నెట్టెం రఘురాంకు `కలిసిరావడం` లేదుగా
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి నెట్టెం రఘురాంకు దేవుడు అనుగ్రహించినా.. పూజారి కరుణించడం లేదన్నట్టుగా ఉంది పరిస్థితి. ఎప్పుడో 90లలో చక్రం తిప్పిన నెట్టెం రఘురాంకు [more]
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి నెట్టెం రఘురాంకు దేవుడు అనుగ్రహించినా.. పూజారి కరుణించడం లేదన్నట్టుగా ఉంది పరిస్థితి. ఎప్పుడో 90లలో చక్రం తిప్పిన నెట్టెం రఘురాంకు [more]
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి నెట్టెం రఘురాంకు దేవుడు అనుగ్రహించినా.. పూజారి కరుణించడం లేదన్నట్టుగా ఉంది పరిస్థితి. ఎప్పుడో 90లలో చక్రం తిప్పిన నెట్టెం రఘురాంకు ఇటీవల చంద్రబాబు పిలిచి పదవి ఇచ్చారు. ఏకంగా విజయవాడ పార్లమెంటరీ పార్టీ ఇంచార్జ్‌ను చేశారు. నిజానికి పార్టీలో ఇటీవల కాలంలో ఇంత పెద్ద గుర్తింపు వస్తుందని బహుశ.. నెట్టెం కూడా ఊహించి ఉండరు. ఆయనకు ఈ పదవి దక్కడంపై సొంత పార్టీ నేతల్లోనే అసహనాలు, అసంతృప్తులు పెల్లుబికాయి. జనాలు మర్చిపోయిన ఈ అవుట్ డేటెడ్ లీడర్‌కు ఈ పదవా ? అని నోరెళ్లబెట్టారు. విజయవాడ పార్లమెంటు పరిధిలో కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉండడంతోపాటు.. బీసీలు కూడా ఎక్కువే.
చాలా ఆశలు పెట్టుకుని….
సో.. ఈ రెండు వర్గాలను సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు నడిపిస్తారని నెట్టెం రఘురాంపై చంద్రబాబు చాలానే ఆశలు పెట్టుకునే ఆయనకు విజయవాడ పార్లమెంటు పగ్గాలు అప్పగించారు. ఇక చంద్రబాబు ప్రకటన అనంతరం నెట్టెం రెండు సార్లు విజయవాడలో పార్టీ కార్యాలయానికి వచ్చారు. పార్టీ పరిస్థితి తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఇదే జిల్లాకు చెందిన నాయకుడు కావడంతో పాటు ఇదే పార్లమెంటు పరిధిలోని జగ్గయ్యపేట నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు మంత్రిగా పనిచేసిన సీనియర్ నాయకుడు కావడంతో ఆయనకు కొత్తగా తెలియాల్సిన అవసరం లేదు.
అందరూ డుమ్మా….
ఈ క్రమంలోనే ఇన్‌చార్జ్ హోదాలో పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని నాయకులతో అనుబంధం పెంచుకునేందుకు నెట్టెం రఘురాం ప్రయత్నించారు. అయితే అనూహ్యంగా ఆయనకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఆయన తాజా సమావేశానికి ఎంపీ కేశినేని నాని అందుబాటులోకి రాలేదు. ఆయన వర్గంగా పేరున్న నాగుల్ మీరా కూడా నెట్టెం సమావేశానికి హాజరు కాలేదు. ఇక, దేవినేని ఉమా బిజీగా ఉన్నానని చెప్పి తప్పించుకున్నారని పార్టీలో పెద్ద చర్చ సాగుతోంది. ఉమాకు నెట్టంకు విజయవాడ పార్లమెంటరీ పార్టీ పగ్గాలు ఇవ్వడం ఎంత మాత్రం ఇష్టంలేదన్న గుసగుసలు కృష్ణా టీడీపీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
కరోనా అని చెబుతున్నా….
ఇక దేవినేని వర్సెస్ నెట్టెం రఘురాం మధ్య దశాబ్దాల వైరం ఉంది. అయితే నెట్టంతో ఇప్పుడు ఎంపీ నాని కూడా అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇక, బుద్ధా వెంకన్న కూడా ఆయనను కేవలం ఫోన్‌లోనే పలకరించినట్టు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో పార్టీ నాయకులు దూరంగా ఉన్నారని.. మరో వారంలో మళ్లీ సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పిన నెట్టెం రఘురాం ఇప్పటి వరకు మళ్లీ విజయవాడ వైపు చూడకపోవడం గమనార్హం. ఇదీ పరిస్థితి. ఇలాంటి మనస్తత్వాలు ఉన్న నేతలతో నెట్టెం రఘురాం పార్టీ బండిని ఎంత వరకు లాక్కొస్తారన్నది ప్రశ్నార్థకమే.