ఇద్దరూ ఒక్కటయ్యారా? నిజమేనా?
జమ్మూ కాశ్మీర్ లో కొత్త రాజకీయాలు ప్రారంభం కాబోతున్నాయి. ఎవరూ ఊహించని సమీకరణాలు చోటు చేసుకోబోతున్నాయి. ఇప్పటి వరకూ ఉప్పు నిప్పుగా ఉన్న పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ, [more]
జమ్మూ కాశ్మీర్ లో కొత్త రాజకీయాలు ప్రారంభం కాబోతున్నాయి. ఎవరూ ఊహించని సమీకరణాలు చోటు చేసుకోబోతున్నాయి. ఇప్పటి వరకూ ఉప్పు నిప్పుగా ఉన్న పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ, [more]
జమ్మూ కాశ్మీర్ లో కొత్త రాజకీయాలు ప్రారంభం కాబోతున్నాయి. ఎవరూ ఊహించని సమీకరణాలు చోటు చేసుకోబోతున్నాయి. ఇప్పటి వరకూ ఉప్పు నిప్పుగా ఉన్న పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు కలసి పనిచేయడానికి సిద్ధమయ్యాయి. పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ, ఎన్సీ నేతలు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాలు ఈ ప్రకటన చేయడం జమ్మూ కాశ్మీర్ రాజకీయలలో ప్రాధాన్యత సంతరించుకుంది.
ఏడు దశాబ్దాల నుంచి….
గత ఏడు దశాబ్దాల జమ్మూ కాశ్మీర్ రాజకీయాలను పరిశీలిస్తే రెండు కుటుంబాలే రాజకీయాల్లో చక్రం తిప్పగలిగాయి. అబ్దుల్లా, ముఫ్తీ కుటుంబాలే కాశ్మీర్ రాజకీయాలను శాసించాగలిగాయి. ఈ కుటుంబాల నుంచి మాత్రమే ఎక్కువ సార్లు ముఖ్యమంత్రులు కాగలిగారంటే వీరి ప్రభావం కాశ్మీర్ లో ఎంతగా ఉందో చెప్పనవసరం లేదు. అయితే ఎక్కువ కాలం కాశ్మీర్ ను పాలించింది నేషనల్ కాన్ఫరెన్స్ మాత్రమే. నేషనల్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకుడు షేక్ అబ్దుల్లా, ఆయన తనయుడు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాలు ముఖ్యమంత్రులు కాగలిగారు.
ఆ కుటుంబాలే…..
ఇక నేషనల్ కాన్ఫరెన్స్ నేత ముఫ్తీ మహ్మద్ సయీద్ కాంగ్రెస్ నుంచి వేరుపడి పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ ను ఏర్పాటు చేసుకున్నారు. ఈయన కూడా కాశ్మీర్ కు రెండు సార్లు ముఖ్యమంత్రి కాగలిగారు. ఒకసారి కాంగ్రెస సాయంతో, మరొకసారి బీజేపీ సాయంతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కూతురు మెహబూబా ముఫ్తీ కూడా బీజేపీ సాయంతో ముఖ్యమంత్రి అయ్యారు. ఇలా రెండు పార్టీలు ఎప్పుడూ శత్రువులుగానే ఉన్నాయి.
కాశ్మీర్ కోసం…..
కానీ ప్రస్తుతం రెండు పార్టీలు కలసేందుకు సిద్ధమయ్యాయి. జమ్మూకాశ్మీర్ లో స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా నెలల పాటు మెహబూబా ముఫ్తీ, ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాలను గృహనిర్భంధంలో ఉంచింది. ఇటీవల విడుదల చేసింది. జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని తిరిగి సాధించేందుకు ఈ రెండు పార్టీలు కలసి పీపుల్స్ అలయన్స్ ను ఏర్పాటు చేశాయి. 2019 ఆగస్టు నాటి ముందు హక్కులను కాశ్మీరీలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ పార్టీలు కలసి పనిచేయనున్నాయి. మొత్తం మీద బద్ధ శత్రువులుగా ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీలు ఒక్కటవ్వడం జాతయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.