Nimmagadda : నిమ్మగడ్డ మళ్లీ గుర్తుకొస్తున్నారే?
ఒక్కోసారి వాటంతట అవే కలసి వస్తుంటాయి. అదృష్టం అధికారుల రూపంలో కూడా వస్తుంది. ఇందుకు ఉదాహరణ నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఆయన రాష్ట్ర ఎన్నికల అధికారిగా తీసుకున్న [more]
ఒక్కోసారి వాటంతట అవే కలసి వస్తుంటాయి. అదృష్టం అధికారుల రూపంలో కూడా వస్తుంది. ఇందుకు ఉదాహరణ నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఆయన రాష్ట్ర ఎన్నికల అధికారిగా తీసుకున్న [more]
ఒక్కోసారి వాటంతట అవే కలసి వస్తుంటాయి. అదృష్టం అధికారుల రూపంలో కూడా వస్తుంది. ఇందుకు ఉదాహరణ నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఆయన రాష్ట్ర ఎన్నికల అధికారిగా తీసుకున్న నిర్ణయాలు అధికార పార్టీ వైసీపీకి కలసి వచ్చాయనే చెప్పాలి. ఆయన దూకుడుగా వ్యవహరించిన తీరు ప్రజల్లో జగన్ పై సానుభూతి పెంచింది. దాని ఫలితమే ఏపీలో ఏ ఎన్నిక జరిగినా వన్ సైడ్ ఫలితాలు రావడం. జడ్పీటీసీ ఎన్నికల్లోనూ వైసీపీ ఏకపక్ష విజయం దక్కించుకుంది. ఇందుకు వైసీపీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఖచ్చితంగా అభినందించాల్సిందే.
ముప్పు తిప్పలు పెట్టి….
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్ గా దిగిపోయి చాలా కాలమయింది. అయితే ఆయనను ఈరోజు మరోసారి గుర్తుకు తెచ్చుకోవాల్సి వచ్చింది. ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా వైసీపీ ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టారు. ప్రభుత్వానికి సంబంధం లేకుండా నిర్ణయాలు తీసుకున్నారు. న్యాయస్థానాలను ఆశ్రయించి మరీ ఎన్నికలు నిర్వహించారు. తొలుత కరోనా కారణంగా వాయిదా వేసినా ఆ తర్వాత కరోనా తీవ్రంగా ఉన్న సమయంలోనూ ఎన్నికలు జరిపి ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చారు.
కావాలని వాయిదా….
అయితే మున్సిపల్, పంచాయతీ ఎన్నికలను నిర్వహించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను కావాలని వాయిదా వేశారు. అంతకు ముందే నోటిఫికేషన్ విడుదల చేసినా వాటిని పక్కన పెట్టి పంచాయతీ ఎన్నికలు జరిపారు. తెలుగుదేశం పార్టీకి పరోక్షంగా సహకరించేందుకే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారని అప్పట్లో విమర్శలు విన్పించాయి. మొత్తం మీద ఆయన సమక్షంలో జరిగిన ఎన్నికల్లోనూ వైసీపీ ఘన విజయం సాధించింది.
ఇక్కడా ఏకపక్షమే….
ఇక ఆయన పదవీ కాలం పూర్తయిన తర్వాత జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ వైసీపీ ఏకపక్ష విజయం సాధించింది. టీడీపీ ఈ ఎన్నికలకు బహిష‌్కరణకు పిలుపు ఇవ్వడం, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలను తీసుకుని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూడటం, విపక్షానికి పరోక్షంగా మద్దతు పలకడం వంటి కారణాలతో ప్రజలు వైసీపీకి ఈ ఎన్నికల్లో చేరువయ్యారు. మొత్తానికి వైసీపీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే.