏళ్ల నుంచి……

నవీన్ పట్నాయక్ ను ఐదు సార్లు నుంచి ప్రజలు వరసగా ఆదిరిస్తూ వస్తున్నారు. బిజూ జనతాదళ్ పేరిట నవీన్ పట్నాయక్ పెట్టిన పార్టీ అప్రతిహత విజయాలతో దూసుకుపోతోంది. ఇది ఖచ్చితంగా ఒడిశా వాసులకు నవీన్ పట్నాయక్ పై ఉన్న నమ్మకమేనని చెప్పక తప్పదు. ఒడిశాలో ప్రస్తుతం నవీన్ పట్నాయక్ కు ప్రధాన ప్రత్యర్థి బీజేపీనే. ఒడిశా అసెంబ్లీలో బీజేపీయే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం. కాంగ్రెస్ వెనకబడి పోయింది. రాష్ట్రంలో తన ప్రత్యర్థిగా ఎదుగుతున్న బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నా దాన్ని నవీన్ పట్నాయక్ ప్రశ్నించలేకపోతున్నారు.

తొలి నుంచి అంతే….

నవీన్ పట్నాయక్ తొలి నుంచి కేంద్ర ప్రభుత్వం పట్ల మెతకవైఖరి అవలంబిస్తూ వస్తున్నారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ నవీన్ పట్నాయక్ దాంత సఖ్యతతోనే వెళ్లేవారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పదేళ్లు కూడా ఇదే పరిస్థితి. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చి ఆరేళ్లవుతున్నా నవీన్ పట్నాయక్ తన పంథాను మార్చుకోలేదు. ఒడిశా నిత్యం తుపాను, వరదలతో అల్లాడుతున్నా కేంద్ర నుంచి సరైన సహకారంలేకపోయినా నవీన్ పట్నాయక్ స్పందించిన పాపాన పోలేదు. కేంద్రం ఇచ్చిన దానితోనే సరిపెట్టుకుంటున్నారన్న విమర్శలున్నాయి.

జీఎస్టీ విషయంలోనూ…..

ఇక తాజాగా జీఎస్టీీ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని అనేక రాష్ట్రాలు తప్పుపట్టాయి. రాష్ట్రాలకు కేంద్రం నుంచి వచ్చే నిధులకు గండికొట్టే చర్యలకు దిగుతున్నా నవీన్ పట్నాయక్ స్పందించలేదు. జీఎస్టీ పై స్పందించిన కొన్ని రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులకున్న పరిస్థితులు కూడా నవీన్ పట్నాయక్ కు లేవు. ఆయన స్వతంత్రుడు. ఎటువంటి కేసులు లేవు. ఆయన ఎవరిపై ఆధారపడక్కరలేదు. అయినా నవీన్ పట్నాయక్ కేంద్రం పట్ల ఉదాసీన వైఖరితో వ్యవహరించడం ఆయనకు మైనస్ గా మారింది.

Tags:    

Similar News