నిమ్మగడ్డకు ఆ ఉద్దేశ్యం ఉందా…?
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇపుడు ఏపీ రాజకీయాల్లో బాగా పాపులర్ అవుతున్నారు. ఆ మాటకు వస్తే ఆయన పేరు పొరుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ గట్టిగానే వినిపిస్తోంది. [more]
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇపుడు ఏపీ రాజకీయాల్లో బాగా పాపులర్ అవుతున్నారు. ఆ మాటకు వస్తే ఆయన పేరు పొరుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ గట్టిగానే వినిపిస్తోంది. [more]
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇపుడు ఏపీ రాజకీయాల్లో బాగా పాపులర్ అవుతున్నారు. ఆ మాటకు వస్తే ఆయన పేరు పొరుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ గట్టిగానే వినిపిస్తోంది. మరి కేవలం ఏడాది వ్యవధిలో ఇంతలా వచ్చిన పేరుని ఆయన రేపటి రోజున దానిని వాడుకోకుండా ఉంటారా అన్న చర్చ అయితే వస్తోంది. ఏపీలో రాజకీయ పరిస్థితులు అందరికీ తెలుసు. నిమ్మగడ్డని వైసీపీ సర్కార్ గట్టిగా వ్యతిరేకిస్తోంది. అదే సమయంలో టీడీపీ నేతలు ఆయన్ని హీరోగా కీర్తిస్తున్నారు. మరి నిమ్మగడ్డ రిటైర్ అయ్యాక కేవలం ఇంట్లోనే కూర్చుంటారా? అంటే సందేహమే అంటున్నారు.
అలవాటేగా ..?
తెలుగుదేశం పార్టీకి అధికారులనే కాదు, ఎవరైనైనా వాడుకోవడం అలవాటే. జగన్ మీద సీబీఐ కేసులను విచారించిన నాటి జేడీ లక్ష్మీనారాయణకు ఊరూ వాడా పెద్ద పెద్ద కటౌట్లు పెట్టి మరీ తనకు అనుకూలంగా టీడీపీ వాడుకుంది. 2014 ఎన్నికలకు ముందు జేడీ పేరిట టీడీపీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఒక వర్గం ఓటర్లు, తటస్థులు, మధ్య తరగతి వర్గాల ఓట్లను కూడా ఆ విధంగా టీడీపీ ప్రభావితం చేసి 2014లో అధికారం సంపాదించుకుంది. ఇక సమైక్యాంధ్రా ఉంద్యమ సారధిగా ఉద్యోగుల తరఫున నాయకత్వం వహించిన అశోక్ బాబుని కూడా తమ వైపునకు తిప్పుకుని టీడీపీ ఆ వర్గాన్ని లాగేసింది. బాగా లాభపడింది.
అపుడే రెడీనా…?
ఇపుడు చూస్తే ఒక ఎన్నికల అధికారిగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి గట్టి మద్దతు ఇస్తూ టీడీపీ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు, ఆయన ఉంటేనే ఏపీలో స్వేచ్చగా పారదర్శకంగా ఎన్నికలు జరుగుతాయని టీడీపీ నాయకుడు అచ్చెన్నాయుడు అంటున్నారు. మరి 2018లో ఆయనే కదా ఎన్నికల అధికారిగా ఉన్నారు. ఆయన నాయకత్వాన నాడు ఎన్నికలకు ఎందుకు టీడీపీ వెళ్ళలేదో అచ్చెన్న చెబుతారా అంటే జవాబు ఉండదు, ఇపుడు మాత్రం ఆనే కావాలి అంటున్నారు. ఆ విధంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పరపతిని బాగా పెంచుతున్న టీడీపీ ఉద్దేశ్యాలు చాలానే ఉన్నాయని అంటున్నారు.
కామ్ గా ఉండరా..?
ఒకటి మాత్రం నిజం. నిమ్మగడ్డ రమేష్ కుమార్ మార్చిలో పదవీ విరమణ చేశాక కామ్ గా తన ఇంటికి పరిమితం అవుతారని ఎవరైనా అనుకుంటే పొరపడినట్లే అంటున్నారు. ఆయన మళ్లీ లైమ్ లైట్ లో ఉండేందుకు ప్రయత్నిస్తారని, దానికి ప్రాతిపదిక కూడా సిధ్ధంగా ఉందని అంటున్నారు. ఇక నిమ్మగడ్డ విషయంలో వైసీపీ ప్రత్యేకించి జగన్ వ్యతిరేకించడం కూడా మరో వర్గానికి అనుకూలమే అవుతుంది అంటున్నారు. మరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ చివరి ఏడాదిలో దూకుడు ప్రదర్శించి రాష్ట్ర ఎన్నికల అధికారి పాత్రను అమాంతం పెంచేశారు అంటున్నారు. ఆయన భవిష్యత్తు అడుగులు ఎలా ఉంటాయన్నది మాత్రం ఇపుడు ఆసక్తికరమైన చర్చగానే ఉంది.